విపత్తు హెచ్చరిక వ్యవస్థను ప్రారంభించిన మంత్రి సుచరిత

Date;26/20/2020

అమరావతి ముచ్చట్లు;

ప్రజల ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ నూతన వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఈ రోజు విపత్తుల శాఖలో ” ముందస్తు హెచ్చరికలు జారీ వ్యవస్థ” ను

ప్రారంభించామని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. తుఫానులు , వరదలు , అతిభారీవర్గాలు , భూకంపాలు , ఉప్పెనలు , సునామీలు , భారీ అగ్ని ప్రమాదాలు ,

రసాయనిక ప్రమాదాలు ఇతర ప్రకృతి వైపరీత్యాల్లో నష్టాల తీవ్రతను తగ్గించేందుకు ఈ ముందస్తు హెచ్చరికల జారీ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఈ వ్యవస్థలో విపత్తులను ఎప్పటికప్పుడు

గుర్తించి ప్రజలకు మొబైల్ ఫోన్లకు హెచ్చరికలను మెసేజ్ పంపించడంతో పాటుగా తెలుగు , ఇంగ్లీషు భాషల్లో వాయిస్ మెసేజ్ ద్వారా సమాచారం అందించే వ్యవస్థ తీసుకుని వొచ్చామని ఆమె

అన్నారు.  దేశంలో నే ఇటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసిన రెండోవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో ని 9 కోస్తా జిల్లాల్లో, తీర ప్రాంతంలో76 మండలాలు, 16 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు, 8 పర్యాటక

ప్రదేశాలలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ వ్యవస్థ ద్వారా విపత్తుల ప్రభావిత ప్రాంతాల్లో నివసించేవారికి ముందస్తు హెచ్చరికలనిస్తుందని మంత్రి అన్నారు.
ప్రిన్సిపాల్ కార్యదర్శి వి. ఉషారాణి మాట్లాడుతూ 250 కిమీ వరకు గాలి వేగాన్ని తట్టుకునేలా ఈ వ్యవస్థ రూపొందించబడింది , తద్వారా తీవ్రమైన తుపానుల సమయంలో కూడా ఈ వ్యవస్థ

ఉపయోగపడుతుంది.  ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఏ సమాచార వ్యవస్థ ఆగినా ఈ ఎర్లీ వార్నింగ్ డిసిమినేషన్ సిస్టమ్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో ఎప్పటికప్పుడు ఆగిపోకుండా

ముందస్తు సమాచారాన్ని తెలియపరుస్తుందని అన్నారు.
విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు మాట్లాడుతూ జాతీయ విపత్తుల సమర్ధ నిర్వహణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో రూ.87 కోట్ల తో ఈ ప్రాజెక్ట్ చేపట్టాము.
ఒరిస్సా తర్వాత రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎమర్జెన్సీ ఆపరేషన్ సిస్టం లో భాగంగా 20 రేడియో మొబైల్ సిస్టమ్స్ అందుబాటులో కి తీసుకుని వొచ్చాం. వీటి ద్వారా 75 లక్షల మందికి

ముందస్తు హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది. ఎల్ అండ్ టి సంస్థ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

ఆదివాసుల అందోళన;

Tags;Minister Sucharitha who initiated a disaster alert system

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *