విద్యా కానుకను అందించిన బాబు రెడ్డి
బేతంచెర్ల ముచ్చట్లు:
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారంనాడు పాఠశాలలో ప్రారంభం కాగా ఈరోజే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యా కానుకను కర్నూలు జిల్లాలోని ఆదోని లో ప్రారంభించారు. ఇందులో భాగంగా సోమవారం నాడు బేతంచెర్ల మండల పరిధిలోని గురుమాన్ కొండ గ్రామంలో ఉన్న ఏ.పీ మోడల్ స్కూల్ పాఠశాలలో వై.ఎస్.ఆర్సి.పి మండల ఇంచార్జ్ బాబు రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు పుస్తకాలు స్కూల్ బ్యాగులను యూనిఫామ్‌తో కూడిన విద్యా కానుక కిట్టును విద్యార్థలకు అందించారు. అదేవిధంగా ఏ. పీ మోడల్ పాఠశాల విద్యార్థి మహా నాగ వాసవి 2021 22 విద్యా సంవత్సరానికి గాను పదవతరగతి మండల టాపర్ గా నిలిచింది అందుకుగాను ఆర్థిక సహాయాన్ని ఆయన పాఠశాల ప్రిన్సిపాల్ షమీల చేతులమీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో గురుమాన్ కొండ సర్పంచ్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Tags: Babu Reddy who gave the gift of education