యాదాద్రిలో మంత్రి సత్యవతి

Date:03/05/2021

యాదగిరిగుట్ట   ముచ్చట్లు:

తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న  ముఖ్యమంత్రి కెసిఆర్,పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మంత్రి కేటీఆర్,  రాజ్యసభ సభ్యులు సంతోష్ ఆరోగ్యం క్షేమంగా ఉండాలని త్వరగా కోవిడ్ బారి నుంచి కోలుకోవాలని ఈ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కరోనా పీడ వదలాలని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కోరుకున్నానని రాష్ట్ర గిరిజన,స్త్రీ,శిశు సంక్షేమ శాఖల మంత్రి  సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం ఆమె యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నిన్న నాగార్జున సాగర్ ఉపఎన్నికలలో ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఉన్నారని తమ ఓటు ద్వారా చెప్పారని, నేటి మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికల్లో కూడా ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారని అన్నారు… ప్రజలకు మరింత సేవ చేసేందుకు  ముఖ్యమంత్రి కేసీఆర్ కి మరింత శక్తి నివ్వాలని ఆ స్వామి వారిని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు.

పుంగనూరు డిపోకు 65 సర్వీసులు కేటాయింపు

Tags:Minister Satyavati in Yadadri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *