ఫీవర్ సర్వే, ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లు  భాద్యతాయుతంగా నిర్వహించండి  కనకనరసా రెడ్డి

Date:04/05/2021

తిరుపతి ముచ్చట్లు:

వైద్య సిబ్బంది తమపరిదిలో ఫీవర్ సర్వే త్వరగా  నిర్వహించాలని, ప్రస్తుత అత్యవసర  పరిస్థిల్లో భాధ్యతాయుతంగా పనిచేసి ప్రజల ప్రాణనష్టం కలగకుండా చూడాలని తిరుపతి అర్దిఒ కనకనరసా రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక
తిరుపతి రూరల్  మండలపరిషత్ కార్యాలయంలో వ్యాక్సినేషణ్ , ఫీవర్ సర్వే , కంటాక్ట్ ట్రేసింగ్ పై ఒక్కరోజు  శిక్షణా కార్యక్రమం ఎం.పి.డి.ఓ. మధుసూదన రెడ్డి, తహసిల్దార్ భాగ్యలక్ష్మి లు నిర్వహించగా  ఆర్డిఓ  కనకనరసా రెడ్డి ముఖ్య అతిధిగాపాల్గొని దిశా నిర్దేశం చేసారు. ఆర్దిఓ మాట్లాడుతూ కోవిడ్ టీకా సురక్షితమైనది అపోహలకు తావివ్వకుండా ప్రభుత్వం సూచించిన అర్హులైన వారికీ టీకా అందించేలాచూడాలని  అన్నారు. రూరల్ పరిధిలో ఇప్పటికే ఫీవర్ సర్వే పూర్తిచేయాల్సి వుంది ,ఆలస్యం లేకుండా నేటితో పూర్తికావాలని అన్నారు. ప్రస్తుతపరిస్థితి చూస్తున్నారు, అలసత్వం వద్దు వెంటనే కోవిడ్ -19 నియంత్రణకు సంబందించి వాక్సినేషన్ పూర్తిచేయాలని అన్నారు. ఫీవర్ సర్వే లో అనుమానితులు వుంటే వెంటనే టెస్టులుచేపట్టి వారిని ట్రఎజ్ కు పంపాలని ప్రాణనష్టం జరగకుండా అప్రమతంగా వుండాలని అన్నారు. ట్రఎజ్ లో హోమ్ ఐసోలేషణ్ ప్రాధాన్యత ఇచ్చిన వారిని ప్రతి రోజు ఫోన్ ద్వారా వారి మెడికల్ రికార్డ్స్ ఆక్సిజన్ లెవల్స్ , ఫీవర్ వంటివి తెలుసుకుని వారికిసలహాలు, సూచనలు ఇవ్వాలని అన్నారు.   ప్రైమరీ , సెకండరీ కాంటాక్ట్ గుర్తింపు ఎప్పటికప్పుడు జరపాలని, మనకు సచివాలయ వ్యవస్థ అద్భుతంగా వుంది, విలేజ్ హెల్త్ సెక్రటరీలు ఎ.ఎం.ఎం.లు, ఆశాలు వున్నారని ఎప్పటికప్పుడు సర్వేజరపగలిగితే నివారణ స్సాధ్యమవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో దామినేడు పి.హెచ్.సి. డా.హరిత , డా.పద్మజ, మంగళం పి.హెచ్.సి.డా.శిల్ప, ఇ ఓ పి ఆర్ డి పద్మజ తిరుపతి రూరల్ పరిధిలోని హెల్త్ సెక్రటరీలు పాల్గొన్నారు.

పుంగనూరు డిపోకు 65 సర్వీసులు కేటాయింపు

Tags:Conduct Fever Survey, Primary and Secondary Contacts Responsibly Kanakanarasa Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *