రాజీవ్ గృహకల్ప కాలనీలో మాస్కులు, పండ్లు ,బిస్కెట్లు పంపిణీ

Date:04/05/2021

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు జిల్లా బిజెపి మహిళా మోర్చా విభాగం వారు కరోనా విపత్తులో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇందులోభాగంగా ఈ మంగళవారం ఇరుకళల పరమేశ్వరి గుడి దగ్గర వున్న రాజీవ్ గృహకల్ప కాలనీలో  బాల,బాలికలకు మరియు పెద్దలకు మాస్కులు, పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. మహిళా మోర్చా అధ్యక్షురాలు  రాజేశ్వరి కండికట్ల  మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు  , మరియు మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలా కిషోర్  పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ యాదవ్  అధ్యక్షతన మహిళా మోర్చా ఆధ్వర్యంలో కరోనా సేవా సప్తాహంలో భాగంగా కార్యక్రమం చేపట్టడం జరిగింది.మున్ముందు కూడా సేవా కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా మహిళలు ముందుకు వచ్చి కరోనా విపత్తులో సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు
మహిళా మోర్చా అధ్యక్షురాలు  రాజేశ్వరి. ఉపధ్యక్షురాలు  విజయశ్రీ మరియు శ్రీకాంత్ పాల్గొన్నారు.

పుంగనూరు డిపోకు 65 సర్వీసులు కేటాయింపు

Tags:Distribution of masks, fruits and biscuits at Rajiv Grihakalpa Colony

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *