ప్రజలకు అవగాహన కల్పించండి ఎమ్మెల్యే ఆర్థర్.        

Date:04/05/2021

పాములపాడు     ముచ్చట్లు:

కరోనా వ్యాప్తిని అరికట్టడానికి నేటి నుండి రెండు వారాల పాటు కఠిన ఆంక్షలను అమలు చేస్తారని నందికొట్కూరు శాసనసభ్యులు  తోగురు ఆర్థర్  అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు కరోనా పట్ల ప్రజలలో ధైర్యం పెంపొందించాలని అలాగే ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ అధికారులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు   పాములపాడు మండల వ్యాప్తంగా కఠిన ఆంక్షలు అమలు చేస్తామని అన్నారు కమిటీ సభ్యులు ఎమ్మార్వో వేణుగోపాల్ రావు ఎంపీడీవో రాణెమ్మ ఎస్ఐ రాజ్ కుమార్ లు తెలియజేశారు.రోజు రోజుకు ఉగ్రరూపం దాలుస్తున్న కరోనా వైరస్ ప్రభావం వలన మే 5వ తేదీ నుండి రెండు వారాల పాటు ఆంక్షలను అమలు చేస్తున్నట్టు వారు తెలియజేశారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతి ఉంటుందని,12 గంటల తరవాత షాపు యజమానులు స్వచ్ఛందంగా మూసివేయాలని వారు తెలియజేశారు.12 గంటల అనంతరం మండల వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు అవుతుందని వారు తెలియజేశారు.మధ్యాహ్నం 12 గంటల తర్వాత అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని వారు తెలియజేశారు.ప్రభుత్వం నిర్దేశించిన ఆంక్షలను అనుసరించి ప్రజలు నడుచుకోవాలని వారు తెలియజేశారు.ప్రజలు గ్రామాలలో గుంపులు గుంపులుగా ఉండకుండా మాస్క్లను ధరించి భౌతిక దూరాలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని వారు తెలియజేశారు.అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదు అని వారు హెచ్చరించారు.ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు తప్పకుండా మాస్కులు ధరించాలని వారు తెలియజేశారు.గ్రామాలలోని ప్రజలకు ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఏర్పడితే గ్రామ సచివాలయ కమిటీ సభ్యులకు వెంటనే సమాచారం అందించాలని ఎస్ ఐ రాజ్ కుమార్ తెలియజేశారు.కావున ప్రజలు ప్రభుత్వం నిర్దేశించిన ఆంక్షలను తప్పకుండా పాటిస్తూ అధికారులకు సహకరించాలని వారు తెలియజేశారు.కోవిడ్ ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు.

పుంగనూరు డిపోకు 65 సర్వీసులు కేటాయింపు

Tags:Make people aware Ms Arthur.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *