ఫిల్మ్ ఛాంబర్ వద్ద పవన్ ఫ్యాన్స్ వీరంగం

Date:20/04/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీరెడ్డి రేపిన వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో తనకు ఎలాంటి సంబధంలేకపోయినప్పటికీ.. తనను తన తల్లిని దూషించిన వారిపైన, వెనకునుండి ఈ కుట్రను జరిపిస్తున్నవారిపైన ట్విట్టర్ వేదికగా ప్రశ్నలను గుప్పిస్తున్న పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు డైరెక్ట్‌గా యాక్షన్‌లోకి దిగారు. ఇండస్ట్రీ పరువు తీసే విధంగా మీడియాలో ఇంత రాద్దాంతం జరుగుతుంటే పట్టించుకోకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెద్దలు ఎందుకు మౌనంగా వహిస్తున్నారంటూ డైరెక్ట్‌గా ఫిల్మ్ ఛాంబర్‌కే వెళ్లారు పవన్. దాదాపు రెండు గంటల పాటు పవన్ ఛాంబర్‌లో మెగా ఫ్యామిలీ, ఇతర సినీప్రముఖులతో సమావేశం అయ్యారు. పవన్.. ఫిల్మ్ ఛాంబర్‌కి వచ్చిన కొద్దినిమిషాల వ్యవధిలోనే మెగా బ్రదర్ నాగబాబుతో పాటు మెగా హీరోలు రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్‌లు ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకున్నారు.ఇక పవర్ స్టార్ ఫిల్మ్ ఛాంబర్‌కి చేరుకోగానే పెద్ద ఎత్తున ఆయన అభిమానులు అక్కడకు చేరుకున్నారు. పవన్ పవన్ కళ్యాణ్‌పై కుట్ర పూరితంగా కథనాలను ప్రసారం చేస్తున్న కొన్ని మీడియా ఛానల్స్ వాహనాలను ద్వంసం చేస్తూ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితులు అదుపు తప్పే అవకాశం ఉండటంతో పోలీసుల విజ్ఞ‌ప్తి మేరకు పవన్ ఫిల్మ్ ఛాంబర్‌ను వీడారు. అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులతో ఎలాంటి చర్చలు జరిపారు. పవన్ డిమాండ్లు ఏంటి? మెగా హీరోలు మూకుమ్మడిగా ఎందుకు వచ్చారు? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెద్దలతో ఎలాంటి చర్చలు జరిపారు? పవన్ వెంట న్యాయ నిపుణులు రావడం తదితర అంశాలపై క్లారిటీ రావాల్సిఉంది.ఇదిలాఉంటే మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్ పెట్టి తన కార్యాచరణ వివరించే అవకాశం ఉంది. మరోవైపు ఆయన దీక్షకు కూడా దిగుతారని వార్తలు వస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆయన ఫ్యాన్స్ ప్రధాన కూడళ్లలో నిరసనలకు దిగారు. పవన్ కళ్యాణ్‌పైన కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న మీడియా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. పవన్ తల్లికి బహిరంగ క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేస్తున్నారు పవన్ అభిమానులు.
Tags:Pawan Fans Veeranam at the Film Chamber

 34 ఏళ్ల తర్వాత మహేష్

Date:20/04/2018
హైద్రాబాద్  ముచ్చట్లు:
ప్రిన్స్ మహేష్ బాబు, కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ భారీ అంచనాలతో సందడి చేస్తోంది. ఈమూవీలో మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా.. ‘భరత్ అనే నేను’.. శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. నిజమైన విశ్వాసం.. విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతః కరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగానీ, పక్షపాతం గానీ, రాగ ద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అంటూ ప్రమాణం చేస్తూ ఫస్ట్ వోథ్‌తో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. అయితే ప్రస్తుతం ‘భరత్ అనే నేను’ మూవీ విడుదల నేపథ్యంలో మహేష్ అభిమానులు ఓ ఇంట్రస్టింగ్ పోస్టర్‌ని వెతికి పట్టుకున్నారు. అదే సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘ముఖ్యమంత్రి’ మూవీ పోస్టర్.సరిగ్గా 34 ఏళ్ల క్రితం నాటిది ఆ పోస్టర్. చలనచిత్రాకాశంలో ధృవతార, కింగ్ ఆఫ్ కలెక్షన్ హీరో కృష్ణ నటించిన ‘ముఖ్యమంత్రి’ చిత్రం విడుదలైన తొలి వారంలోనే రూ. 52,13,169 వసూలు చేసి రికార్డు కలెక్షన్లతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆ చిత్రానికి క్రిష్ణ భార్య విజయ నిర్మల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కృష్ణ ముఖ్యమంత్రిగా నటించారు. సరిగ్గా 34 ఏళ్ల తరువాత ‘భరత్ అనే నేను’ చిత్రంలో మహేష్ ముఖ్యమంత్రిగా నటిస్తుండటం ఈ రెండు చిత్రాల పోస్టర్లు అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక కృష్ణ ముఖ్యమంత్రిగా బ్లాక్ బస్టర్ హిట్ 34 ఏళ్ల క్రితమే కొట్టేశాడు.
Tags:Mahesh is 34 years old

చీర్ గాళ్ గా ప్రియా 

Date:20/04/2018
తిరువనంతపురం  ముచ్చట్లు:
కనుసైగతో కుర్రకారును తన కొంగున కట్టుకున్న ప్రియా వారియర్ మళ్లీ వైరల్ అయ్యింది. అయితే, ఈసారి సినిమా పాట, సీన్లతో కాదు.. వాణిజ్య ప్రకటనతో. నెస్లే ‘మంచ్’ ప్రకటనలో నటించిన ప్రియా.. ఈ ప్రకటనలోనూ తన చరిష్మాతో ఆకట్టుకుంది. ఇప్పటివరకు కేవలం ఎక్స్‌ప్రెషన్స్‌కే పరిమితమైన ప్రియా.. ఈ సారి డైలాగులు కూడా చెప్పింది. ఇందులో ఆమె చీర్ గర్ల్‌గా కనిపిస్తోంది. ఆమె వద్ద పడిన బంతిని అడిగిన క్రికెటర్‌తో ‘విసిరేసిన వస్తువులను నేను తీయను’’ అంటూ ఈ యాడ్ మొదలవుతుంది.
Tags:Priya as cheer girl

బికినీలో ఇరగదీసిన లక్ష్మీ రాయ్

Date:20/04/2018
హైద్రాబాద్  ముచ్చట్లు:
తెలుగులో ‘కాంచనమాల కేబుల్ టీవీ’ సినిమాతో పరిచయమైన లక్ష్మీరాయ్ ఇప్పుడు రాయ్ లక్ష్మీగా మారిన సంగతి తెలిసిందే. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లిన ఈ భామ అక్కడ తన అందచందాలతో అవకాశాలను బాగానే సొంతం చేసుకుంది. ఆమె నటించిన పలు సినిమాలో తెలుగులోకి అనువాదమై మంచి ఫలితాలు కూడా పొందాయి. ఆమె ఇటీవల బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టింది. ‘జూలీ 2’ సినిమాతో తన హాట్ అందాలను ప్రదర్శించింది. అయితే, అక్కడా అమ్మడికి లక్ కలిసి రాలేదు. అయితేనేం, ఆమె ఇప్పుడు మలయాళం రంగంలోకి అడుగుపెట్టి.. మమ్మూటి పక్కన నటించే ఛాన్స్ సొంతం చేసుకుంది. ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఈ అమ్మడు.. ఇప్పుడు కాస్త సన్నబడింది.
Tags:Lakshmi Rai in Bikini

మెగా ఫ్యామలీతో పెట్టుకోవద్దు : నాగబాబు

Date:18/04/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
తెలుగువాళ్లకు అవకాశాలు ఇవ్వాలని ఆదేశించే శక్తి ‘మా’కు లేదని నటుడు నాగబాబు స్పస్టం చేశారు.  హీరోయిన్లు, కొంతమంది విలన్లు బయటవాళ్లు ఉన్నారని, ఎవరిని తీసుకోవాలన్నది నిర్మాతల ఇష్టమన్నారు. తెలుగు నటులు కూడా ఇతర భాషల సినిమాల్లోనూ నటిస్తున్నారని నాగబాబు అన్నారు. సినిమాల్లో ఉన్న చెడు గురించి మాట్లాడేవాళ్లు.. మంచిని ఎందుకు గుర్తించరని ఆయన ప్రశ్నించారు. నచ్చని సినిమాలను చూడటం మానేయాలని, పరిశ్రమపై చిన్నచూపు చూడొద్దని నాగబాబు విజ్ఞప్తి చేశారు. కంపెనీ ఆర్టిస్టుల వేదన కదిలించిందని.. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, కోఆర్డినేటర్ల వ్యవస్థ లేకుండా చేసేందుకు సమయం పడుతుందని నాగబాబు వ్యాఖ్యానించారు.క్యాస్టింగ్ కౌచ్ అనేది ప్రపంచంలో అందరికీ తెలిసిన విషయమేనని… ఇప్పుడు కొత్తగా వచ్చిన అంశమేమీ కాదని అన్నారు. ఈ వ్యవహారాన్ని  నెల రోజులుగా గమనిస్తున్నానని, ‘మా’లో సభ్యత్వం ఉన్న, సభ్యత్వం లేని లేడీ ఆర్టిస్టులపై ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే ఫిర్యాదు చేయవచ్చని, దేశంలో చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయని అన్నారు. కొంతమంది వెధవలు వేధిస్తే చెప్పుతో కొట్టండి, అంతే తప్పా, ఇండస్ట్రీని చులకన చేసి మాట్లాడొద్దని సూచించారు. మహిళలంటే తమకు ఎంతో గౌరవమని, తన కూతురుని కూడా సినీ పరిశ్రమలోకి తీసుకొచ్చానని అన్నారు. ‘మా’ అసోసియేషన్ లో ఉన్న సభ్యులకు న్యాయం చేయడం తమ బాధ్యతని, ‘మా’లో ఫ్రీ మెంబర్ షిప్ లేదని, తెలుగువారికే అవకాశాలివ్వాలని నిర్మాతలకు ‘మా’ చెప్పదని అన్నారు.సినీరంగం అనేది మినీ ప్రపంచమని…. ఇక్కడ దేవుళ్లు, దేవతలు ఉండరు. మనుషులే ఉంటారు. ఎవడైనా  తమను వంకరగా చూస్తే అరెస్టు చేయించే హక్కు మహిళలకు ఉందన్నారు నాగబాబు. అలాగే సినీ రంగంలోనూ ఇలాంటివి జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేసుకోవచ్చుని మహిళలపై ఇలాంటి అకృత్యాలకు నేను వ్యతిరేకమన్నారు. ఎవరైనా ఆడపిల్లను ప్రలోభపెట్టే పనులు చేసినట్లు నా దృష్టికి వస్తే వాడి చెంప పగలగొడతాను. ఇద్దరు ముగ్గురికి నా నుంచి ఇలాంటి అనుభవం ఎదురైంది.  సినీ రంగంలో ఎవరైనా తమను వేధిస్తే అమ్మాయిలు చెప్పు తీసుకొని కొట్టండని పిలుపునిచ్చారు. సినీ పరిశ్రమలో 10 శాతం మంది వెధవలు ఉంటే.. 90శాతం మంది మంచి వాళ్లున్నారు. కొందరిని చూసి ఇక్కడ అందరూ అలాంటివారే అన్న అభిప్రాయం ఏర్పరచుకోవడం మంచిది కాదు. ఈ పరిశ్రమపై గౌరవం ఉంది కాబట్టే నా కూతురిని ఈ రంగంలోకి ఆహ్వానించానని… ఇక్కడ ఎవరైనా వేధింపులకు గురిచేస్తే అమ్మాయిలు తమకు మంచివారుగా అనిపించిన వారికి చెప్పండని నాగబాబు సూచించారు.భారతీయులందరికీ ఎక్కడైనా పనిచేసుకునే హక్కుంది. సినీ పరిశ్రమలో వేధింపులకు పాల్పడే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని పవన్‌ చెప్పడం తప్పా? అని నాగబాబు నిలదీశారు. ఎవరేమన్నా తమకు భరించే శక్తి ఉందని, విమర్శలను పట్టించుకోవద్దని అభిమానులకు పవన్‌ ఎప్పుడో చెప్పారని గుర్తుచేశారు. ఆధారాలు ఉంటే ఒకేసారి బయటపెట్టాలని నాగబాబు డిమాండ్ చేశారు. శ్రీరెడ్డి చేస్తున్న పోరాటం ప్రస్తుతం పక్కదారి పట్టిందని వ్యాఖ్యానించిన నాగబాబు, ఈ వివాదంలోకి సంబంధం లేని వ్యక్తులు ప్రవేశించి అంశాన్ని పక్కదారి పట్టించడంతోనే తాను స్పందించానని తెలిపారు. తాను ఓ మంచి ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చానని తన మాటలను యూట్యూబ్‌ ఛానళ్లు వక్రీకరించొద్దని హితవు నాగబాబు పలికారు.
Tags:Do not take me with a mega fan: Nagababu

తమిళనాడులో రిలీజ్ కు దూరంగా భరత్ అను నేను

Date:18/04/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
సౌత్ ఇండియాలో టాప్ హీరోల్లో ఒక‌రు అయిన ప్రిన్స్ మ‌హేష్‌బాబు సినిమా  తమిళనాడులో రిలీజ్ అయ్యే అవకాశాలు లేవు. త‌మిళ‌నాట ఈ వివాదం ఇంకా కొలిక్కి రాక‌పోవ‌డంతో అక్క‌డ బంద్ కంటిన్యూ అవుతోంది. నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుడు విశాల్ ఈ విష‌యంలో ఎందాకైనా వెళ్లేందుకు రెడీగా ఉన్నారు. దీంతో ఈ బంద్ ఎప్పుడు ముగుస్తుందో ఖచ్చితంగా తెలియడం లేదు. దీంతో ఈ నెల 20 నాటికి స‌మ‌స్య కొలిక్కి రాక‌పోతే 20న రిలీజ్ అయ్యే భ‌ర‌త్ త‌మిళ‌నాట రిలీజ్ అవుతుందా ? లేదా ? అన్న‌ది సందిగ్ధంలో ప‌డింది.వ‌స్తుందంటే సౌత్‌లో ఓ పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. మ‌హేష్ తాజా సినిమా భ‌ర‌త్ అనే నేను సినిమా మ‌రో రెండు రోజుల్లో థియేట‌ర్ల‌లోకి దిగుతోంది. ఇప్ప‌టికే అన్ని చోట్లా భ‌ర‌త్ మేనియా స్టార్ట్ అయ్యింది. సినిమా ఎప్పుడు ఫ‌స్ట్ షో ప‌డుతుందా ? చూసేద్దాం అన్న ఆతృత ఎక్కువైపోయింది. ఇదిలా ఉంటే మ‌హేష్‌బాబుకు శ్రీమంతుడు సినిమా నుంచి ఇత‌ర భాష‌ల్లో కూడా ఫాలోయింగ్ ఎక్కువైంది.శ్రీమంతుడు సినిమా తెలుగుతో పాటు త‌మిళ్‌లో సెల్వ‌నంద‌న్ పేరుతో రిలీజ్ అయ్యింది. అక్క‌డ అంచ‌నాలు అందుకోలేక‌పోయినా ఓ మోస్త‌రుగా వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇక మహేష్ బ్ర‌హ్మోత్స‌వం కూడా అక్క‌డ రిలీజ్ అయ్యింది. మ‌హేష్ చివ‌రి సినిమా స్పైడ‌ర్ సినిమా కూడా ఏక‌కాలంగా తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో రిలీజ్ అయ్యింది. ఇక ఇప్పుడు వ‌స్తోన్న భ‌ర‌త్ అనే నేను కూడా త‌మిళ‌నాడులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా అక్క‌డ రిలీజ్ అవుతుందా ? లేదా ? అన్న‌ది డౌట్‌గానే మారింది.ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులో నెల రోజులుగా థియేట‌ర్ల బంద్ జ‌రుగుతోంది. అక్క‌డ నెల రోజుల‌కు పైగా డిజిటల్ ప్రొవైడర్లకు వ్యతిరేకంగా తమిళ నిర్మాతల మండలి చేస్తున్న నిరసనకు తెలుగు నిర్మాతలు కూడ మద్దతు పలుకుతోన్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో చాలా త‌క్కువ రోజుల‌కే నిర్మాత‌ల‌కు, డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌కు మ‌ధ్య ఒప్పందం కుద‌ర‌డంతో ఇక్క‌డ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
Tags: I am Bharat away from release in Tamil Nadu

పవన్ ఫ్యాన్స్ వర్సెస్ శ్రీ రెడ్డి 

Date:17/04/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా పోరాడుతోన్న నటి శ్రీరెడ్డి జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలపై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై మెగా కుటుంబం నుంచి తొలి స్పందన వచ్చింది. బాబాయ్‌పై శ్రీరెడ్డి వ్యాఖ్యలకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చాడు. నేరుగా శ్రీరెడ్డి పేరు ప్రస్తావించకుండా ఫేస్‌బుక్‌లో వరుణ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. ‘నిన్ను విమర్శించి, తక్కువ చేసి చూపించాలని ప్రయత్నించే నీచ మనస్కుల గురించి పట్టించుకోనవసరం లేదు. అలాంటి వారు వాళ్ల బలహీనతలను తెలుసుకోలేరు. తమ లోపాల్ని తెలుసుకోవడం కన్నా ఎదుటి వాళ్లను తప్పుడు వ్యక్తులుగా చూపించడానికి ఎక్కువ ఉత్సాహం ప్రదర్శిస్తారు’ అంటూ వరుణ్ తేజ్ పోస్టు పెట్టారు. దీనికి మెగా అభిమానుల నుంచి విపరీతమైన స్పందన లభిస్తోంది.అన్యాయం జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలి గానీ, మీడియాకు ఎక్కితే పబ్లిసిటీ వస్తుంది తప్ప, ప్రయోజనం ఉండదంటూ తన పోరాటంపై పవన్ చేసిన వ్యాఖ్యలను శ్రీరెడ్డి ఖండించిన విషయం తెలిసిందే. అలాగే సోమవారం నాడు బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన శ్రీరెడ్డి.. ‘పవన్ కళ్యాణ్.. నిన్ను అన్నా అని అన్నందుకు చెప్పుతో కొట్టుకోవాలంటూ అన్నంత పని చేసింది. తన చెప్పు తీసుకునే మీడియా ముందే కొట్టుకుంది. లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలి తప్ప.. పబ్లిసిటీ కోసం మీడియాకెక్కితే లాభం లేదన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై విరుచుకుపడింది.మహిళల పోరాటాన్ని ఆయన చిన్నచూపు చూస్తున్నారని విమర్శించింది. పవన్ కళ్యాణ్.. మూడు పెళ్లిళ్లు చేసుకున్నావ్.. అసలు నీకు మహిళలంటే గౌరవం ఉందా? అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్‌లకు వెళ్లాలా? నువ్ చెప్పాలి మరి నాకు స్టేషన్‌కు వెళ్లాలని. అసలు నిన్ను అన్నా అని అన్నందుకు ఏంచేస్తానో చూడండంటూ మీడియా ముందే చెప్పుతీసుకుని చెంపలపై వాయించుకుంది శ్రీరెడ్డి. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా గళమెత్తిన శ్రీశక్తి అలియాస్ శ్రీరెడ్డిపై పవన్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేస్తూ, ఆయన తల్లి పేరు ప్రస్తావించడంపై ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. దీనిపై శ్రీరెడ్డికి వ్యతిరేకంగా అభ్యంతరకరమైన పోస్ట్‌లు పెడుతూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ పోస్టులపై స్పందించిన శ్రీరెడ్డి.. తన పిల్లల్ని కూడా బెదిరించారని వాపోయింది. పవన్ తల్లిని క్షమాపణ కోరుతున్నానని, దురుద్దేశంతో ఆమెపై వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. తన పిల్లలను ఈ వివాదంలోకి లాగుతున్నారనే బాధతోనే వ్యాఖ్యలు చేశాను తప్పా, తన గురించి ఎంత చెడుగా మాట్లాడినా పట్టించుకోబోనని అన్నారు. అంతేకాదు పవన్ కల్యాణ్ అంటే అసలు లెక్క లేదని వ్యాఖ్యానించింది.సాటి ఆడ మనిషి ఒక తల్లిని అగౌరవ పరచటమే కాకుండా నిన్ను బట్టలు ఇప్పుకొని అగౌరవ పరచుకొని ఇతరులను అనటం సమంజసమా శ్రీరెడ్డి. నీవు బూతులు మాట్లాడుతే తప్పు లేదు ఇతరులు అదేవిధంగా మాట్లాడుతే …దీనిపై అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఓ వీడియోను పోస్టు చేసిన శ్రీరెడ్డి, ఓ ప్రజానాయకుడైన పవన్, తమ సమస్యపై సరిగ్గా స్పందించలేదని ఆరోపించారు. ఆయన గురించి మీడియా ముందు ప్రస్తావించిన అమ్మాయిలను తీవ్రంగా భయపెడుతున్నారని, ఎన్నాళ్లు మా నోళ్లు నొక్కేస్తారని ప్రశ్నించారు. తమ సమావేశాన్ని అత్యంత ఘోరంగా అభివర్ణించారని దుయ్యబట్టారు.కేవలం పవన్ కల్యాణ్‌కు మాత్రమే తల్లి ఉన్నారా? అని ఆమె ప్రశ్నించారు. కొంతమంది ఎవరి పక్కలో పడుకోకుండానే క్యారెక్టర్లు తెచ్చుకున్నారని, వారిని కూడా ఈ రొచ్చులోకి పవన్ ఫ్యాన్స్ లాగుతున్నారని ఆరోపించారు. తమ బాధను అర్థం చేసుకోవాలని, నిజం చెబుతుంటే నోరు నొక్కే ప్రయత్నం చేయవద్దని కోరింది. తన పోరాటాన్ని ఆపబోనని, ఈ పోరాటంలో తాము సమిధలమైనా లెక్కచేయబోమని హెచ్చరించింది.‘ఒక్క మాట పవన్ అమ్మ గార్ని అంటే ఇన్ని భూతులుతో మెసేజ్‌లు పెడుతున్నారు…. ఇదేనా ఆడవారికి మీరు ఇచ్చే గౌరవం … మేము పోరాడేది కూడా ఆ గౌరవం కోసమే…. వాళ్ల అమ్మ కేనా గౌరవం..? మాకు లేదా…? ఇంతమంది అమ్మాయిలం రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తుంటే, పవన్ గారు మీరే ముందుకు వచ్చి న్యాయం చేయమని ఇండస్ట్రీ పెద్దలని కూర్చోబెట్టి ప్రశ్నించవచ్చుగా….? లేదా మీ అభిమానులు మా ఆడవాళ్లని తిడుతూ పెట్టే మెసేజ్‌లు చూడవచ్చుగా…?’ అని నిలదీసింది. ‘దయచేసి మమ్మల్ని తిట్టే ఈ మెసేజ్‌లని పవన్ గారు చదవండి…. వీడియో కింద ఉన్న ఏ మెసేజ్ డిలీట్ చెయ్యట్లేదు… మీ ఫాన్స్ చిల్లర చేష్టలు అర్ధమవుతాయి…. మీ నాయకత్వానికి మీ ఫాన్స్ ఎంత మచ్చ తీసుకొస్తున్నారో దయచేసి చూసుకోండి…! అమ్మాయిలు అందరూ గౌరవానికి అర్హులు… వారిని తక్కువ చేయకండి.. మహిళల ఓట్లు కూడా మీకు ముఖ్యమే’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.
Tags: Pawan Fans vs Sri Reddy

80 మంది కమెడియన్స్ తో ఏప్రిల్ 27 న నవ్వించడానికి వస్తున్న ‘ఊ.పె.కు.హ’

Date:17/04/2018
 హైదరాబాద్‌ ముచ్చట్లు:

రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో బేబీ లక్ష్మీ నరసింహ హిమ ఋషిత సమర్పణలో జెబి క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి భాగ్యలక్ష్మి నిర్మించిన సినిమా ‘ఊ.పె.కు.హ’. ‘ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి’ అనేది కాప్షన్. సాక్షీ చౌదరి కథానాయిక. ‘నిధి’ ప్రసాద్ దర్శకుడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇటీవల విడుదలై మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 27 న వచ్చేందుకు రెడీ అవుతుంది.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ… ‘దర్శకులు నిధి ప్రసాద్‌ గారు సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు అంతా బాగా సహకరించారు. సినిమా చాలా బాగా వచ్చింది. అందరినీ అలరించే చిత్రమవుతుంది.’ అన్నారు. దర్శకుడు నిధి ప్రసాద్‌ మాట్లాడుతూ… ‘ సినిమా అనుకున్న దానికంటే కూడా చాలా బాగా వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. రాజేంద్రప్రసాద్ గారి నటన ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. అలాగే అనూప్ సంగీతం మరో హైలైట్. సినిమాలో నటించిన నటీనటులందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. అలాగే సాంకేతిక నిపుణులు కూడా ఎంతగానో సహకరించారు. ఏప్రిల్ 27 న హడావుడి మొదలవుతుంది. ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా అవుతుంది..’ అని అన్నారు.రాజేంద్రప్రసాద్, సాక్షి చౌదరి, బ్రహ్మనందం, ఆలీ, కృష్ణుడు, ఋషి, హేమంత్, శ్రీ, ధనరాజ్, కృష్ణ భగవాన్ మొదలగు భారీ తారాగణం నటించిన ఈ చిత్రానికి.. డిఓపి: వాసు, ఎడిటర్: శంకర్, ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి.ఆర్. నాగరాజు, ఆర్ట్: విజయ్ కృష్ణ, సంగీతం: అనూప్ రూబెన్స్, ప్రొడ్యూసర్: శ్రీమతి భాగ్యలక్ష్మి, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: నిధి ప్రసాద్
Tags: Protest against boat