ఇస్మార్ట్ శంక‌ర్‌`తో హ్యాట్రిక్ డిస్ట్రిబ్యూట‌ర్‌గా 

-పేరు తెచ్చుకున్నందుకు ఆనందంగా ఉంది!
– డిస్ట్రిబ్యూట‌ర్ `ఇస్మార్ట్` శ్రీను

Date:20/07/2019

విజయవాడ ముచ్చట్లు:

పెద్ద మొత్తం డ‌బ్బుతో పాటు అద‌నంగా న‌మ్మ‌కాన్ని కూడా పెట్టుబ‌డిగా పెట్టి చేయాల్సిన వ్యాపారం డిస్ట్రిబ్యూష‌న్‌. లాభాలు వ‌స్తే వ‌చ్చిన‌ట్టు. ఆ స‌ద‌రు సినిమా ప్రేక్ష‌కుడికి న‌చ్చ‌క‌పోతే మ‌న చేతులు కాలిన‌ట్టు. అందుకే ఈ వ్యాపారంలో న‌మ్మ‌కానికి, అదృష్టం తోడు కావాల‌ని అంటారు. ఈ మ‌ధ్య కాలంలో డిస్ట్రిబ్యూట‌ర్‌గా అలా న‌మ్మ‌కాన్ని, అదృష్టాన్ని త‌న‌వెంట పెట్టుకుని `ఇస్మార్ట్`గా ముందుకు అడుగులు వేస్తున్నారు శ్రీను. మొన్న మొన్న‌టిదాకా ఆయ‌న కార్తికేయ ఎగ్జిబిట‌ర్స్ శ్రీను…. ఇప్పుడు `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో డిస్ట్రిబ్యూట‌ర్‌గా హ్యాట్రిక్ హిట్ సాధించి `ఇస్మార్ట్` శ్రీనుగా అభినంద‌న‌లు పొందుతున్నారు. పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి నిర్మాత‌లుగా, పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో హీరో రామ్ తెలంగాణ యాస‌లో అద‌ర‌గొట్టిన `ఇస్మార్ట్ శంక‌ర్‌` ఆయ‌న‌కు డిస్ట్రిబ్యూట‌ర్‌గా హ్యాట్రిక్ చిత్ర‌మ‌న్న‌మాట‌.

 

 

 

 

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల జోరు చూపిస్తున్న ఈ చిత్రం గురించి, త‌న గురించి డిస్ట్రిబ్యూట‌ర్ శ్రీను మాట్లాడుతూ “మా కార్తికేయ ఎగ్జిబిట‌ర్స్ సంస్థ త‌ర‌ఫున నైజామ్‌లో మొద‌ట `క‌బాలీ` చేశాను. ర‌జ‌నీకాంత్ హీరోగా చేసిన ఆ సినిమా చాలా మంచి క‌లెక్ష‌న్లు తెచ్చింది. ఆ త‌ర్వాత `హుషారు` డిస్ట్రిబ్యూట్ చేశాను. యూత్‌ఫుల్ స‌బ్జెక్ట్ తో `హుషారు` కుర్ర‌కారును థియేట‌ర్ల‌లో కూర్చోబెట్టింది `ఉండిపోరాదే….` అంటూ స‌క్సెస్‌లు మాతో ఉండేలా చేసింది. స‌క్సెస్‌ఫుల్‌గా ద్వితీయ విఘ్నం దాటేశాన‌ని మిత్రులంద‌రూ అప్పుడు అభినందించారు.

 

 

 

 

మూడో సినిమాతో హ్యాట్రిక్ కొట్టాల‌ని ఆ క్ష‌ణాల్లోనే బ‌లంగా కోరుకున్నా. అందుకే తొంద‌ర‌ప‌డ‌కుండా ఆచితూచి అడుగులు ముందుకేశా. పూరి జ‌గ‌న్నాథ్‌గారు, హీరో రామ్ గారి కాంబినేష‌న్‌లో `ఇస్మార్ట్ శంక‌ర్‌` రూపొందుతున్న‌ప్ప‌టి నుంచే నాకు క్రేజీగా అనిపించింది. రామ్‌గారి తెలంగాణ యాటిట్యూట్ కొత్త‌గా అనిపించింది. సినిమా క‌చ్చితంగా హిట్ అవుతుంద‌ని పూరిగారిని, ఛార్మిగారిని క‌లిసి ఈ సినిమా డిస్ట్రిబ్యూష‌న్ హ‌క్కులు తీసుకున్నా. నేను అనుకున్న‌ట్టుగానే బాక్సాఫీస్ ను `ఇస్మార్ట్ శంక‌ర్‌` షేక్ చేస్తోంది. థియేట‌ర్ల‌లో సినిమాను చూసి బ‌య‌ట‌కొస్తున్న ఫ్యాన్స్ `పూరిగారి `పోకిరి` చిత్రం గుర్తుకొస్తోంది` అని అంటున్నారు.

 

 

 

 

 

`పోకిరి` రోజులంటే క‌లెక్ష‌న్ల సునామీ అన్న‌మాటే. `ఇస్మార్ట్ శంక‌ర్‌` నాకు హ్యాట్రిక్ హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ విష‌యాన్నే పూరిగారితో, ఛార్మిగారితో అన్నాను. వాళ్లిద్ద‌రూ `ఇక నిన్ను అంద‌రూ `ఇస్మార్ట్` శ్రీను అంటారు. అదే పేరుతో పాపుల‌ర్ అవుతావు` అని అన్నారు. వారి మాట‌లు చాలా ఆనందం క‌లిగించాయి. `ఆర్‌.ఎక్స్.100` కార్తికేయ హీరోగా న‌టించిన `గుణ 369` ఆంధ్ర‌ప్ర‌దేశ్ హ‌క్కులు తీసుకున్నా.

 

 

 

అదొక య‌థార్థ‌గాథ‌తో తెర‌కెక్కించిన చిత్రం. మాన‌వ విలువ‌ల్ని ట‌చ్ చేసే క‌మ‌ర్షియ‌ల్ సినిమా. ఇప్ప‌టిదాకా చేసిన `క‌బాలి`, `హుషారు`, `ఇస్మార్ట్ శంక‌ర్‌`….ఈ మూడు సినిమాల విష‌యంలో నా అంచ‌నాలు త‌ప్పు కాలేదు. నా మూడు చిత్రాల విజ‌య‌ప‌రంప‌ర‌ను `గుణ 369` కొన‌సాగిస్తుంద‌ని నా న‌మ్మ‌కం. భ‌విష్య‌త్తులోనూ మంచి మంచి సినిమాల‌ను పంపిణీ చేసి, మా సంస్థ పేరును `ఇస్మార్ట్`గా నిల‌బెట్టుకోవాల‌ని అనుకుంటున్నా“ అని చెప్పారు.

బాబు నిర్వాకంతోనే నిధులు రాలేదు

 

Tags: Hatz distributor with Ismart Shankar

మిస్ మ్యాచ్ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది – హీరో విక్టరీ వెంకటేష్

Date:11/07/2019

హైదరాబాద్‌ముచ్చట్లు:

‘అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ సంస్థలో తొలి చిత్రం గా ‘మిస్ మ్యాచ్’ పేరుతొ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది.  ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, దివంగత ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె) నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా ‘సలీం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం. మిస్ మ్యాచ్ చిత్ర టీజర్ ను విక్టరీ వెంకటేష్ విడుదల చేసారు.

ఈ సందర్బంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ…మిస్ మ్యాచ్ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. చిత్ర యూనిట్ కు గుడ్ లక్. మిస్ మ్యాచ్  ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమా అవుతుందని భావిస్తున్నాను. హీరో ఉదయ్ శంకర్ కు నటుడిగా మంచి భవిష్యత్ ఉంది. కథ అందించిన భూపతిరాజ గారికి డైరెక్టర్, నిర్మాతలకు బెస్ట్ ఆఫ్ లక్ తెలుపుతున్నా” అన్నారు.

 

 

డైరెక్టర్ ఎన్.వి.నిర్మల్ మాట్లాడుతూ… విక్టరీ వెంకటేష్ గారు మా చిత్ర టీజర్ ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం అందరికి నచ్చుతుందని భావిస్తున్నఅన్నారు
నా మొదటి సినిమా ఆటకథరా శివ సినిమాకు వెంకటేష్ గారు సపోర్ట్ చేశారు. మళ్ళీ ఈ సినిమా టీజర్ ఆయన చేతుల మీదుగా విడుదలవ్వడం సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం అందరూ కష్టపడి పనిచేశారు. భూపతిరాజ గారు ఇచ్చిన కథను దర్శకుడు బాగా తీశారు. నిర్మాతలు సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు అన్నారు హీరో ఉదయ్ శంకర్.

 

నిర్మాత శ్రీరామ్ మాట్లాడుతూ…వెంకీ గారు ఈ టీజర్ రిలీజ్ చెయ్యడం హ్యాపీ గా ఉంది. ఆడియన్స్ కోరుకుంటున్న అన్నీ అంశాలు సినిమాలో ఉంటాయి. సినిమా బాగా వచ్చింది. డైరెక్టర్ ఎన్.వి.నిర్మల్ బాగా తీశారు. ఉదయ్ శంకర్, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ చక్కగా నటించారు. త్వరలో ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియజేస్తాము”అన్నారు.

 

రచయిత భూపతి రాజా మాట్లాడుతూ..”ఈ సినిమా రెండు కుటుంభాల మధ్య జరిగే కథ. హీరో హీరోయిన్ లు పోటీ పడి నటించారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు, దర్శకుడు ఎన్.వి.నిర్మల్ కు ధన్యవాదాలు. ఈ చిత్రం మిమ్మల్ని ఆలరిస్తుందని నమ్ముతున్నాను” అన్నారు.

 

 

ఈ చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్ ఇలియాస్, కధ: భూపతి రాజా, మాటలు: రాజేంద్రకుమార్, మధు; ఛాయా గ్రహణం: గణేష్ చంద్ర; పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ; కళా దర్శకుడు: మణి వాసగం
దర్శకుడు. ఎన్.వి.నిర్మల్ కుమార్ .

టెంప్ట్ ర‌వి ని బ‌య‌పెడుతున్న ” వైఫ్‌,ఐ”

Tags: Miss Match Teaser Intrusted – Hero Victory Venkatesh

టెంప్ట్ ర‌వి ని బ‌య‌పెడుతున్న ” వైఫ్‌,ఐ”

Date:11/07/2019

హైదరాబాద్‌ముచ్చట్లు:

ఇటీవ‌ల యూట్యూబ్ లో టీజ‌ర్ తోనే సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిన ఏడుచేప‌ల క‌థ లో టెంప్ట్ రవి గా దూసుకుపోయిన అభిషెక్ రెడ్డి, సాక్షి నిదియా జంట‌గా, ఏడు చేప‌ల క‌థ చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన జి.చ‌రితా రెడ్డి నిర్మాతగా ల‌క్ష్మి చ‌రిత ఆర్ట్స్  మ‌రియు జిఎస్ఎస్‌పికె స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో రేష్మి హీరోయిన్ గా అంతం అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన జి.ఎస్‌.ఎస్‌.పి.క‌ళ్యాణ్ ద‌ర్శ‌కుడిగా నిర్మిస్తున్న ఈచిత్రానికి “వైఫ్,ఐ” అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు.

 

 

 

ఈ చిత్రానికి నైఫ్ బెట‌ర్ దెన్ వైఫ్ అనే క్యాప్ష‌న్ ని పెట్టారు.. ఈ చిత్రం యెక్క ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు జి.ఎస్‌.ఎస్‌.పి క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. గ‌తం లో నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అంతం చిత్రం క‌మ‌ర్షియ‌ల్ గా చాలా మంచి విజ‌యాన్ని సాధించింది. త‌రువాత మంచి క‌థ కొస‌మే ఇన్ని రోజులు  ఆగాల్సి వ‌చ్చింది. ఇప్ప‌డు స‌మాజం లో జ‌రుగుతున్న ఒక మంచి పాయింట్ ని చాలా ఎంట‌ర్‌టైనింగ్ గా తెర‌కెక్కించాము. ఏడు చేప‌ల క‌థ చిత్రంతో చాలా ఫేమ‌స్ అయిన నేచుర‌ల్ ఆర్టిస్ట్ అభిషేక్ రెడ్డి హీరోగా సాక్షి నిదియా జంట‌గా న‌టించారు.

 

 

ఈ చిత్రం లో భార్య‌, భర్త మధ్య వుండే అన్ని ర‌సాలు క‌ల‌గలుపుగా వుంటాయి.. పూర్తి రొమాంటిక్ కామెడీ గా తెర‌కెక్కిస్తున్నాము. ఇప్ప‌టికే దాదాపు 70 పర్సంట్ కి పైగా షూటింగ్ ని పూర్తిచేసుకున్నాము. ఈ రోజు విడుద‌ల చేసిన  మా “వైఫ్.ఐ” ఫ‌స్ట్‌ లుక్ అండ్ మోషన్ పోస్ట‌ర్ కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. బార్యాభ‌ర్త‌ల మధ్య ప్రెజెంట్ ట్రెండ్ లో వున్న అసూయ ద్వేషాలు, ఎప్ప‌టికో క‌నిపించే ప్రేమ దానిలో పొంగుకొచ్చే రొమాన్స్ ఇవ‌న్ని మించితే వారి జీవితాలు ఎలా వుంటాయ‌నేది చాలా చ‌క్క‌గా మంచి కంటెంట్ తో తెర‌కెక్కించాము. మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తాం.. అని అన్నారు
నిర్మాత జి.చ‌రితా రెడ్డి మాట్లాడుతూ.. డైర‌క్ట‌ర్ క‌ళ్యాణ్ నాకు ఈ క‌థ చెప్పిన‌ప్ప‌డు వెంట‌నే ఒకే చేశాను., ఎందుకంటే ఇలాంటి క‌థ‌లు ఈ జెన‌రేష‌న్ లో రావాలి.. అంద‌రూ త‌ప్ప‌కుండా చూడాలి..

 

 

వైవాహిక జీవితాలు నాశ‌నం అయిపోతున్న రోజులు.. భార్యాభర్త మధ్య ప్రేమ‌లు పోయి అసూయ‌లు పెరుగుతున్న రోజులివి. అస‌లు వీటి కార‌ణం తెలుసుకోలేకపోతున్నారు ఈ క‌థ‌లో ఈ పాయింట్ నాకు బాగా న‌చ్చింది. మ‌నిష‌న్న ప్ర‌తి ఓక్క‌రూ తప్పులు చేస్తారు.. ఆ త‌ప్పు ఏంటో తెలుసుకున్న నాడు ఎలాంటి స‌మ‌స్య కైనా ప‌రిష్కారం వుంటుంది. చాలా చ‌క్క‌గా కళ్యాణ్ తెర‌కెక్కించాడు. అభిషేక్ రెడ్డి, సాక్షి ఈ క‌థ కి చాలా చ‌క్క‌గా సెట్ అయ్యారు. “వైఫ్,ఐ” మెద‌టి లుక్ అంద‌ర్ని ఆక‌ట్ట‌కుంటుంది. మా యూనిట్ అంతా ధీమా గా వున్నారు. అని అన్నారు.

భ‌క్తుల‌కు అందుబాటులోకి ప‌ద్మ‌నాభ నిల‌యం

Tags: “Wife, I”, who tempts Ravi

కట్టుకుంటున్న దొరసాని ట్రైలర్

Date:10/07/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘బ్రోచేవారెవరురా’.. ‘ఓ బేబీ’ సినిమాలతో టాలీవుడ్ బాక్సఫిస్ పుంజుకుంది. ఈసినిమాలు ఓ మోస్తరుగా థియేటర్స్ లో ఆడుతున్నాయి. ఇక ఈ వారం రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఆ రెండు సినిమాలను కొత్త డైరెక్టర్స్ తీశారు. ఈచిత్రాలు ప్రధాన పాత్రధారుల కెరీర్లను నిర్దేశించేవి కావడం గమనార్హం.సందీప్ కిషన్, వెన్నెల కిషోర్ లీడ్ పాత్రల్లో వస్తున్నా చిత్రం ‘నిను వీడని నీడను నేనే’ . ఇది ఒక హార్రర్ థ్రిల్లర్. చాలాకాలం గ్యాప్ తరువాత సందీప్ కిషన్ ఎన్నో హోప్స్ పెట్టుకుని చేస్తున్న చిత్రం.

 

 

 

వరస ఫ్లాపులతో మార్కెట్ దాదాపుగా జీరో అయిపోయిన సమయంలో తన సొంతంగా ఈసినిమాను నిర్మించాడు. దీన్ని కార్తీక్ రాజు అనే కొత్త దర్శకుడు రూపొందించాడు. చూద్దాం సందీప్ ఈసినిమా తో గట్టెక్కుతాడేమో..అలానే ఈసినిమాతో పాటు మరో చిన్న సినిమా వస్తుంది. విజయ్ దేరవకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ను హీరోగా పరిచయం చేస్తూ యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక ను హీరోయిన్ గా పరిచయం చేస్తూ కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం చేసిన ‘దొరసాని’ ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

 

 

 

 

రిలీజ్ అయినా సాంగ్స్, ట్రైలర్స్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. వీరిద్దరి లుక్స్, యాక్టింగ్ స్కిల్స్ మీద చాలా ట్రోలింగ్ జరిగింది. సో ఈ సినిమాతో వారెంటో ప్రూవ్ చేసుకోవాల్సిందే. మరి ఈ ఇద్దరు కొత్త డైరెక్టర్స్ తొలి సినిమాతో సక్సెస్ అందుకుంటారో లేదో చూడాలి.

 

దూకుడుగా జగన్ పరిపాలన

 

Tags: Dressing Countess Trailer

ఈ నెల 27న విశాల్‌ ‘అయోగ్య’ తెలుగులో గ్రాండ్‌ రిలీజ్‌

Date:08/07/2019

 

హైదరాబాద్‌ముచ్చట్లు:

విశాల్‌ హీరోగా  తమిళంలో రూపొందిన చిత్రం ‘అయోగ్య’. తెలుగులో అదే టైటిల్‌తో విడుదల కానుంది. ఏ.ఆర్‌.మురుగదాస్‌ శిష్యుడు వెంకట్‌ మోహన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విశాల్‌ సరసన రాశీఖన్నా కథానాయికగా నటించింది. ‘ఠాగూర్‌’ మధు తొలిసారి తమిళంలో నిర్మించిన ఈ చిత్రం తెలుగు హక్కుల్ని  సార్థక్‌ మూవీస్‌ అధినేత ప్రశాంత్‌ గౌడ్‌ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈనెల 27న సినిమాని తెలుగు రాష్ట్రాల్లో అత్యంత క్రేజీగా రిలీజ్‌ చేయనున్నారు.ఈ సందర్భంగా నిర్మాత ప్రశాంత్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ‘అయోగ్య’ తమిళంలో ఘనవిజయం సాధించింది. అక్కడా బాక్సాఫీస్‌ వద్ద చక్కని వసూళ్లను రాబట్టింది. తమిళ క్రిటిక్స్‌ సైతం ఈ చిత్రానికి 3.5 రేటింగులు ఇచ్చి ప్రశంసలు కురిపించారు. విశాల్‌ ఎనర్జీ లెవల్‌ని పదింతలు చూపించిన సినిమా ఇది. అలాగే ఈ సినిమాలో క్లైమాక్స్‌ సినిమాకే హైలైట్‌. తమిళనాడులో జరిగిన ఓ యథార్థ ఘటన ఆధారంగా పతాక సన్నివేశాల్ని దర్శకుడు తీర్చిదిద్దారు. తమిళంలో హిట్టయిన ఈ చిత్రాన్ని తెలుగులో  మా సార్థక్‌ మూవీస్‌ ద్వారా రిలీజ్‌ చేస్తుండడం ఆనందాన్నిస్తోంది. తెలుగులో విశాల్‌ నటించిన సినిమాలన్నీ వరుసగా విజయాలు అందుకుంటున్నాయి. ఆ కోవలోనే ‘అయోగ్య’ ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. ఈనెల 27న ఏపీ, నైజాంలో రిలీజ్‌ చేస్తున్నామని తెలిపారు.

 

ఇడుపలపాయలో వైఎస్ జగన్

 

Tags: The grand release of Vishal’s ‘Ayogya’ in Telugu this month

ప్రముఖ దర్శకుడు ధవళ సత్యంకు మాతృ వియోగం 

Date: 06/07/2019

హైదరాబాద్‌ముచ్చట్లు:

విప్లవ చిత్రాల ప్రముఖ దర్శకుడు ధవళ సత్యం తల్లిగారైన ధవళ సరస్వతి(86) ఈ రోజు ఉదయం నర్సాపూర్ లో  కన్నుమూశారు.
దర్శకుడు ధవళ సత్యం ఆమె పెద్ద కుమారుడు కాగా రెండవ కుమారుడు ధవళ చిన్నారావు చిత్ర పరిశ్రమలో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా,మూడవ కుమారుడు ధవళ మల్లిక్ దర్శకుడిగానూ చిత్ర పరిశ్రమలోనే స్థిరపడ్డారు. నాలుగవ కుమారుడు లక్ష్మీ నరసింహారావు నర్సాపూర్ కాలేజీలో తెలుగు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా పనిచేస్తున్నారు. కాగా తమ తల్లి అంత్యక్రియలు ఈ రోజు నర్సాపూర్ లో జరుగుతాయని ధవళ సత్యం తెలియజేసారు.కాలేజీల్లో మధ్యాహ్నం

 

 

భోజనం వెంటనే అమలు చేయండి

 

Tags; Veteran director is the parental dissertation to Dhaula Satyam

ఈనెల 12న విశాల్ `అయోగ్య‌` తెలుగులో గ్రాండ్ రిలీజ్

Date:06/07/2019

 

హైదరాబాద్‌ముచ్చట్లు:

విశాల్‌ హీరోగా  తమిళంలో రూపొందిన `అయోగ్య` చిత్రం తెలుగులో అదే టైటిల్‌తో విడుదల కానుంది. ఏ.ఆర్.మురుగ‌దాస్ శిష్యుడు వెంకట్‌ మోహన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.  విశాల్ స‌ర‌స‌న రాశీఖన్నా కథానాయికగా నటించారు. `ఠాగూర్‌` మధు తొలిసారి తమిళంలో నిర్మించిన ఈ చిత్రం తెలుగు హక్కుల్ని  సార్థక్ మూవీస్ అధినేత ప్ర‌శాంత్ గౌడ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈనెల 12న సినిమాని తెలుగు రాష్ట్రాల్లో అత్యంత క్రేజీగా రిలీజ్ చేయ‌నున్నారు. నిర్మాత ప్ర‌శాంత్ గౌడ్ మాట్లాడుతూ -“ `అయోగ్య` త‌మిళంలో ఘ‌న‌విజ‌యం సాధించింది. అక్క‌డా బాక్సాఫీస్ వ‌ద్ద చ‌క్క‌ని వ‌సూళ్ల‌తో అద‌ర‌గొట్టింది. త‌మిళ క్రిటిక్స్ ఈ చిత్రానికి 3.5 రేటింగులు ఇచ్చి ప్ర‌శంస‌లు కురిపించారు. విశాల్ ఎన‌ర్జీ లెవ‌ల్ ని ప‌దింత‌లు చూపించిన సినిమా ఇది. అలాగే ఈ సినిమాలో క్లైమాక్స్ సినిమాకే హైలైట్. త‌మిళ‌నాడులో జ‌రిగిన ఓ య‌థార్థ ఘ‌ట‌న ఆధారంగా ప‌తాక స‌న్నివేశాల్ని ద‌ర్శ‌కుడు తీర్చిదిద్దారు. త‌మిళంలో హిట్ట‌యిన ఈ చిత్రాన్ని తెలుగులో  మా సార్థక్ మూవీస్  ద్వారా రిలీజ్ చేస్తుండ‌డం ఆనందాన్నిస్తోంది. తెలుగులో విశాల్ న‌టించిన సినిమాల‌న్నీ వ‌రుస‌గా విజ‌యాలు అందుకుంటున్నాయి.  ఆ కోవ‌లోనే అయోగ్య ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. ఈనెల 12న ఏపీ- నైజాంలో రిలీజ్ చేస్తున్నాం“ అని తెలిపారు.

 

 

లింగమనేని వ్యవహారంపై దర్యాప్తు

 

Tags: The grand release of Vishal’s ‘illogical’ Telugu on the 12th of this month

చిరంజీవీ.. నో పాలిటిక్స్ అంటున్న ఫాన్స్

Date:28/06/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

పోయినచోటే వెతుక్కోవాలన్న ఉద్దేశంతో చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తారన్న కథనాలు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. చిరంజీవి పొలిటికల్ రీ-ఎంట్రీ ఇస్తే జనసేన పార్టీకి నష్టం జరిగే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు. మరీ ముఖ్యంగా చిరంజీవి బీజేపీలో చేరుతారన్న కథనాల పట్ల మెగా ఫ్యాన్స్ సుముఖంగా లేరని సమాచారం. ఇప్పటికే మెగా ఫ్యాన్స్ అందరూ పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి అండగా నిలుస్తున్నారు. చిరంజీవి సోదరుడు నాగబాటు కూడా జనసేనలో మొన్నటి ఎన్నికల సమయంలో చురుకైన పాత్ర పోషించారు.మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రీ-ఎంట్రీ ఇవ్వనున్నారన్న కథనాలు మెగా ఫ్యాన్స్‌లో ఆసక్తిరేపుతున్నాయి. చిరంజీవి త్వరలోనే బీజేపీ తీర్థంపుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో చిరంజీవికి ఏపీ బీజేపీ సారథ్య పగ్గాలు అప్పగిస్తారని కూడా రాజకీయ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చిరంజీవి బీజేపీలోకి వస్తానంటే స్వాగతిస్తామంటూ పలువురు బీజేపీ నేతలు కామెంట్స్ చేశారు. అయితే ఈ కథనాలపై చిరంజీవి వైపు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. చిరంజీవి సస్పెన్స్ కొనసాగిస్తుండడంతో మెగా ఫ్యాన్స్ గందరగోళానికి గురవుతున్నారు.2009లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి…నాటి ఎన్నికల్లో 18 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. వైఎస్ మరణానంతరం సమైక్య రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.

 

 

 

 

 

 

 

విలీన ఒప్పందం మేరకు చిరంజీవి రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రి కావడం తెలిసిందే. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయి కేంద్రంలో అధికారం
కోల్పోవడంతో చిరంజీవి కూడా సైలెంట్ అయిపోయారు.ప్రస్తుతం ‘సైరా’ సినిమా షూటింగ్‌తో చిరంజీవి బిజీగా ఉన్నారు. గత చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చిరంజీవి పాలిటిక్స్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వకపోవడమే మంచిదని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. చిరంజీవి బీజేపీలో చేరితే జనసేన పార్టీకి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. చిరంజీవికి మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే యోచన ఉంటే జనసేన పార్టీలోకి రావాలని సూచిస్తున్నారు. చిరంజీవి సినిమాల్లోనే కొనసాగుతూ…‘అందరివాడి’లా ఉంటే మంచిదని సూచిస్తున్నారు.

 

జూలై 1 నుంచి వెబ్ ఆప్షన్లు

Tags: Chiranjeevi .. No Politics Saying Fans