పుంగనూరులో పేదలకు సిఎం రిలీప్‌ ఫండ్‌ వరం

Date:03/05/2021

పుంగనూరు ముచ్చట్లు:

సిఎం రిలీప్‌ ఫండ్‌ పేదలకు వరంగా మారిందని చిత్తూరు ఎంపి రెడ్డెప్ప తెలిపారు. సోమవారం సిఎం రిలీప్‌ ఫండ్‌ చెక్కులను ఎంపి, చైర్మన్‌ అలీమ్‌బాషాతో కలసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సిఎం రిలీప్‌ ఫండ్‌ను పేదలకు అందించడం అభినందనీయమన్నారు. పట్టణానికి చెందిన ఉమేష్‌కు రూ.5 లక్షలు, నాగరాజుకు రూ.3 లక్షలు, పద్మావతికి రూ.3.20 లక్షలు, అష్రప్‌ఉన్నిసాకు రూ.42 వేలు చెక్కులను అందజేసిన ఘనత మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, మేనేజర్‌ రసూల్‌ఖాన్‌, పార్టీ నాయకులు మహబూబ్‌బాషా ,లక్ష్మణ్‌రాజు పాల్గొన్నారు.

పుంగనూరు డిపోకు 65 సర్వీసులు కేటాయింపు

Tags: CM Relief Fund ayuda a los pobres en Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *