.పెండింగ్ భూ సమస్యలను  పరిష్కరించాలి :: అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ

 

Date;26/02/2020

.పెండింగ్ భూ సమస్యలను  పరిష్కరించాలి :: అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ
-పెండింగ్ డిజిటల్ సంతకాల ప్రక్రియపూర్తి చేయాలి

-భూ  సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

-ప్రజావాణీ  ఫిర్యాదుల  పై  చర్యలు తీసుకోవాలి
-ప్రజావాణీ, భూశుద్దీకరణ అంశాల పై అదనపు కలెక్టర్ సమీక్
జిల్లాలో ఉన్న  పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని  అదనపు కలెక్టర్  లక్ష్మీ నారాయణ  సంబంధిత అధికారులను ఆదేశించారు.  భూ సమస్యలు, ప్రజావాణీ  ఫిర్యాదుల  పై మంగళవారం కలెక్టరేట్ లోని తన చాంబర్లో  అదనపు  కలెక్టర్  తహసిల్దార్లతో    సమీక్ష నిర్వహించారు.  భూ సంబంధిత అంశాల గురించి అదనపు  కలెక్టర్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.      భూ  సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని,  డిజిటల్ సంతకాలు  పెండింగ్ లో ఉండటానికి గల కారణాలను  అదనపు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.       భూ సమస్యల పరిష్కారం పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వీలైనంత త్వరగా  పూర్తి చేయాలని,  పెండింగ్ అంశాలు  సింగల్ డిజిట్ కు తీసుకొని   రావాలని అదనపు  కలెక్టర్ ఆదేశించారు.    జిల్లా వ్యాప్తంగా   పెండింగ్ లో  ఉన్న మీ సేవా మ్యూటేషన్, సక్సెషన్ దరఖాస్తులను  ప్రభుత్వ నిబంధనలకు లోబడి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి  పరిష్కరించాలని  అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.  మీ సేవా నుంచి వచ్చే దరఖాస్తులను నిర్ణీత కాలపరిమితిలో  పూర్తి చేసే విధంగా  చర్యలు తీసుకోవాలని,  పెండింగ్ లో  ఉంచకుండా  సమస్యలను త్వరగా పరిష్కరించాలని  అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.   ప్రజావాణీ  కార్యక్రమంలో భాగంగా  మండలాల వారిగా వచ్చీన దరఖాస్తులను , వాటి పై తీసుకున్న చర్యల గురించి  అదనపు కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.   ప్రజల సమస్యల పై  వెంటనే స్పందించి  అవసరమైన చర్యలు తీసుకొవాలని సూచించారు.
జిల్లా ఇంచార్జి డిఆర్వో  కె.నరసింహమూర్తి, కలెక్టర్ ఏఒ  ప్రసాద్, జీల్లాలోని తహసిల్దార్లు, సంబంధిత అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గోన్నారు

 

పట్టణ ప్రగతితో మరింత అభివృద్ధి మున్సిపల్ చైర్మన్ డాక్టర్ మమత రెడ్డి

 

Tags;.Pending land issues should be resolved :: Additional Collector Lakshminarayana

 

;

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *