పుంగనూరులో కరోనా ప్రభావం ఈడిగపల్లె లాక్‌డౌన్‌

Date:03/05/2021

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలో ప్రధాన వ్యాపార కేంద్రమైన ఈడిగపల్లెలో కరోనా తీవ్రం కావడంతో లాక్‌డౌన్‌ చేసినట్లు ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు తెలిపారు. సోమవారం మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసానిభాస్కర్‌రెడ్డితో కలసి ఆయన ఈడిగపల్లెలో పర్యటించి లాక్‌డౌన్‌ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామాల్లో కరోనా తీవ్రంకావడంతో ప్రభుత్వాదేశాల మేరకు లాక్‌డౌన్‌ చేపట్టామన్నారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు వ్యాపారాలకు అనుమతిస్తామన్నారు. మిగిలిన సమయంలో పూర్తిగా లాక్‌డౌన్‌ను పటిష్టంగా చేపట్టేలా సంబంధిత శాఖలకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్‌, మండల కార్యదర్శి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు డిపోకు 65 సర్వీసులు కేటాయింపు

Tags: Efecto corona en el encierro de Punganur Idigapalle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *