విజ‌య్ సేతుప‌తి టైటిల్ పాత్ర‌లో నిర్మాత ఎల్‌రెడ్ కుమార్ నిర్మిస్తోన్న చిత్రం ‘విడుద‌లై’

Date:22/04/2021

సినిమా ముచట్లు
వైవిధ్య‌మైన చిత్రాల్లో, విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న మ‌క్క‌ల్ సెల్వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారిగా, యూనిక్ కాన్సెప్ట్ చిత్రాలతో పాన్ ఇండియా ప్రేక్షకులను అలరిస్తున్న జాతీయ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ వెట్రి మారన్ దర్శకత్వంలో… కంటెంట్ బేస్డ్ చిత్రాలకు ప్రాధాన్యతనిచ్చే దక్షిణాది ప్రముఖ నిర్మాత ఎల్‌రెడ్ కుమార్, ఆర్ఎస్ ఇన్‌ఫోటైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న చిత్రం ‘విడుదలై’.  ఈ సినిమాలో క‌మెడియ‌న్ సూరి న‌టిస్తున్నారు. ఈ సినిమాలకు మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందించనున్నారు. తొలిసారి వెట్రిమారన్, ఇళయరాజా కాంబినేషన్‌లో సినిమా సినీ ప్రేక్షకులను మెప్పించనుంది.
కరెంట్, టెలిఫోన్ సౌకర్యం అందుబాటులోని దట్టమైన పశ్చిమ కనుమల్లోని అడవుల్లో.. విజయ్ సేతుపతి, వెట్రిమారన్, సూరి, భవాని శ్రీ సహా ఎంటైర్ యూనిట్ అడవుల్లో ఉండే గిరిజన ప్రజలతో ఉంటూ ‘విడుదలై’ సినిమా షూటింగ్‌ను చేశారు.
‘అసుర‌న్‌’ వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత అంతే స్ట్రాంగ్ కంటెంట్‌తో డైరెక్ట‌ర్ వెట్రిమార‌న్ ‘విడుదలై’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఆకట్టుకునే ట్విస్టులు, టర్న్‌లు..గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోనుంది. వెట్రి మార‌న్ సినిమాల‌కు అద్భుత‌మైన విజువ‌ల్స్ అందించే సినిమాటోగ్రాఫ‌ర్ వేల్‌రాజ్, ఎడిటింగ్ వ‌ర్క్‌ను ఆర్‌.రామర్‌, పీట‌ర్ హెయిన్ యాక్ష‌న్స్ సీక్వెన్స్‌ను అందిస్తున్న ఈ చిత్రానికి జాకీ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి  నిర్మాత ఎల్‌రెడ్ కుమార్ స‌న్నాహాలు చేస్తున్నారు

పుంగనూరు ప్రజల సమ్యలపై తక్షణం స్పందించాలి-ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు

Tags:Producer Elred Kumar is producing the movie ‘Vidudalai’ with Vijay Sethupathi in the title role.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *