పి ఆర్ సి ని 55% ఫిట్మెంట్ తో పదకొండవ పిఆర్సి అమలు చేయాలి

Date:22/04/2021

ఎమ్మిగనూరు ముచ్చట్లు:

55 శాతం ఫిట్మెంట్ తో 11 వ పి ఆర్ సి అమలు చేయాలని, పి ఆర్ సి నివేదిక బహిర్గతం చేయాలని యుటిఎఫ్ కార్యదర్శి  నాగమణి డిమాండ్ చేశారు. గురువారం  ఎమ్మిగనూరు లోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం వద్ద యుటిఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి నాగమణి, రాష్ట్ర కౌన్సిలర్ నాగరాజు, నాయకులు దావీద్ మాట్లాడుతూ  పి ఆర్ సి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన అన్ని మండల కేంద్రాల్లో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నదని వారు తెలిపారు.  వారు మాట్లాడుతూ అశుతోషు మిశ్రా ఆధ్వర్యంలో 2018 మే 25 వ తేదీన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.6 నెలల కిందటే కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించినా ఆ నివేదికలో ఉన్న అంశాలు ఇప్పటి వరకు బహిర్గతం చేయకుండా ఆ కమిటీ లోని అంశాలను అధ్యయనం చేయడానికి 6 మందితో మళ్లీ కమిటీ వేసి కాలయాపన చేస్తుంది అని విమర్శించారు. ఎన్నికల ముందు పిఆర్సి వెంటనే అమలు చేస్తానని, కమిషన్ రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చిన ఆరు నెలలు పూర్తయినప్పటిక ప్రభుత్వం  మీనమేషాలు లెక్కించడం తగదన్నారు. పి ఆర్ సి ని 55 శాతం ఫిట్మెంట్ తో 01.07.2018 నుండి ఇవ్వాలని లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ధర్నా అనంతరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి బంగారమ్మ కు వినతిపత్రం అందజేశారు. సీనియర్ నాయకులు దేవపాల్, కౌలన్న,  వై రామాంజనేయులు, లక్ష్మన్న, చిన్న ఎల్లప్ప, రాజు వీరభద్రయ్య, గురుస్వామి రవికుమార్ జయమ్మ అరవింద, ద్రాక్షమ్మ,  విరుపాక్షి , రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు ప్రజల సమ్యలపై తక్షణం స్పందించాలి-ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు

Tags; The Eleventh Park Should Implement the Park with 1% Fitment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *