వేసవి ఎట్లా..?(కడప)

Date;26/02/2020

కడపముచ్చట్లు;

: గ్రామీణ ప్రాంతాల్లో వేసవి ఆరంభంలోనే గొంతుక తడారిపోతోంది. భూగర్భంలో నీటిమట్టాలు తరిగిపోతున్నాయి. వేసవిలో దాహార్తితో తల్లడిల్లే గ్రామాలను

ఇప్పటికే అధికారులు ఎంపిక చేశారు. ఎక్కడెకక్కడ ఎలాంటి సమస్య ఉత్పన్నం కానుందని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. దాహం కేకలు వినిపించకుండా తాత్కాలికంగా నీటిఎద్దడిని

అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు ప్రత్యేకంగా నిధులివ్వాలని జిల్లా నుంచి రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదించారు. గతేడాది ట్యాంకర్ల ద్వారా నీరందిస్తే ఇంతవరకు ఇంకా

బిల్లులు చెల్లించలేదు. ఈసారైనా సకాలంలో చెల్లించాలని రక్షిత జలాలు సరఫరా చేసిన కాంట్రాక్టర్లు కోరుతున్నారు. జిల్లాలో 802 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 4,447 ఆవాసాల్లో

4,88,650 కుటుంబాలు ఉండగా 19.90 లక్షల మంది నివసిస్తున్నారు. బహుళ గ్రామాల తాగునీటి పథకాలు (ఎంవీఎస్‌) 25, చిన్న రక్షిత పథకాలు 914, రక్షిత

పథకాలు 1,674, నేరుగా నీరందించేవి 2,674, చేతి పంపులు 11,618 ఉన్నాయి. గతేడాది జూన్‌ నుంచి గత నెల జనవరి వరకు 646.7 మి.మీ. వర్షం కురవాల్సి ఉంటే

561.41 మి.మీ. కురిసింది. 13.21 శాతం లోటు ఉంది. 2019 డిసెంబరు కడప గడపలో సగటున 17.46 మీటర్లలో భూగర్భ జలాలు అందుబాటులో ఉండేవి. సగం

మండలాల్లో వర్షాభావం ప్రభావంతో నీటిమట్టాలు తరిగిపోతున్నాయి. గత నెలలో చూస్తే 18.83 మీటర్ల లోతుకు దిగజారిపోయాయి. నెల వ్యవధిలో 1.37 మీటర్ల దిగువనకు

తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో 1064 గ్రామాల్లో నీటి సమస్య మరింత జఠిలం కానుందని గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ అధికారులు ముందస్తుగా అంచనా వేశారు.

జిల్లా వ్యాప్తంగా చూస్తే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో గొట్టపు బావులు ఒట్టిపోతాయని ముందస్తుగా గుర్తించారు. ప్రకృతి విపత్తుల నివారణ నిధులు (ఎస్‌డీఆర్‌ఎఫ్‌)

రూ.31.60 కోట్లు కావాలని నివేదించారు. జిల్లాలో కాశినాయన, బద్వేలు, పెండ్లిమర్రి, చిట్వేలి, పుల్లంపేట, పెనగలూరు, మైదుకూరు, ఒంటిమిట్ట, రాజంపేట, లక్కిరెడ్డిపల్లె, గాలివీడు,

రాయచోటి, చిన్నమండెం మండలాల్లో 70 పల్లెల్లో ఉన్న 34,164 మందికి 69 వాహనాల్లో 146 ట్రిప్పుల్లో 584 కిలో లీటర్ల నీరందిస్తున్నారు. పెండ్లిమర్రి, చిట్వేలి, పుల్లంపేట, చక్రాయపేట,

మైలవరం, సిద్దవటం, వీరబల్లి, చిన్నమండెం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లె మండలాల్లో 43 నివాస ప్రాంతాల్లో ఉన్న 9,996 మందికి 44 ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకొని సరఫరా చేస్తున్నారు.

ఎప్పుడిస్తారు..? (అనంతపురం)

Tags;How’s the summer?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *