ప్లాస్మా దానం చేసి ప్రాణాలు కాపాడండి- కోట సునీల్ కుమార్ స్వామి పిలుపు

Date:04/05/2021

నెల్లూరు ముచ్చట్లు:

కరోనా వ్యాధి నుంచి కోలుకున్న వారు ధైర్యంగా ముందుకొచ్చి, ప్లాస్మా దానం చేసి ప్రాణాలు కాపాడండి’’ అని డాక్టర్ కోట సునీల్ కుమార్ స్వామి పిలుపునిచ్చారు. కోవిడ్-19 వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ప్లాస్మా దానం అనే మాట వినిపిస్తోందని ,అసలు ప్లాస్మా అంటే ఏంటి?. ప్లాస్మా అన్నది ఇప్పుడు ఎందుకు అంత ప్రాచుర్యంలోకి వచ్చింది?… కోవిడ్ పేషెంట్ల పాలిట ప్లాస్మా ఒక సంజీవనిలా ఎందుకవుతోంది?… ఇవన్నీ కచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్ కోట సునీల్ కుమార్ స్వామిఅన్నారు.మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ  ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరికొకరం తోడుగా ఉండటం ఎంతో అవసరం అని… కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్లాస్మా థెరపీ ప్రాణాలను నిలబెట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు.ప్లాస్మాపైఅవగాహన తెచ్చుకుని ముందుకొచ్చి ప్లాస్మాదానం చేసిన వారందర్నీ అభినందిస్తున్నాను అని అన్నారు.

 

 

 

కోవిడ్ వైరస్‌లు మన శరీరంలోకిచేరినప్పుడు వాటిని తెల్లరక్త కణాలు గుర్తించి చంపేందుకు కావాల్సిన యాంటీబాడీలు తయారవుతుంటాయని… ఆ యాంటీబాడీలు ప్లాస్మాలోనే ఉంటాయని చెప్పారు. కోవిడ్ నుంచి కోలుకున్న పేషెంట్ల ప్లాస్మాలోనూ ఇలాంటి యాంటీబాడీలు పెద్దసంఖ్యలో తయారై ఉంటాయని, అందువల్ల అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న పేషెంట్లకు, ఇప్పటికే కోవిడ్ నుంచి కోలుకున్న పేషెంట్ల ప్లాస్మాను ఎక్కిస్తే త్వరగా కోలుకుని ప్రాణాపాయం నుండి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. అందుకే ఇప్పుడు ప్రభుత్వాలు, సెలబ్రిటీలు, డాక్టర్లు ప్లాస్మా దానం చేయాల్సిన ఆవశ్యకతపై ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్లాస్మా దానం చేసిన వారికి రూ5వేల ప్రోత్సాహ‌కంగా ప్రకటించారని  తెలిపారు.ఇంతకూ ప్లాస్మా అంటే ఏంటి?.రక్తంలో నీటి మాదిరిగా ఉండే పసుపుపచ్చని ద్రవాన్నే ప్లాస్మా అంటారు. ర‌క్తంలో ఎర్ర ర‌క్తక‌ణాలు, తెల్ల ర‌క్తక‌ణాలు, ప్లేట్‌లేట్స్ వంటివి తొల‌గించిన తర్వాత మిగిలి ఉండే ద్రవమే ప్లాస్మా. మన ర‌క్తంలో 55 శాతం దాకా ప్లాస్మా ఉంటుంది. పసుపు రంగులో ఉండే ప్లాస్మా ద్రవం ఎంజైమ్‌లు, రోగ నిరోధ‌క క‌ణాలు, ఇత‌ర ప్రోటీన్లను క‌లిగి ఉంటుంది. శ‌రీరంలో ర‌క్తాన్ని గ‌డ్డక‌ట్టించ‌డంతో పాటు వ్యాధుల‌ను ఎదుర్కోవడానికి ప్లాస్మా ఉపయోగపడుతుంది.ప్లాస్మా థెర‌పి అంటే ఏంటి?.కోవిడ్‌ను ఎదుర్కోవ‌డానికి మ‌నిషిలో ఉండే రోగ నిరోధ‌క శ‌క్తి కీల‌కమైనది.

 

 

 

కోవిడ్‌ను జ‌యించిన వారి శ‌రీరంలో రోగ నిరోధ‌క క‌ణాల‌తో కూడిన ప్లాస్మాను సేక‌రించి వైరస్ సోకిన వారి శ‌రీరంలోకి పంపిస్తారు. దీంతో వారిలో కూడా రోగ నిరోధ‌క క‌ణాలు ఏర్పడి వైర‌స్‌ను నాశ‌నం చేస్తాయి. ఈ మొత్తం ప్రక్రియ‌ను ప్లాస్మా థెర‌పీ అంటారు.ప్లాస్మా ఎలా సేక‌రిస్తారు?.ప్లాస్మా సేకరించే విధానం కూడా ర‌క్తదానం చేయడంలాగే ఉంటుంది. శ‌రీరంలో నుంచి ర‌క్తాన్ని తీసుకొని అందులో ప్లాస్మాను వేరు చేస్తారు. ఆస్పెరిసెస్ అనే విధానం కూడా ఉంటుంది. ఈ విధానం ద్వారా అయితే సేక‌రించిన ర‌క్తంలో నుంచి ప్లాస్మాను వేరు చేసిన త‌ర్వాత ర‌క్తాన్ని మ‌ళ్లీ శ‌రీరంలోకి పంపిస్తారు. దీనికి కొన్ని ప్రత్యేక యంత్రాలు అవ‌స‌రమవుతాయి.ప్లాస్మా దానం ఎవ‌రు చేయొచ్చు?.కోవిడ్ వైర‌స్ నుంచి పూర్తిగా కోలుకున్న వారే ప్లాస్మా దానం చేయాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారి నుంచి ప్లాస్మా తీసుకోరు. రోగ నిరోధ‌క క‌ణాలు స‌రైన స్థాయిలో ఉన్నాయో లేదో ఎలీసా ప‌రీక్ష ద్వారా వైద్యులు తెలుసుకుంటారు.

 

 

 

ఒక‌టికి రెండుసార్లు ప‌రీక్షలు చేసిన త‌ర్వాత కోవిడ్ మన శ‌రీరంలో లేద‌ని వైద్యులు నిర్ధారించాకే ప్లాస్మా దానం చేయాలి. శ‌రీర బ‌రువు క‌నీసం 55 కిలోలు, ర‌క్తంలో హిమోగ్లోబిన్ క‌నీసం 12 ఉండి ర‌క్తనాణ్యత బాగుండాలి. ఇవ‌న్నీ చూసుకున్న త‌ర్వాతే ప్లాస్మా సేక‌రిస్తారు.ఒక వ్యక్తి ప్లాస్మాతో ఎంత మందిని కాపాడొచ్చు?.రోగ నిరోధ‌క శ‌క్తి లేక క‌రోనా ల‌క్షణాలు ఎక్కువ‌గా ఉండి, శ్వాస స‌మ‌స్యల‌తో ఆరోగ్యం విష‌మించిన వారికి మాత్రమే ప్లాస్మా థెర‌పీ చేస్తారు. ఇలా బాధ‌ప‌డే వారికి 200 మిల్లీలీట‌ర్ల ప్లాస్మా ఇస్తారు. అంటే ఒక వ్యక్తి చేసిన ప్లాస్మా దానంతో ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు కాపాడ‌వ‌చ్చు.అందువలన కోవిడ్ సోకి కొల్కొన్న వారు తప్పకుండా ప్లాస్మా రక్తం చేయండి,ప్లాస్మా దానం చేయాలంటే సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కోట సునీల్ కుమార్ స్వామి 9849847973 కికాల్  చేయాలి అని కోరారు.

పుంగనూరులో 6న డిపో ప్రారంభంపై కలెక్టర్‌ పరిశీలన

Tags: Done plasma y salve vidas- Kota Sunil Kumar Swamy Call

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *