ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ  తగిన జాగ్రత్తలు తీసుకోవాలి-జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు

Date:04/05/2021

నెల్లూరు ముచ్చట్లు:

కరోనా వైరస్‌ పట్ల ప్రజలుఆందోళనచెందకుండా ధైర్యంగా  ఉండాలి అని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొనమంగళవారం కోట మండలంలోని, కోట అడ్డరోడ్డులో కరోనా పాజిటివ్ తో హామ్ హైసిలేషన్ లో ఉన్న ఓ పేషెంట్లను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి పరామర్శించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా సెకండ్‌వేవ్‌ తీవ్రంగా ఉందన్నారు. 90 శాతం ప్రజలకు కరోనా వచ్చేది, వెళ్లేది కూడా తెలియదన్నారు. కేవలం 10 శాతం మంది మాత్రమే ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీరిలో 5 శాతం మందికి మాత్రమే సీరియస్‌గమారుతుందన్నారు. కొవిడ్‌ లక్షణాలు తక్కువగా ఉన్నవారు ఇళ్లవద్దనే ఐసోలేషన్‌లో ఉంటూ, పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటూ వైద్యుల సూచనల మేరకు మందులు వేసుకుని విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందన్నారు.సీరియస్‌ కేసులకు సంబంధించి  గూడూరు ఏరియా ఆసుపత్రిలో 20 పడకలతో ఐసోలేషన్‌ వార్డుతోపాటు ఐసీయూ సిద్దం చేసినట్లు వెల్లడించారు.  గూడూరు పట్టణ పరిధిలోని టిడ్కో భవనంలోని కొవిడ్‌కేర్‌ సెంటర్‌లో కూడా వైద్యసేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.అదేవిధంగా గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో కోట ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా 10 కోవిడ్ బెడ్ లు ఏర్పాటు చేసి ఆక్సిజన్  అందించే విధంగాచర్యలుతీసుకున్నామని తెలిపారు.

 

 

ప్రజలు కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.నెల్లూరు జిల్లాకు 25 వేల కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో  ఉంచాం అని,కరోనా గురించి ఎవరూ కుడా భయపడాల్సిన అవసరం  లేదన్నారు.  ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు  గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ, డి పి ఓ ధనలక్ష్మి, స్పెషల్ ఆఫీసర్ సురేష్ కుమార్,కోట తాహిసిల్దార్ రమాదేవి, కోట ఎంపీడీవో సుబ్బారావు, ఈ ఓ పి ఆర్ డి స్వరూపారాణి, స్టాఫ్ నర్స్, ఏఎన్ఎంలు, గ్రామ కార్యదర్శులు, పంచాయతీ సెక్రటరీలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో 6న డిపో ప్రారంభంపై కలెక్టర్‌ పరిశీలన

Tags: Las personas deben seguir las reglas de Kovid y tomar las precauciones adecuadas: recolector del distrito Chakradhar Babu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *