లింగోజిగూడ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దరిపల్లి రాజశేఖర్రెడ్డి విజయం

Date:03/05/2021

హైదరాబాద్ ముచ్చట్లు:

లింగోజిగూడ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దరిపల్లి రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు. బిజెపి అభ్యర్థి అఖిల్ గౌడ్ పై 1272 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అహర్నిశలు కష్టపడి విజయానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, లింగోజిగూడ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. విజయాన్ని ఎంపీ రేవంత్ రెడ్డి కి అంకితం ఇస్తున్నానని తెలిపారు.
21 సంవత్సరాల రాజకీయ కష్టానికి ప్రతిఫలం దక్కిందని అన్నారు. లింగోజిగూడ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.

పుంగనూరు డిపోకు 65 సర్వీసులు కేటాయింపు

Tags:Congress candidate Daripalli Rajasekharreddy wins Lingojiguda by-election

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *