పుంగనూరులో 6న డిపో ప్రారంభంపై కలెక్టర్‌ పరిశీలన

Date:04/05/2021

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు ఆర్టీసి డిపోను ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 6న అమరావతి నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు. ఈ ఏర్పాట్లను పరిశీలించేందుకు మంగళవారం జిల్లా కలెక్టర్‌ హరినారాయణ్‌ , సబ్‌ కలెక్టర్‌ జాహ్నవి కలసి ఆర్‌ఎం చెంగల్‌రెడ్డితో చర్చలు జరిపారు. డిపోలో బస్సులు, సిబ్బంది కేటాయింపు వివరాలను తెలుసుకున్నారు. అలాగే గ్యారేజ్‌తో పాటు మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. 5న సబ్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో వర్చువల్‌ విధానాన్ని డెమో నిర్వహించి, 6న సీఎం ప్రారంభానికి పటిష్టమైన ఏర్పాట్లను చేపట్టారు. ఈ కార్యక్రమంలో తహశీల్ధార్‌ వెంకట్రాయులు, ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు, మేనేజర్‌ సుధాకర్‌, వైఎస్‌ఆర్‌ ఆర్టీసి మజ్ధూర్‌ అధ్యక్షుడు జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు డిపోకు 65 సర్వీసులు కేటాయింపు

Tags: Observación del coleccionista sobre la apertura del depósito en Punganur el día 6

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *