మాల్యకు కోర్టు షాక్… ఆస్తుల అటాచ్

 Date:23/03/2019
ముంబై  ముచ్చట్లు:
విజయ్‌ మాల్యాకు సంబంధించి బెంగళూరులో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఢిల్లీలోని న్యాయస్థానం శనివారం  ఆ రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. మాల్యాను ఇప్పటికే ప్రకటిత నేరగాడిగా కోర్టు పేర్కొంది. ఫెరా చట్టాన్ని ఉల్లంఘించిన కేసుకు సంబంధించి ఈ ఆదేశాలను ఇచ్చింది. ఢిల్లీ చీఫ్‌ మెట్రోపొలిటన్‌ మేజిస్ట్రేట్‌ దీపక్‌ షెరావత్‌ ఈ ఉత్తర్వులు జారీచేశారు. ఇందుకు జులై 10 వరకు గడువు విధించింది. ఇప్పటికే బెంగళూరు పోలీసులు దాదాపు 159 ఆస్తులను గుర్తించినట్లు న్యాయస్థానానికి తెలియజేశారు.ఫెరా చట్టం కింద జారీ చేసిన సమన్లకు స్పందించకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకొంది.ఇప్పటికే మాల్యాపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ పెండింగ్‌లో ఉన్న సంగతి విదితమే. రూ.9 వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసం చేయడంతో పాటు, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని విజయ్ మాల్యాపై ఆరోపణలు ఉన్నాయి. రుణ బకాయిలను వసూలు చేసుకునేందుకు ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం న్యాయపరమైన చర్యలు ప్రారంభించడంతో 2016లో విజయ్‌ మాల్యా భారత్‌ నుంచి పారిపోయి బ్రిటన్‌లో తలదాచుకున్నారు. ఆయన్ను భారత్ రప్పించేందుకు సీబీఐ, ఈడీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.
Tags:Attend the court shock … property to Mallya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *