బీసీలంతా ఏకం మై తెరాస ప్రభుత్వం ను గద్దెదించే వరకు పోరాటం చేయాలి ఈటెల కు మద్దతుగా బీసీ సంఘం నాయకులు మౌనదీక్ష

Date:04/05/2021

జగిత్యాల ముచ్చట్లు:

తెలంగాణ ఉద్యమ నాయకుడు ఈటెల రాజేందర్
ని తెరాస ప్రభుత్వం అవమానపరిచి ,
అవినీతి ముద్ర వేసి రాష్ట్ర క్యాబినేట్ నుండి బర్తరఫ్ చేసి బీసీ సామాజిక వర్గాలకు అవమానించిందని జగిత్యాల జిల్లా అధ్యక్షులు గాజుల నాగరాజు ఆరోపించారు.మంత్రి ఈటెల రాజేందర్ కు మద్దతుగాబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకుజిల్లా కేంద్రంలోని  కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో
మంగళవారం ఉదయం11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు బీసీ నాయకులు మౌనదీక్ష చేపట్టి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గాజుల నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నాయకుడు ,బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ ను తెరాస ప్రభుత్వం అవమానపరిచి , అవినీతి ముద్ర వేసి రాష్ట్ర క్యాబినేట్ నుండి బర్తరఫ్ చేసి బీసీ సామాజికవర్గాలను అవమానించిందని ఆన్నారు.తెరాస ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను తెరాస ప్రభుత్వంఅనగతొక్కేస్తుదని, గతంలో పార్టీ స్థాపించి నాటి నుండి అలె నరేంద్ర, విజయశాంతి, రాజయ్య కోదండరాం, జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళలందరిని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వాడుకొని వదిలేశారన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా బీసీల ఆత్మగౌరవం కొరకు మొదటి నుండి మాట్లాడే వ్యక్తి ఈటెల కావున బీసీలంతా ఏకమైతెరాస ప్రభుత్వానికి గద్దెదించే వరకు పోరాటం చేసి 2023 లో బీసీల సత్తా చూపించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి  భార్గవ్ రామ్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎన్నం ప్రకాష్ , గుగ్గిళ్ళ సత్యనారాయణ, పెంట శ్రీనివాస్, దొగ్గిళి శ్రీధర్, బాలే వరుణ్, గాలిపెల్లి గంగా ప్రసాద్, యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు డిపోకు 65 సర్వీసులు కేటాయింపు

Tags:All BCs must unite to fight until the government of My Teresa is overthrown BC community leaders remain silent in support of Spears

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *