పోలీసులుకు పిర్యాదు చేసిన షర్మిళ

Sharmila who complained to police

Sharmila who complained to police

Date:14/01/2019
హైదరాబాద్ ముచ్చట్లు:
సోషల్ మీడియాలో తనపై, తన కుటుంబ సభ్యులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ అంజనీకుమార్ కి వైసీపీ నాయకురాలు వైఎస్ షర్మిళ ఫిర్యాదు చేశారు.సోమవారం ఉదయం ఆమె పోలీసు కమిషనర్ ను కలిశారు. తరువాత ఆమె మీడియాతో మాట్లాడారు. తనపై, తన కుటుంబంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.  నా వ్యక్తిత్వం దెబ్బతీసేలా సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. దీనిపై మాట్లాడకుంటే ఇది నిజమని నమ్మే ప్రమాదముంది. అందుకే ఈ రోజు ఫిర్యాదు చేయడానికి వచ్చానని వెల్లడించారు.  తప్పుడు రాతలు రాస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి చర్యలు మహిళలకు అవమానకరం. 2014 ఎన్నికల కు ముందు నాకు, నటుడు  ప్రభాస్ తో సంబంధం వుందని అసత్య ప్రచారం చేశారు. అపుడు పోలీసులకు ఫిర్యాదు చేసాం. మధ్యలో ఆ ప్రచారం ఆగింది. కానీ ఇపుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి తో మళ్ళీ ఈ అసత్య ప్రచారం ఒక వర్గం చేస్తుంది.
దీని వెనకాల ఉన్న వారి మీద చేయలు తీసుకోవాలని ఫిర్యాదు చేసాం. కనీసం మానవత్వం లేకుండా ఈ విధంగా దుష్ప్రచారం చేయడాం సరియైనది కాదని ఆమె అన్నారు. వెబ్  సైట్, సోషల్ మీడియా లో దుష్ప్రచారం ఎవరు చేయకుండా చర్యలు తీసుకోవాలని, అందరూ కలిసి రావాలని కోరుతున్నాం. తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారు కాకుండా,చూపిస్తున్న వారి పైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఒక తల్లి గా చెల్లి గా నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేవు. .కానీ నా గౌరవం కాపాడుకోవాలని నెం బైటికి వచ్చి ఫిర్యాదు చేశా. నెను ఇప్పటి వరకు ప్రభాస్ తో కలవలేదు. నా పిల్లల మీద ప్రమాణం చేసి నిజం చెప్తున్నాను. తెలుగు దేశం పార్టీ హస్తం ఉంది అని నేను ఆరోపిస్తున్నాను. గతం లో  మా నాన్న వైఎస్సార్  మీద తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు .దీనికి కేవలం తెలుగు దేశం పార్టి వెనకాల ఉంది.
వారే  ప్రచారం చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఒకవేళ వాళ్ళు ఈ ప్రచారం లేకుంటే నామీద వచ్చిన దుష్ప్రచారం పై బాబు ఎందుకు స్పందించలేదు. రాజకీయాలను ఇంతగా దిగజార్చుతున్నారు. చంద్ర బాబు ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు..అసత్య ప్రచారం చేయవచ్చు…కానీ మేము అలా చేయం..మేము విలువలతో కూడిన మనుషులమని షర్మిళ అన్నారు. చంద్రబాబు ఎపుడు మోసపూరిత ఆలోచనలతో ఉన్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తి రాజకీయ ల్లో ఉంటే సమాజం కు మంచిది కాదు. ఆంధ్ర ప్రదేశ్ పోలీసుల మీద నాకు నమ్మకం లేదు..అందుకే ఇక్కడ ఫిర్యాదు చేసానని అన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయనకు అందించానని, ఆయన సానుకూలంగా స్పందించి, విచారణ జరిపిస్తానని మాటిచ్చారని అన్నారు. ఆమె వెంట భర్త అనిల్ కుమార్, పార్టీ నేతలు  వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వాసిరెడ్డి పద్మ ఉన్నారు.
Tags:Sharmila who complained to police

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *