బిగ్ సర్ ప్రయిజ్… ‘సరిలేరు నీకెవ్వరు’లో సూపర్ స్టార్ కృష్ణ!

-వెల్లడించిన అనిల్ రావిపూడి

సందర్భం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్
-అద్భుతమైన రీరికార్డింగ్ ను డీఎస్పీ ఇచ్చారని కితాబు

Date:06/01/2020

మహేశ్ బాబు తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’లో ఓ బిగ్ సర్ ప్రయిజ్ ను రివీల్ చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. నిన్న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం వేదికగా, ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగగా, ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఉంటారని, ఆ సందర్భం ఏంటన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ అని తెలిపారు. తాను అడిగితే, చిత్రం చేసేందుకు అంగీకరించిన విజయశాంతికి, తనను నమ్మి ఎంతో డబ్బు ఖర్చు చేసిన నిర్మాతలకు రుణపడి వుంటానని చెప్పారు. కృష్ణ గారు కనిపించే సీన్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన రీ రికార్డింగ్ అదిరిపోతుందని అన్నారు. సినిమా ఇంత మంచిగా రావడానికి శ్రమించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

తిరుమలేశుని దర్శించుకున్న తెలంగాణ మంత్రి కేటీఆర్

Tags: SarileruNeekevvaru, Anil Ravipudi, Krishna, Mahesh Babu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *