ప్రేమ నిరాకరించిందని కత్తితో దాడి చేశాడు

He refused to kill him

He refused to kill him

Date:06/10/2018
ఏలూరు ముచ్చట్లు:
ప్రేమను నిరాకరించిందనే కోపంతో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఓ యువకుడు రెచ్చిపోయాడు. యువతిపై కత్తితో దాడి చేశాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరులోని విజయవిహార్ సెంటర్‌లో ఉన్న ఓ వస్త్ర దుకాణంలో గాయత్రి అనే యువతి పనిచేస్తోంది. అదే దుకాణంలో దిలీప్ అనే యువకుడు కూడా పనిచేస్తున్నాడు. గాయత్రిని దిలీప్ కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
కానీ, ఆమె అతడి ప్రేమను తిరస్కరిస్తూ వస్తోంది. దీంతో దిలీప్ ఆమెపై కోపం పెంచుకున్నాడు. శనివారం గాయత్రిని దిలీప్ ప్రేమ విషయమై మరోసారి నిలదీశాడు. ఎప్పటిలాగే ఆమె తిరస్కరించడంతో ఘర్షణకు దిగాడు. వెంటతెచ్చుకున్న కత్తితో ఆమెపై ఒక్కసారిగా దాడి చేశాడు. దుకాణ సిబ్బంది, స్థానికులు అప్రమత్తమై దిలీప్‌ను అడ్డుకున్నారు.
దీంతో యువతికి ప్రాణాపాయం తప్పింది. ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ యువతిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. దాడిని ఆపేందుకు ప్రయత్నించిన ఓ యువకుడి పై కూడా నిందితుడు దాడికి దిగాడు.
వస్త్ర దుకాణం యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. సదరు యువతి సంవత్సర కాలంగా తనను ప్రేమిస్తోందని, గత కొన్ని రోజులుగా మరో యువకుడితో చనువుగా ఉంటోందని దిలీప్ ఆరోపిస్తున్నాడు. ఇదేమిటని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడంలేదని అతడు పోలీసులతో అన్నాడు. ప్రేమించి మోసం చేసినందుకే ఇలా దాడి చేసినట్లు చెప్పాడు.
Tags:He refused to kill him

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *