రేషన్ అక్రమాలపై ఉక్కు పాదం

Date:19/05/2018
కరీంనగర్ ముచ్చట్లు:
 పేదల కోసం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యాన్ని కొంత మంది అక్రమంగా తరలించి సోమ్ము చేసుకుంటున్నారనీ, పౌర సరఫరాల శాఖ అధికారుల ప్రమేయం కూడా ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం అక్రమ దందాపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఉక్కుపాదం మోపుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.పౌర సరఫరాల శాఖలో పలు సంస్కరణలు తెచ్చినా అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట పడడంలేదు.  ధాన్యం కొనుగోళ్లు, బియ్యం అక్రమ దందాపై సమీక్ష నిర్వహించారు. అంతే కాకుండా హుజూరాబాద్ వెళ్లి అక్రమ బియ్యం పట్టుబడిన వరుణ్ రైస్ మిల్లును తనిఖీ చేశారు. ఆర్డీఓ చెన్నయ్యతోపాటు స్థానిక పోలీసు, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో కలిసి ప్రాథమిక విచారణ జరిపారు.హుజూరాబాద్‌లోని వరుణ్ రైస్ మిల్లు యజమాని శీల శ్రీనివాస్ రైస్ మిల్లర్ల సంఘం మండలాధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. గతంలో శోభ రైస్ ఇండస్ట్రీ పేరిట ఉన్న మిల్లుపై అనేక కేసులు ఉన్నాయి. సీఎంఆర్ విషయంలో కూడా డిఫాల్టర్‌గా ఉన్న ఆయన ఇదే మిల్లును వరుణ్ రైస్ ఇండస్ట్రీగా పేరు మార్చుకుని మండల రైస్ మిల్లర్ల అధ్యక్షుడి హోదాలో తన పలుకుబడిని ఉపయోగించి ధాన్యం కేటాయింపులు చేయించుకున్నాడు. ఇతని బంధువుల పేరిట ఉన్న మరో మిల్లుకు, అసలు మనుగడలో లేని మరో మిల్లుకు ధాన్యం కేటాయింపులు చేయించుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తనకు, తన బంధువుల పేరిట ఉన్న మిల్లులకు కేటాయించిన ధాన్యాన్ని అక్రమంగా అమ్ముకున్నట్లు తెలుస్తోంది. తీసుకున్న ధాన్యం స్థానంలో సీఎంఆర్ చెల్లించేందుకు 540 క్వింటాళ్ల బియ్యాన్ని గోదాములకు తరలించే క్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలకు అందిన సమాచారం మేరకు తనిఖీలు చేయగా నాలుగు లారీలు సహా రేషన్ బియ్యం పట్టుబడ్డాయి.
Tags; Steel foot on ration irregularities

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *