పుంగనూరులో కర్ఫ్యూకు పట్టణ ప్రజలు సహకరించండి -చైర్మన్‌ అలీమ్‌బాషా

Date:04/05/2021

పుంగనూరు ముచ్చట్లు:

కరోనా తీవ్రమౌతున్న నేపధ్యంలో నియంత్రణ కోసం ప్రభుత్వం విధించిన కర్ప్యూకు ప్రజలు సహకరించాలని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా కోరారు. మంగళవారం ఆయన, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ నాగభూషణంతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ పట్టణంలో ఇప్పటి వరకు పట్టణంలో సుమారు 500 మందికి కరోనా సోకిందని , 22 మంది మృత్యువాత పడ్డారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించి, ఇండ్లలోనే గడపాలని, బయటకు రావద్దని సూచించారు. కరోనా భారీన పడకుండ ఉండేందుకు ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు. నాగభూషణం మాట్లాడుతూ ప్రజలకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా నిబంధనలు పాటించి కరోనా నియంత్రణకు సహకరించండని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, మేనేజర్‌ రసూల్‌ఖాన్‌, అకౌంట్స్ ఆఫీసర్‌ మనోహర్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సఫ్ధర్‌ పాల్గొన్నారు.

పుంగనూరులో 6న డిపో ప్రారంభంపై కలెక్టర్‌ పరిశీలన

Tags: La población urbana coopera para el toque de queda en Punganur: presidente Aleem Basha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *