పుంగనూరు డిపోకు 65 సర్వీసులు కేటాయింపు

Date:28/04/2021

పుంగనూరు ముచ్చట్లు:

నూతనంగా ప్రారంభించనున్న పుంగనూరు ఆర్టీసి డిపోకు బస్సు సర్వీసులను , రూట్‌లను కేటాయిస్తూ డిప్యూటి చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు నూతన డిపోకు 65 సర్వీసులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పుంగనూరు నుంచి చెన్నైకి ఎక్స్ప్రెస్‌ సర్వీసులను , హైదరాబాద్‌ -కడపకు , విజయవాడ, బెంగళూరుకు ఎక్స్ప్రెస్‌ సర్వీసులను , విజయవాడకు ఇంద్ర రెండు సర్వీసులను నడపనున్నారు. డిపో పనులు , ఆర్చినిర్మాణం పూర్తికావడం జరిగింది. మంత్రి పెద్దిరెడ్డి సూచనల మేరకు ప్రారంభం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

కాఫీ బోర్డు జయరామిరెడ్డి మృతి

Tags: Asignación de 65 servicios a Punganur Depot

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *