లాక్ డౌన్ మాత్రమే పరిష్కారం

Date:04/05/2021

న్యూఢిల్లీ   ముచ్చట్లు:

దేశంలో కోవిడ్ మరణాలు పెరగడానికి కేంద్ర ప్రభుత్వ వైఖరే కారణమని కాంగ్రెస్ నేతరాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి సంపూర్ణ లాక్‌డౌన్ మాత్రమే ఏకైక పరిష్కారమని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రం అచేతనత్వం వల్ల అనేక మంది అమాయకులు ప్రాణాలు పోతున్నాయని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆరోపణలు గుప్పించారు.ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాను నియంత్రించాలంటే పూర్తిస్థాయి లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారం.. లాక్‌డౌన్ వల్ల నష్టపోయే వర్గాలకు న్యాయ్ (కనీస ఆదాయ పథకం) ద్వారా రక్షణ కల్పించాలి.. కేంద్ర ప్రభుత్వం ఇంత వరకూ ఏం చేయలేదు.. వారి అచేతనత్వంతోనే చాలా మంది అమాయక ప్రజల ప్రాణాలు పోతున్నాయి’’ అని రాహుల్ ధ్వజమెత్తారు.న్యాయ్ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ 2019 పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన విషయం తెలిసిందే.ఈ పథకం కింద దేశంలోని నిరుపేద కుటుంబాలకు ఏడాదికి రూ.72,000 అందజేస్తామని కాంగ్రెస్ అప్పట్లో తెలిపింది. ‘న్యాయ్’గా వ్యవహరించే ఈ పథకం కింద దేశంలోని 20 శాతం నిరుపేద కుటుంబాలకు లబ్ది చేకూరనుందని రాహుల్ పేర్కొన్నారు.గత నెలలో దేశంలోని కోవిడ్ పరిస్థితులపై జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. మహమ్మారి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు చిట్టచివరి మార్గంగానే లాక్‌డౌన్‌లు ఎంచుకోవాలన్నారు. మెక్రో కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పరచడంపై మాత్రమే ప్రధానంగా దృష్టి సారించాలని కోరారు. అంతేకాదు, ప్రజలు కూడా సహకరించి లాక్‌డౌన్ పరిస్థితి రాకుండా చూడాలని సూచించారు.మరోవైపు, దేశంలో కరోనా విలయం కొనసాగుతోంది. రోజువారీ కేసులు గత మూడు రోజుల నుంచి కొద్దిగా తగ్గాయి. గత 24 గంటల్లో 3,57,229 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 3,449 మంది మృత్యువాత పడ్డారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో 34,47,133 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ దేశంలో కోవిడ్ బాధితుల సంఖ్య రెండు కోట్లకు చేరింది.

పుంగనూరు డిపోకు 65 సర్వీసులు కేటాయింపు

Tags:Lockdown is the only solution

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *