బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు “కొబ్బ‌రి మ‌ట్ట” ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్

Date:31/07/2019

హైదరాబాద్‌ముచ్చట్లు:

హృద‌య‌కాలేయం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో, కాలేయం లో త‌న స్థానాన్ని టెంట్ వేసుకుని ప‌డుకున్న బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభిన‌యంలో హృద‌య‌కాలేయం సృష్టిక‌ర్త స్టీవెన్ శంక‌ర్ అందించిన క‌థ‌, క‌థ‌నం, మాట‌లతో కొబ్బ‌రిమ‌ట్ట అనే చిత్రాన్ని తీయాల‌న్న ఆలోచ‌న‌తో ముందుకు వ‌చ్చిన రూప‌క్ రొనాల్డ్ స‌న్ ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ.. సున్నిత‌మైన క‌థ‌ల‌తో చిత్రాలు నిర్మించి  ప్రేక్ష‌కులకి గిల్లిక‌జ్జాలు పెట్టే సాయి రాజేష్ నిర్మాత‌గా దాదాపు 3 సంవ‌త్స‌రాల‌కు పైగా అత్యాధునికమైన సాంకేతిక నిపుణుల‌తో నిపుణుల పర్య‌వేక్ష‌ణ‌లో భారీ వ్యయం తో ఎక్కాడా కాంప్ర‌మైజ్ కాకుండా ఎండ‌న‌కా, వాన‌న‌కా, చ‌లిని సైతం త‌ట్టుకుని ప్రేక్ష‌కుడికి వినోదాన్ని అందించాల‌నే నిరంత‌ర కృషితో క‌సి తో చేసిన చిత్రం కొబ్బ‌రి మ‌ట్ట‌. ఇక ఈ చిత్రం ట్రైలర్ రికార్డులు సృష్టిస్తోంది.

 

 

 

ఈ నాన్ స్టాప్ ట్రైలర్ పై వస్తున్న కామెంట్స్, స్పందన అద్భుతంగా ఉందని చిత్రం యూనిట్ చెబుతోంది. ఈ చిత్రంలో బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మూడు పాత్ర‌లు వేయ‌ట‌మే కాకుండా అత్యంత భారీ డైలాగ్‌లు చెప్పి లిమ్కా బుక్ ఆప్ వ‌ర‌ల్డ్ రికార్డు ని నెల‌కొల్పాడు.. ఈ చిత్రం లో పాపారాయుడు, పెద‌రాయుడు, ఆండ్రాయుడు  లాంటి అత్య‌ద్బుత‌మైన‌ పాత్ర‌లు చేసి మెప్పించ‌బోతున్నారు.  ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం లో తెలుగు సినిమా లో వున్న న‌టీన‌టులంద‌రూ న‌టించారు.

 

 

 

 

 

ఈ సినిమా కి సంబంధించి ఇటీవ‌ల విడుద‌ల చేసిన అఆ.. ఇఈ అనే సాంగ్ యూట్యూబ్ లో రెండు మిలియ‌న్స్ వ్యూస్ 24 గంట‌ల్లో రావ‌టం ఈ చిత్రం పై సినిమా ల‌వ‌ర్స్ కి వున్న క్రేజ్ ని తెలియ‌జేస్తుంది. ఈ భారీ చిత్రాన్ని అగ‌ష్టు 10 న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌టానికి నిర్మాత భారీ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు.. ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్‌టైన్ చేయ‌టంలో ఎక్క‌డా బారీయ‌ర్స్ లేని ఇంత‌టి క్రేజి చిత్రాన్ని నైజాం, ఓవ‌ర్‌సీస్ హ‌క్కుల‌ని నొబారియ‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ వారు సొంతం చేసుకున్నారు. 120 నిమిషాల ఈ చిత్రం లో యాక్ష‌న్‌, కామెడి, సెంటిమెంట్‌, రొమాన్స్‌, సందేశం, ఎమెష‌న్‌, ల‌వ్ లాంటి అన్ని జోనర్స్ క‌ల‌యికే ఈ కొబ్బ‌రిమ‌ట్ట‌.

ఆక‌ట్టుకుంటున్న సాహో సాప్ట్ మెలోడీ సాంగ్ ఏ చోటా నువ్వున్నా

Tags: Burning Star Sampurnesh Babu’s excellent response to the trailer of “Kobari Matta”

ఆక‌ట్టుకుంటున్న సాహో సాప్ట్ మెలోడీ సాంగ్ ఏ చోటా నువ్వున్నా

Date:31/07/2019

హైదరాబాద్‌ముచ్చట్లు:

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్, బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ జంట‌గా యు.వీ క్రియేష‌న్స్ ప‌తాకం పై వంశీ, ప్ర‌మోద్, విక్ర‌మ్ లు ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న చిత్రం సాహో. యంగ్ డైరెక్ట‌ర్ సుజిత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌లే సైకో స‌య్యానా అంటూ యావత్ దేశాన్ని ఉర్రూత‌లుగించిన ఈ చిత్ర బృందం ఇప్ప‌డు మ‌రో అద్భుత‌మైన పాట‌తో ప్రేక్షకుల ముందుకి వ‌చ్చారు. ఏ చోట నువ్వున్నా అంటూ మొద‌ల‌య్యే ఈ పాటకి సంబంధించిన వీడియో టీజ‌ర్ ని తాజాగా విడుద‌ల చేశారు. యూర‌ప్ లోని అంద‌మైన లొకేష‌న్స్ లో ఈ పాట‌ను చిత్రీక‌రించిన‌ట్లుగా తెలిసింది. ఆగ‌స్ట్ 2న ఫుల్ లెంత్ సాంగ్ ను విడుద‌ల చేస్తున్నారు.

 

 

 

ఒక్కో పాట‌కు ఒక్కో మ్యూజిక్ డైరెక్ట‌ర్సాహోలో పాటలకు ఒక్కరే కాకుండా వేరే వేరే సంగీత దర్శకులు ట్యూన్స్ అందిస్తున్న సంగతి తెల్సిందే.  ఇటీవ‌లే విడుద‌లై ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్న సైకో స‌య్యానా పాట‌కు తనిష్క్ బాగ్చి సంగీతం అందించగా. ఏ చోట నువ్వున్నా పాటకు గురు రాంధ్వా సంగీతం అందించారు. అలానే హ్యాపెనింగ్ లిరిక్ రైట‌ర్ కృష్ణ కాంత్ ఈ పాటకు సాహిత్యం అందించారు. ఇక‌ హరిచరణ్ శేషాద్రి, తులసి కుమార్ పాట‌కు సింగ‌ర్స్ గా వ్య‌వ‌హరించారు.

 

 

 

సాహో రొమాంటిక్ యాంగిల్ఇప్పటి వ‌ర‌కూ వ‌చ్చిన సాహో ప్ర‌మెష‌న్ అంతా ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా క‌నిపించినా ఇప్పుడు వ‌చ్చిన ఈ పోస్ట‌ర్ లో ల‌వ్ అండ్ రొమాంటిక్ యాంగిల్ క‌నిపించ‌డం విశేషం. సాహో లో ఇంకా షేడ్స్ వున్నాయని విడుద‌ల తేది లోపు సాహో లు వున్న షేడ్స్ ఆప్ సాహో తెలియ‌జేస్తాం అని యూనిట్ స‌బ్యులు అంటున్నారు.ఈ చిత్రం ఇండియాలో  మెట్ట‌మెద‌టిగా  అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జి తో తెరెకెక్కుతుంది.

 

 

 

ఈ చిత్రం అగ‌ష్టు 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.  బాహుబలి లాంటి చిత్రం త‌రువాత వ‌స్తున్న చిత్రం కావ‌టం తో రెబ‌ల్‌స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఇండియ‌న్ సినిమా ల‌వ‌ర్స్ అంద‌రూ ఈ సినిమా పై భారి అంచ‌నాలు పెట్టుకున్నారు. దీంతో మేక‌ర్స్ ఎక్క‌డా చిన్న విష‌యం లో కూడా కాంప్ర‌మైజ్ కాకుండా ఆడియ‌న్స్ కి పూర్తి వినోదాన్ని క్లారిటి ఆఫ్ క్వాలిటి తో అందించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. హైస్టాండ‌ర్డ్ వి ఎఫ్ ఎక్స్ ని యూజ్ చేయ‌టం వ‌ల‌న హ‌డావుడి కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా వున్న సినిమా ల‌వ‌ర్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రానికి సంబందించిన వ‌ర్క్ జ‌రుగుతుంది.

 

 

 

యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ఏ-విక్ర‌మ్ లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కామారెడ్డిలో మహిళల కష్టాలు ఇంతింత కాదయా 

Tags: Impressive Sao Soft Melody Song Wherever You Are

జ్యోతిక ‘ జాక్‌పాట్  ‘ట్రైలర్, ఆడియో విడుదల.

Date:27/07/2019

హైదరాబాద్‌ముచ్చట్లు:

జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా జాక్‌పాట్. పూర్తిస్థాయి హిలేరియస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా జాక్‌పాట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కళ్యాణ్. జ్యోతిక‌కు తెలుగులో చాలా ఇమేజ్ ఉంది. ఇది వ‌ర‌కు ఆమె ఇక్క‌డ చాలా సినిమాల్లో కూడా నటించారు. పెళ్లి త‌ర్వాత కొన్నేళ్ళు గ్యాప్ తీసుకున్న‌ జ్యోతిక ఇప్పుడు మ‌ళ్లీ జాక్‌పాట్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఇందులో జ్యోతిక‌, రేవతి కాంబినేషన్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. యాక్షన్ సీన్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. యోగి బాబు, ఆనంద్ రాజ్ ప్ర‌ముఖ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 2డి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే తెలుగులో కూడా భారీ వేడుక ఒక‌టి ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కళ్యాణ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా  ట్రైలర్ తో పాటు ఆడియో ని విడుదల చేశారు.

 

 

 

 

సూర్య చేతుల మీదుగా ఈ ఆడియో విడుదల అయింది. ఈ సందర్బంగా
సూర్య మాట్లాడుతూ  జాక్ పాట్ మా ఇద్దరికీ చాలా స్పెషల్,  ముఖ్యంగా నాకు చాలా చాలా స్పెషల్ ఎందుకంటే,  ఈ  సినిమా కథ నాకు ఎంతగా నచ్చిదంటే,  ఈ సినిమాను వేరే నిర్మాతలు ఎవరు తీసిన సరిగా రాదు ఏమో అనే భయం తో,  నేనే నా బ్యానర్ పై జాక్ పాట్ ని నిర్మించాను,  మా బ్యానర్ కి ఈ సినిమా తో మరో హిట్ రాబోతుందని నమ్ముతున్న,  అలానే ఈ సినిమాలో ఇద్దరు లీడ్ స్టార్స్ ని చూస్తుంటే ఇద్దరు స్టార్  హీరోలు కలిసి ఏమైనా ముల్టీ స్టార్రర్ లో నటించారా అనిపిస్తుంది. యాక్షన్ తో పాటు కామెడీ కూడా మా జ్యోతిక, అలానే రేవతి గారు అద్భుతంగా పండించారు. నా సినిమాలని ఆదరిస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న తెలుగు అభిమానులు, జాక్  పాట్ ని హిట్ చేస్తారని కొర్కుకుంటున్నాను. అని తెలిపారు .

 

 

 

జ్యోతిక మాట్లాడుతూ  చాలా రోజులు తరువాత మా సొంత బ్యానర్ లో సినిమా చేశాను. దాంతో పాటే..  ఈ సినిమాలో యాక్షన్ కోసం చాలా స్టంట్ చేయాల్సి వచ్చింది.  ముందు కాస్త భయపడిన మా ఇంట్లోనే ఓ యాక్షన్ హీరో ఉండటం, ఆయనే నన్ను ఎంకరేజ్ చేయడం జరిగింది.  ముఖ్యంగా ఈ సినిమాలో రేవతి గారితో కలిసి నటించడం చాలా ఆనందం గా ఉంది.  ఈ సినిమా తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుంది అని నమ్ముతున్న అని అన్నారు

 

 

 

 

న‌టీన‌టులు:
జ్యోతిక‌, రేవతి, యోగిబాబు, ఆనంద్ రాజ్, మొట్ట రాజేంద్ర‌న్, మ‌న్సూర్ అలీ ఖాన్, జ‌గ‌న్ త‌దిత‌రులు

రాష్ట్రంలో పాండువులు-కౌరవుల యుద్దం జరుగుతోంది

Tags: Astrological ‘Jackpot’ Trailer, Audio Release

కమల్ తో నటించే అవకాశం 

Date:27/07/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

లెజండ్రీ యాక్టర్ కమల్‌ హాసన్‌తో కలిసి నటించాలని కోరుకునో వారు ఉండరు. కమల్ తో కలిసి ఓ చిన్న సీన్ లో కనిపించినా చాలు అని భావిస్తుంటారు చాలామంది. కమల్ తో ఫొటో దిగినా చాలు అని తృప్తి పడతారు. అయితే ఇప్పుడు కమల్ తో కలిసి నటించాలనుకునేవారికి నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ గుడ్ న్యూస్ చెప్పింది.భారతీయుడు 2 సినిమా కోసం నటీనటులు కావాలని లైకా ప్రొడక్షన్స్‌ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. సినిమాలోని సహాయ నటీనటుల పాత్రల కోసం ఆసక్తి ఉన్న, శిక్షణ పొందిన వారు కావాలని తెలిపింది.

 

 

 

మహిళలు, పురుఫులు కావాలని.. వయో పరిమితి లేదని, ఆసక్తి ఉన్న వారు ప్రొఫైల్‌ పంపాలని కోరింది.1996లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ తెరకెక్కుతోంది. గత ఏడాది డిసెంబరులో చిత్రీకరణ ప్రారంభమైంది. ఇప్పటికే సినిమా మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. అయితే కొన్ని కారణాల వల్ల చిత్రీకరణకు బ్రేక్‌ పడింది.  కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తుండగా సిద్ధార్థ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ప్రధాన పాత్రలు పోషించనున్నట్లు తెలిసింది. అనిరుధ్‌ బాణీలు అందిస్తున్నారు.

సెప్టెంబర్ నుంచి లోకేష్ సైకిల్ యాత్ర

Tags: The chance to play with Kamal

మరో సారి రామ్ చరణ్ కు గాయం

Date:24/07/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్ ’ షూటింగ్‌లో హీరో రామ్ చరణ్ మరోసారి గాయపడ్డారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా మొదలైన తరవాత ఇప్పటికే ఒకసారి చరణ్ గాయపడ్డారు. ఆయన కాలికి బలమైన గాయం కావడంతో మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన మరోసారి గాయపడ్డారనే వార్త వైరల్ కావడంతో మెగా అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.

 

 

 

కొంత మంది అయితే ఏకంగా రాజమౌళిని తిట్టిపోస్తున్నారు. నిజానికి ఇది రూమర్ మాత్రమే. రామ్ చరణ్ గాయపడ్డారనే వార్త అబద్ధం. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గాయపడ్డారంటూ వస్తోన్న వార్తల్లో నిజంలేదని, ఆయన ఎంతో సురక్షితంగా ఉన్నారని పీఆర్‌ఓ వంశీ కాక ట్వీట్ చేశారు. నిన్న, ఈరోజు ఆయన షూటింగ్‌లో కూడా పాల్గొన్నారని పేర్కొన్నారు. మొత్తం మీద ఈ రూమర్ మరింత వైరల్ కాకముందే అడ్డుకట్ట వేశారు.

 

 

 

 

వాస్తవానికి రాజమౌళి సినిమా అంటే హీరోలకు కష్టం కాస్త ఎక్కువగానే ఉంటుంది. అంతమాత్రాన హీరో గాయపడితే ఆయన్ని నిందించడం ఎంత వరకు సమంజసం. ప్రస్తుతం ఆయనపై నిందలు వేస్తున్నవారు.. సినిమా అద్భుతంగా వస్తే ప్రశంసల వర్షం కురిపిస్తారు. కాబట్టి, రూమర్లు నమ్మడం మాని.. ముందు జక్కన్నను గౌరవిద్దాం. ఇక, ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ అనంతరం చిత్ర యూనిట్ పుణే వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ భారీ షెడ్యూల్ ఉంటుందని అంటున్నారు.

 

 

ఈ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జూలైలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

పేరు మార్చుకోవడంతో యడ్డీకి కలిసోచ్చిందా

Tags: Another injury to Ram Charan

బాలీవుడ్ స్థాయికి టాలీవుడ్

Date:23/07/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

తెలుగు సినిమా స్థాయి రోజురోజుకీ పెరిగిపోతుంది. ఒక‌ప్పుడు ఇండియ‌న్ సినిమా అంటే బాలీవుడ్ వైపు చూపించేవాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం తెలుగు సినిమా వైపు చూస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఎందుకంటే బాహుబ‌లితో పాటు మ‌రికొన్ని సినిమాలు కూడా ఇప్పుడు మ‌న సినిమా స్థాయిని ప్ర‌పంచానికి చాటి చెప్పాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు తెర‌కెక్కుతున్న సాహో.. సైరా లాంటి సినిమాలు బ‌డ్జెట్ ప‌రంగానే కాకుండా టెక్నిక‌ల్ ప‌రంగా కూడా బాలీవుడ్ సినిమాల‌ను శాసిస్తున్నాయి. మ‌రోవైపు మార్కెట్ కూడా అలాగే పెరిగిపోయింది.ప్ర‌భాస్ సాహో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 300 కోట్ల వ‌ర‌కు జ‌రుగుతుంద‌ని తెలుస్తుంది.

 

 

ఇదిలా ఉంటే ఇప్పుడు చిరంజీవి సైరా సినిమా కోసం కూడా ఎగ‌బ‌డుతున్నారు బ‌య్య‌ర్లు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కోసం భారీ పోటీ నెల‌కొంది. ఏపీలో డిస్ట్రిబ్యూట‌ర్లు సైరా కోసం ఎగ‌బ‌డుతున్నారు. చిరంజీవి హీరో కావ‌డంతో ఆ మాత్రం క్రేజ్ ఉండ‌టం స‌హ‌జం. పైగా ఖైదీ నెం 150 అక్క‌డ చ‌రిత్ర తిర‌గ‌రాసింది. ఇప్పుడు సైరా విష‌యంలో కూడా ఇదే జ‌రుగుతుంద‌ని బ‌లంగా న‌మ్ముతున్నారు బ‌య్య‌ర్లు.ఈ క్ర‌మంలోనే భారీ పోటీ మ‌ధ్య యువీ క్రియేష‌న్స్ సైరా హ‌క్కుల‌ను భారీ రేటుకు సొంతం చేసుకున్న‌ట్లు తెలుస్తుంది.

 

 

 

ఏపీ హ‌క్కుల కోసం వీళ్లు భారీ మొత్తం కోడ్ చేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ సంస్థ నుంచి సాహో లాంటి భారీ సినిమా వ‌స్తుంది. మ‌రోవైపు డిస్ట్రిబ్యూష‌న్‌లోనూ వాళ్లు త‌మ మార్క్ చూపించ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అక్టోబ‌ర్ 2న సైరా విడుదల కానుంది.

సాహో ” పోస్ట‌ర్ ని ఇన్‌స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసిన యంగ్‌రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్   

Tags:Tollywood to Bollywood level

సాహో ” పోస్ట‌ర్ ని ఇన్‌స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసిన యంగ్‌రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్   

Date:23/07/2019

హైదరాబాద్‌ముచ్చట్లు:

‘బాహుబలి చిత్రం తరువాత యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ నుండి ఏ అప్‌డేట్ వ‌చ్చినా అది సంచ‌ల‌న‌మే అవుతుంది. అస‌లు ప్ర‌పంచ సినిమా బాక్సాఫీస్ ఒక్క‌సారిగా  యంగ్ రెబల్‌స్టార్ ప్ర‌భాస్  న‌టిస్తున్న సాహో చిత్రం వైపుకి తిరిగింది. ప్ర‌భాస్ సోష‌ల్ మీడియాలో వున్న రెబల్‌స్టార్ ఫ్యాన్స్ మ‌రియు ఇండియ‌న్ మూవీ ల‌వ‌ర్స్ కొసం సాహో మూవీ గురించి అప్‌డేట్స్ పోస్ట్ చేస్తూ వారి అల‌రిస్తున్నాడు. ఈరోజు స్ట‌న్నింగ్ రొమాంటిక్ పోస్ట‌ర్ ని పోస్ట్ చేశాడు. అగ‌ష్టు 30 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నాము అనే సందేశం తో హీరోయిన్ శ్ర‌ధ్ధా క‌పూర్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఈ పోస్ట‌ర్ కి నెటిజ‌న్ లు ఫిదా అయిపోయారు.

 

 

 

ఇక డైహ‌ర్ట్ ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేవు.. ఇప్పటి వ‌ర‌కూ వ‌చ్చిన సాహో ప్ర‌మెష‌న్ అంతా ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా క‌నిపించినా ఇప్పుడు వ‌చ్చిన ఈ పోస్ట‌ర్ లో ల‌వ్ అండ్ రొమాంటిక్ యాంగిల్ క‌నిపించ‌డం విశేషం. సాహో లో ఇంకా షేడ్స్ వున్నాయని విడుద‌ల తేది లోపు సాహో లు వున్న షేడ్స్ ఆప్ సాహో తెలియ‌జేస్తాం అని యూనిట్ స‌బ్యులు అంటున్నారు.ఈ చిత్రం ఇండియాలో  మెట్ట‌మెద‌టిగా  అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జి తో తెరెకెక్కుతుంది.  ఈ చిత్రం అగ‌ష్టు 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.  బాహుబలి లాంటి చిత్రం త‌రువాత వ‌స్తున్న చిత్రం కావ‌టం తో రెబ‌ల్‌స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఇండియ‌న్ సినిమా ల‌వ‌ర్స్ అంద‌రూ ఈ సినిమా పై భారి అంచ‌నాలు పెట్టుకున్నారు.

 

 

 

 

దీంతో మేక‌ర్స్ ఎక్క‌డా చిన్న విష‌యం లో కూడా కాంప్ర‌మైజ్ కాకుండా ఆడియ‌న్స్ కి పూర్తి వినోదాన్ని క్లారిటి ఆఫ్ క్వాలిటి తో అందించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. హైస్టాండ‌ర్డ్ వి ఎఫ్ ఎక్స్ ని యూజ్ చేయ‌టం వ‌ల‌న హ‌డావుడి కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా వున్న సినిమా ల‌వ‌ర్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రానికి సంబందించిన వ‌ర్క్ జ‌రుగుతుంది.

 

 

 

 

 

ఈ చిత్రానికి సంబందించి మెద‌టి సింగిల్ ని విడుద‌ల చేశారు. రెండ‌వ సింగిల్ ని అతి త్వ‌ర‌లో విడుద‌ల చేస్తున్నారు. యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ఏ-విక్ర‌మ్ లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌టీన‌టులు.. రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్, శ్రధ్ధాక‌పూర్‌, జాకీష‌ర‌ఫ్, నీల్ నితిన్ ముఖేష్‌, అరుణ్ విజ‌య్‌, లాల్‌, వెన్నెల కిషోర్‌, ప్ర‌కాష్ బెల్వాది, ఎవిలిన్ శ‌ర్మ‌, చుంకి పాండే, మందిరా బేడి, మ‌హేష్ మంజ్రేఖ‌ర్‌, టిను ఆనంద్‌, శ‌ర‌త్ లోహిత‌ష్వా త‌దిత‌రులు.

ఏపీ అసెంబ్లీలో తొలి సస్పెన్షన్ 

Tags: Saaho “Poster posted on Instagram by Youngbrelstar Prabhas

మాస్‌మ‌హ‌రాజ్ “డిస్కోరాజా” అగ‌ష్టు మెద‌టివారం డిల్లి లో షూట్‌

Date:22/07/2019

విజయవాడ ముచ్చట్లు:

మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం “డిస్కోరాజాష‌.  ఈ సినిమా షూటింగ్ నిర్విరామంగా హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం అన్న‌పూర్ణా ఏడెక‌రాల‌లో కొటి 20 ల‌క్ష‌ల రూపాయిల సెట్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ సినిమాకి ఈ సెట్ చాలా కీల‌క‌పాత్ర పోషిస్తుంది.

 

 

 

ఈ షెడ్యూల్ లో ర‌వితేజ‌, వెన్నెల కిషోర్‌, శశిర్ ష‌ర‌మ్‌, టోనిహొప్ లపై సినిమాలో అతి కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఈ సెట్ ని డైర‌క్ట్ గా దియెట‌ర్ లో చూస్తే ప్రేక్ష‌కులు ఫీలింగ్ కొత్త గా వుంటుంద‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆలోచ‌న.  ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నేల టిక్కెట్ తర్వాత ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ అధినేత రామ్ తాళ్ళూరి… రవితేజ తో నిర్మిస్తున్న రెండో చిత్రమిది. రామ్ తాళ్ళూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మించనున్నారు.

 

 

 

 

త్వ‌ర‌లో ఢిల్లి లో ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ… నేల టిక్కెట్ తర్వాత మాస్ మహారాజా రవితేజ గారితో మేం నిర్మిస్తున్న రెండో చిత్రం డిస్కోరాజా. ఈ చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ స్టూడియోస్ లో వేసిన సెట్ లో రవితేజ గారు, వెన్నెల కిషోర్ ల మ‌ద్య జ‌రిగే కొన్ని స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నాము.

 

 

 

 

ఈ షెడ్యూల్ ఈ నెల 26 లో ఈ షెడ్యూల్ పూర్తిచేసుకుంటాము.. అగ‌ష్టు మెద‌టివారం  నుండి ఢిల్లి లో షూటింగ్ జ‌రుపుకుంటాము. ఈ షెడ్యూల్ లో న‌భా న‌టేష్ జాయిన్ అవుతారు. ద‌ర్శ‌కుడు వి ఐ ఆనంద్ చాలా గొప్ప విజ‌న్ వున్న వ్య‌క్తి. ఈ చిత్రం పూర్తి వినోదాత్మ‌కంగా విడుద‌ల‌వుతున్న ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని విప‌రీతం గా ఆక‌ట్ట‌కుంటుంది. అని న‌మ్ముతున్నాము.. అని అన్నారు.న‌టీన‌టులు  ర‌వితేజ‌, ‌పాయ‌ల్ రాజ‌పుత్, నభా నటేష్, బాబీ‌సింహా, వెన్నెల‌ కిషోర్, స‌త్య‌ త‌దిత‌రులు

బాబుతో ఉండేదీ… ఆ నలుగురేనా 

Tags: Massachusetts “Discoraza” shoot in Delhi on Sunday