వెంకటగిరి  మున్సిపాలిటీ వార్డుల్లో కరోనా నియంత్రణ చర్యలు చేపట్టాం పట్టణ ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు  వెంకటగిరి  మున్సిపల్ కమిషనర్

Date:22/04/2021

నెల్లూరు ముచ్చట్లు:

వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో కరోనా సెకండ్ వేవ్ కట్టడి కోసం యుద్ధ ప్రాతిపదికన నియంత్రణ చర్యలు చేపట్టామని, వెంకటగిరి పట్టణ ప్రజలు ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదని మున్సిపల్ కమిషనర్  బి. నాగేశ్వరరావు మీడియా కు తెలిపారు. 19 వ వార్డు  పీర్జాతి లో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని,అతను ఇంకా నెల్లూరు ఐసోలేషన్ లో ఉన్నారని, పాతకోట సచివాలయం పరిధిలోని కాం పాలెం లో కరోనాతో మరణించిన కేసులో, చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ల శాంపిల్స్ సేకరించామని,  టెస్టుల కోసం నెల్లూరుకు పంపిస్తున్నామని కమిషనర్ తెలిపారు. 19 వ వార్డు పీర్జాతి పేటలో, కరోనా ఫ్రంట్ వారియర్స్ తో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని పీర్జాతి పేట వాసులు  ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని కమిషనర్ తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ లో, ఇప్పటివరకు వెంకటగిరి పట్టణంలో 75 కేసులు  నమోదయ్యాయని, వారంతా గూడూరు, నెల్లూరు ఐసోలేషన్ కేంద్రాలలో చికిత్స పొందుతున్నారని అన్నారు. గురువారం వెంకటగిరి పట్టణంలోని సచివాలయాల అడ్మిన్ లతో మున్సిపల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి, కరోనా సెకండ్ వేవ్ నియంత్రణ కోసం తగిన ఆదేశాలు జారీ చేస్తామని అన్నారు. కరోనా సెకండ్ వేవ్ కట్టడి లో భాగంగా,రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా వ్యాక్సిన్ ను  45 సంవత్సరాలు పైబడిన వారికి వెంకటగిరి మున్సిపాలిటీ లో పలు వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యాక్సిన్లు వేస్తున్నామని, మే 4వ తేది నుండి 18 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సిన్లు వేసే కార్యక్రమం ప్రారంభమవుతుందని కమిషనర్ తెలిపారు. ఇందుకు పట్టణ ప్రజలు సహకరించాలని కమిషనర్ బి. నాగేశ్వరరావు పట్టణ ప్రజలను కోరారు. వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో కరోనా కు సంబంధించిన ఎలాంటి సమాచారం అయినా తన దృష్టికి తీసుకొని రావాల్సిందిగా ఆయన కోరారు. తాను వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడతామని అన్నారు. పురపాలక సంఘం పరిధిలో ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి,మాటిమాటికి , సబ్బు,  శానిటైజర్ తో  చేతులు శుభ్రం చేసుకోవాలని, గుంపులుకు దూరంగా ఉంటూ, భౌతిక దూరం పాటిస్తూ, తప్పనిసరి అయితే తప్ప బయటకు రావాలని కమిషనర్ బి. నాగేశ్వరరావు తెలిపారు.

పుంగనూరు ప్రజల సమ్యలపై తక్షణం స్పందించాలి-ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు

Tags:We have taken corona control measures in Venkatagiri Municipality wards
No one in town needs to be afraid
Venkatagiri Municipal Commissioner

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *