రక్తదానం అవసరం

Date:04/05/2021

హైదరాబాద్ ముచ్చట్లు:

ఈ రోజుల్లో  రక్తదానం చాల అవసరం అని నటుడు  నరేష్ అన్నారు. మంగళవారం యువ ఫౌండేషన్ ఆద్వర్యం లో జూబ్లీహిల్స్ ఫిలిం ఛాంబర్ వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని అయన ప్రారంభించారు. కోవిద్ సమయం లో రక్తదానం చాల అవసరం అని, రక్త నిధి లో బ్లడ్ స్టోరేజ్ చాల అవసరం అన్నారు. సినీ నిర్మాతలు సి.కళ్యాణ్, రామ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ సమయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్త గా ఉండాలని, యువత రక్తదానం చెయ్యడానికి ముందుకు రావాలని అన్నారు. ప్రతి మనిషి ఏడాదికి 3-4 రక్తదానం చెయ్యవచ్చని అన్నారు, యువ ఫౌండేషన్ అధ్యక్షుడు చంద్ర మధు మాట్లాడుతూ కష్టకాలం లో ప్రతి ఒక్కరు ఆదుకోవాలని, ఈ సమయం లో రక్తదానం చాల అవసరం అని, జూబ్లీహిల్స్ డివిజన్ నుంచి అనేక మంది యువత వచ్చి రక్తదానం చెయ్యడం అభినందనీయమన్నారు. రక్తదానం చేసిన వారికీ సర్టిఫికెట్స్ అందజేశారు. దీనికి ముందు దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి పురస్కరించుకొని దాసరి విగ్రహం కి పూల మాలలు వేసి ఆహార పొట్లాలు పంపిణి చేసారు.  నిమ్స్ వైద్య బృందం సర్వలందించారు. కార్యక్రమం లో సినీ ఆక్టర్ వినోద్ బాల, కృష్ణ మోహన్ రెడ్డి, రెడ్ క్రాస్ సభ్యులు పుట్టా రామకృష్ణ , డైరెక్టర్ మురళి, యువ ఫౌండేషన్ ప్రతినిధులు సుమతి, మానస, స్వాతి, సంకర ప్రసాద్, ఆదినారాయణ, నాని, హరీష్, మహేష్, నర్సింహా యాదవ్, నాగరాజు, నిమ్స్ వైద్యులు, సిబ్బంది  డా.లలిత, మాధవి,  గౌరీ, నవీన్, రమేష్, కిరణ్, విజయ్ సురేష్, చంద్ర కాంత్ తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో 6న డిపో ప్రారంభంపై కలెక్టర్‌ పరిశీలన

Tags: Se requiere donación de sangre

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *