ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి

Date:03/05/2021

రామసముద్రం ముచ్చట్లు:

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి అన్నారు. సోమవారం స్థానిక పంచాయతీ కేంద్రమైన కెసిపల్లి గ్రామంలో గ్రామంలో కరోన నివారణ చర్యల్లో భాగంగా 20 మందికి వైద్య సిబ్బందిచే కరోన పరీక్షలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ పిచికారి చేపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. కరోన మహమ్మారి వల్ల పేద కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని ప్రత్యేకంగా వైద్యశాలలతో కరోన కేర్ సెంటర్లు ఏర్పాటు చేశారన్నారు. అంతేకాకుండా మదనపల్లి శాసన సభ్యులు నవాజ్ బాషా కూడా ప్రజారోగ్యం కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే నవాజ్ బాషా మండలంలో పంచాయతీల వారీగా ఎప్పటికప్పుడు కరోన కేసుల వివరాలు తెలుసుకుంటూ ప్రజలు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారన్నారు. ప్రజలందరూ కరోన మహమ్మారికి గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరం ఉంటే తప్ప ప్రజలు ఎవ్వరూ బయటకు రాకూడదని, భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని ప్రజలకు సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, ఏఎన్ఎం సుగుణమ్మ, ఆశ వర్కర్ మంజుల, మహిళా పోలీసు గౌతమి, వెల్పేర్ అసిస్టెంట్ ఉపేంద్ర, నాయకులు బాబు, ఎల్లారెడ్డి విటి.జయచంద్ర, మునస్వామి, వాలింటర్లు రెడ్డెమ్మ, ప్రదీప్, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు డిపోకు 65 సర్వీసులు కేటాయింపు

Tags:Public welfare is the aim of the government – Sarpanch Srinivasureddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *