తెలుగుముచ్చట్లు రంజాన్‌ శుభాకాంక్షలు

Date:04/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

రంజాన్‌ పండుగను పురస్కరించుకుని ముస్లింలకు తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌ యాజమాన్యం , సిబ్బంది శుబాకాంక్షలు తెలిపారు. ముస్లింలు సుఖసంతోషాలతో రంజాన్‌ పండుగను కుటుంబ సభ్యులతో కలసి నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.

ఇట్లు…

తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌ , పుంగనూరు .

9న బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం కార్యవర్గం ఎన్నిక

Tags: Congratulations to Ramzan

అగ్రీ ఫ్రెండ్ వారి సూచనలు మరియు ఉద్యోగ అవకాశాలు పొందండి

తిరుమల శ్రీవారి సన్నిధిలో అనంతపురం నృత్య దర్శకురాలు సంధ్యామూర్తి అధ్వర్యంలో నాట్యప్రదర్శణ చేస్తున్న చిన్నారులు “పిడతల సాయి ప్రణవి ,ప్రత్యుష ,మహాలక్ష్మి,హారిక ,దివ్యశ్రీ ,సుధీర

తిరుమలలో దాససాహితి కార్యక్రమానికి హాజరయిన భక్తులు

సాహా స్థానంలో దినేశ్‌ కార్తీక్‌

16/1/2018 ఈనాడు సెంచూరియన్‌: ఆతిథ్య దక్షిణాఫ్రికాతో చివరి టెస్టుకు దినేశ్‌ కార్తీక్‌ అందుబాటులో ఉండనున్నాడు. వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా గాయపడటంతో అతని స్థానంలో దినేశ్‌ కార్తీక్‌ మూడో టెస్టు కోసం తీసుకున్నట్లు ఆల్‌ఇండియా సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ తన ట్విటర్‌ ద్వారా ప్రకటన వెల్లడించింది.

‘జనవరి 11న నిర్వహించిన ప్రాక్టీస్‌ సెషన్‌లో వికెట్‌ కీపర్‌ సాహా ఎడమకాలి తొడ కండరాలు పట్టేశాయి. బీసీసీఐ మెడికల్‌ సిబ్బంది అతన్ని పరీక్షిస్తున్నారు. సాహా ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. దీంతో జనవరి 24 నుంచి జరగబోయే చివరి టెస్టుకు సాహా స్థానంలో దినేశ్‌ కార్తీక్‌ను జట్టులోకి తీసుకున్నాం’ అని బీసీసీఐ పేర్కొంది.

జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్‌ మైదానంలో జనవరి 24 నుంచి భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య చివరి టెస్టు జరగనుంది. సెంచూరియన్‌లో ప్రస్తుతం జరుగుతోన్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ ఆడుతోన్న సంగతి తెలిసిందే.

అజ్ఞాతవాసిగా ఐఐటీ గ్రాడ్యుయేట్‌..

16/1/2018 సాక్షి, ముంబయి :  ఐఐటీ బాంబే నుంచి కెమికల్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీ..అత్యధిక వేతనంతో కూడిన ఉద్యోగం..సంప్రదాయ కుటుంబం.. అన్నిటినీ వదిలేసిన సంకేత్‌ పరేఖ్‌ భిన్న ప్రయాణాన్ని ఎంచుకున్నాడు. నిన్నమొన్నటి వరకూ అమెరికాలో పీజీ కోర్సు చేయాలని కలలుగన్న సంకేత్‌ తన సీనియర్‌తో చేసిన ఆన్‌లైన్‌ చాట్‌తో అన్నీ తలకిందులయ్యాయి. సర్వం త్యజించి ఈనెల 22న ముంబయిలో సంకేత్‌ జైనిజం స్వీకరించేందుకు ముహుర్తం ఖరారైంది.

వైష్ణవ కుటుంబానికి చెందిన సంకేత్‌ ఐఐటీలో తన సీనియర్‌, 2013లో దీక్ష తీసుకున్న భవిక్‌ షా బాటలో జైనిజంలో అడుగుపెడుతున్నాడు. ఉద్యోగంలో కొనసాగదలుచుకుంటే తాను కోరుకున్నవన్నీ పొందేవాడిననీ..అయితే తనలో చెలరేగిన మానసిక సంఘర్షణ ఇప్పటికి శాంతించిందని సంకేత్‌ చెప్పుకొచ్చాడు.

తాను ఫైనల్‌ ఇయర్‌లో ఉన్నప్పటి నుంచీ సీనియర్‌ భవిక్‌తో చాట్‌ చేస్తుండేవాడినని, తమ సంభాషణలు క్రమంగా ఆత్మ, మనసు, శరీరం చుట్టూ తిరిగేవని, ఆ ఆలోచనలు తనను ఆత్మాన్వేషణ వైపు పురిగొల్పి..జైనిజం వైపు నడిపాయని అన్నాడు. ప్రస్తుతం సంకేత్‌ పరేఖ్‌  తన వస్తువులను చివరికి స్నేహితుడితో చాట్‌ చేసేందుకు ఉపయోగించిన కంప్యూటర్‌ను సైతం విడిచిపెట్టాడు.

రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి పట్టా పాస్‌ పుస్తకాల పంపిణీ: కేసీఆర్‌

16/1/2018సాక్షి, హైదరాబాద్ : మార్చి 11 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఒకేసారి పట్టాపాస్ పుస్తకాలు పంపిణీ జరగాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకోసం ప్రతి గ్రామంలో ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. మంగళవారం ఉదయం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో కలెక్టర్లతో సమావేశమయ్యారు.

సమావేశంలో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, పంచాయతీరాజ్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ విధులు, మున్సిపల్ చట్ట సవరణపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలిపారు. పాస్‌పుస్తకాలు ఒకరోజు ముందే గ్రామాలకు పంపాలని కలెక్టర్లను ఆదేశించారు. దీని కోసం ప్రతీ గ్రామానికి ప్రత్యేకంగా ఒక వాహనాన్ని ఏర్పాటు చేయాలి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరినీ భాగస్వామ్యం చేయాలని కలెక్టర్లకు సీఎం నిర్దేశించారు.

హైస్పీడ్‌ ట్రైన్‌లో కేటీఆర్‌!

On the high speed KTX train from Seoul to Daegu, tweets ktr - Sakshi

16/1/2018 సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు మంత్రి కేటీఆర్‌ ప్రస్తుతం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సియోల్‌ నుంచి డ్యాగు పట్టణానికి హైస్పీడ్‌ ట్రెయిన్‌లో పర్యటించారు. భారత్‌లోని టైయిర్‌ 2 పట్టణాలు ప్రధాన నగరాలతో అనుసంధానం కావాలంటే.. వాటి మధ్య దూరాన్ని త్వరగా తగ్గించేలా గంటకు 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించే, వైఫై అనుసంధానిత హైస్పీడ్‌ రైళ్లు రావాల్సిన ఆవశ్యకత ఉందని కేటీఆర్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  హైస్పీడ్‌ ట్రెయిన్‌లో మంత్రి కేటీఆర్‌తోపాటు  ప్రభుత్వ సలహాదారు వివేక్, ఇతర అధికారుల బృందం ఉంది.

కేటీఎక్స్‌ హైస్పీడ్‌ ట్రెయిన్‌ ప్రత్యేకతలివే..
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌-డ్యాగు పట్టణం మధ్య ఈ హైస్పీడ్‌ రైలు నడుస్తుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం 417.5 కిలోమీటర్లు. గంటకు సుమారు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కొరియన్‌ ట్రెయిన్‌ ఎక్స్‌ప్రెస్‌ (కేటీఎక్స్‌)కు చెందిన హైస్పీడ్‌ ట్రెయిన్‌.. రెండు గంటల పది నిమిషాల్లో వ్యవధిలోనే గమ్యానికి చేరుకుంటుంది.

కాకతీయ మెగా టెక్స్ట్‌టైల్‌ పార్కులో పెట్టుబడులు
తెలంగాణలో చేపడుతున్న పారిశ్రామిక అనుకూల చర్యలు దక్షిణ కొరియా పెట్టుబడిదారులకు వివరించామని, ముఖ్యంగా వరంగల్‌లో చేపడుతున్న కాకతీయ మెగాటెక్స్ట్‌టైల్‌ పార్కులో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించామని కేటీఆర్‌ ట్విట్టర్‌లో తెలిపారు. వస్త్ర తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు కాకతీయ మెగాటెక్స్ట్‌టైల్‌ పార్కు ఆదర్శనీయమైన గమ్యస్థలమని వివరించినట్టు వెల్లడించారు. అలాగే డ్యాగు పట్టణంలోని వ్యాపార ప్రతినిధులతోనూ భేటీ అయి.. పెట్టుబడుల విషయమై చర్చించినట్టు పేర్కొన్నారు.