మళ్లీ చిరు- విజయశాంతి

Date:28/06/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

మెగాస్టార్ చిరంజీవి – లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కాంబినేషన్ అంటే అప్పటిలో ఒక క్రేజ్ ఉండేది. వీరి కాంబినేషన్ లో సినిమా అంటే అప్పటిలో ప్రేక్షకులు ఎగబడి చూసేవారు. అయితే ఆ తరువాత విజయశాంతి సినిమాలకు దూరం కావడంతో వీరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. ఇద్దరు పొలిటికల్ గా బిజీ అయ్యిపోయారు. అయితే చిరు పొలిటికల్ గా బిజీగా ఉంటూనే సినిమాలు చేయాలనీ డిసైడ్ అయ్యి సినిమాలు చేస్తున్నాడు. అలానే విజయ శాంతి కూడా సినిమాలు చేయాలనీ డిసైడ్ అయిందిఅలా అనుకుందో లేదో వెంటనే ఆమెకు మహేష్ తో నటించే ఛాన్స్ వచ్చింది. ‘సరిలేరు నీకెవ్వరు’తో విజయశాంతి రీఎంట్రీ ఇస్తోంది. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా విజయశాంతి కొత్త ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసింది. అంతే మన మేకర్స్ కి ఓ ఆలోచన వచ్చింది. చిరు – విజయ శాంతి కాంబినేషన్ లో ఓ సినిమా తీస్తే ఎలా ఉంటుందని పలువురికి బుద్ధి పుట్టింది. చిరు ఇంకా హీరోగా నటిస్తున్నారు కనుక వీరిద్దరూ కలిసి జంటగా కనిపించే అవకాశమయితే లేదు. కాకపోతే సమవుజ్జీలయిన పాత్రలని తీర్చిదిద్దితే ఆ సినిమా ఒక ఊపు ఊపేస్తోంది. త్వరలోనే వీరి కాంబినేషన్ లో మూవీ చూడొచ్చని అంటున్నారు. మరి చిరు నెక్స్ట్ కొరటాలతో ఓ సినిమా చేస్తున్నాడు. అందులో అది సాధ్యపడుతుందో లేక త్రివిక్రమ్‌ ఈ కలయికని తెరమీదకి తెస్తాడో తెలియదు. అలానే బాలకృష్ణ సినిమాలో కూడా విజయ శాంతి నటించే అవకాశముందని చెబుతున్నారు. చూద్దాం ఎవరి సెట్ అవుతుందో.

కాపులు కాసేదెవరికి…

Tags: Once again, a happy victory

ప్రముఖుల దిగ్భ్రాంతి

Date:27/06/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, టాలీవుడ్ ప్రముఖ నటి, ప్రముఖ దర్శకురాలు విజయనిర్మల (73) బుధవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె.. బుధవారం నాడు హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స గుండెపోటుతో పొందుతూ మరణించారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్‌బుక్ రికార్డుల్లో చోటు దక్కించుకున్న విజయనిర్మల మృతిపట్ల తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. సినీ ప్రముఖులు, ఆమె అభిమానులు సోషల్‌మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. ‘మిస్ యు నన్నీ అంటూ.. మీరు వచ్చారు.. చరిత్ర సృష్టించారు. మీలాంటి నటన ఇంకెవరకీ సాధ్యం కాదు.. మీలాంటి వ్యక్తులు మళ్లీ రారు. ఈరోజు మీరు మమ్మల్ని వదిలివెళ్లడం మాకు తీవ్ర విషాదం.. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నా’ – మంచు మనోజ్ విజయనిర్మల గారు చనిపోయారని సడెన్‌గా విన్నాను.

 

 

 

 

 

 

 

విజయనిర్మల మరణం సినీ పరిశ్రమకు, ఆమె కుటుంబానికి తీరని లోటు.- హీరో నితిన్ జగన్, కేసీఆర్ నివాళిఅలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నీస్‌బుక్ రికార్డుల్లో స్థానం సాధించిన విజయనిర్మల మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు. విజయనిర్మల కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న విజయనిర్మల బుధవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. విజయ నిర్మల పార్థివ దేహాన్ని గురువారం ఉదయం 11 గంటలకు నానక్ రామ్ గూడాలోని ఆమె స్వగృహానికి తీసుకొస్తారు. బంధువులు, అభిమానుల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని రోజు మొత్తం అక్కడే ఉంచి శుక్రవారం ఉదయం ఫిల్మ్ ఛాంబర్‌కు తరలిస్తారు. అనంతరం ఆమె అంతిమయాత్ర చేపట్టి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూత

Tags: Shock of celebrities

నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూత

Date:27/06/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

 

టాలీవుడ్ ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె.. బుధవారం నాడు హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. విజయ నిర్మల పార్థివ దేహాన్ని గురువారం ఉదయం 11 గంటలకు నానక్ రామ్ గూడాలోని ఆమె స్వగృహానికి తీసుకొచ్చారు. బంధువులు, అభిమానుల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని రోజు మొత్తం అక్కడే ఉంచి శుక్రవారం ఉదయం ఫిల్మ్ ఛాంబర్‌కు తరలిస్తారు. అనంతరం ఆమె అంతిమయాత్ర చేపట్టి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించిన విజయనిర్మల.. దర్శకురాలుగా 44 చిత్రాలను రూపొందించి.. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా ఆమె 2002లో గిన్నీస్‌ బుక్‌లో చోటు సంపాదించారు. 1971లో దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన విజయనిర్మల ‘మీనా’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయ్యారు. మొగుడు పెళ్లాల దొంగాట, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్‌ రాబర్ట్‌ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, లంకె బిందెలు, కలెక్టర్‌ విజయ, ప్రజల మనిషి తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు.

 

 

 

 

 

ఏడేళ్లకే బాలనటిగా..
విజయనిర్మల 1950లో ‘మత్య్సరేఖ’ చిత్రంతో తమిళ ఇండస్ట్రీలో బాలనటిగా పరిచమయ్యారు. అప్పటికి ఆమె వయసు ఏడేళ్లు. అక్కడ పలు చిత్రాల్లో నటించి… పదకొండో ఏట ‘పాండురంగ మహత్యం’ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు. తెలుగులో ‘రంగులరాట్నం’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా అరంగేట్రం చేశారు. నటించిన తొలి చిత్రంతోనే ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్నారు విజయ నిర్మల. అల్లూరి సీతరామరాజు, తాతామనవడు, మీనా, మారిన మనిషి, కురుక్షేత్రం, పూల రంగడు, సాక్షి, అసాధ్యుడు, బంగారు గాజులు, బొమ్మా బొరుసు, మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, పాడిపంటలు తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు.
‘సాక్షి’ చిత్రంలో సూపర్‌స్టార్‌ కృష్ణతో బంధం..

 

 

 

 

 

సూపర్ స్టార్ కృష్ణ- విజయనిర్మల కాంబినేషన్‌‌లో వచ్చిన పలు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచాయి. ‘సాక్షి’ చిత్రంతో మొదలైన వీరి సినీ ప్రయాణం వివాహ బంధానికి కారణమైంది. సుమారు 47 చిత్రాల్లో కలిసి నటించారు వీరిద్దరూ. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు విజయ నిర్మల.

మూగజీవాల ఆకలి తీర్చేదెవరు..? 

Tags: Actress and director Vijayanirmala passed away

ఇండియాలో ముందుగానే విడుద‌ల‌వుతున్న `స్పైడ‌ర్ మ్యాన్:  ఫార్ ఫ్ర‌మ్ హోం`

Date:26/06/2019

హైదరాబాద్‌ముచ్చట్లు:

వ‌య‌సుతో సంబంధం లేకుండా అన్ని వ‌య‌సుల వారిని ఆక‌ట్టుకున్న సూప‌ర్ హీరో స్పైడ‌ర్ మ్యాన్‌. అవెంజ‌ర్స్ వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌ర్వాత `స్పైడ‌ర్ మ్యాన్:  ఫార్ ఫ్ర‌మ్ హోం` రికార్డుల‌ను బ్రేక్ చేయ‌డానికి `స్పైడ‌ర్ మ్యాన్:  ఫార్ ఫ్ర‌మ్ హోం` సిద్ధ‌మ‌వుతోంది. `స్పైడ‌ర్ మ్యాన్:  ఫార్ ఫ్ర‌మ్ హోం` చిత్రాన్ని ఓ రోజు ముందుగానే సోనీ పిక్చ‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండియా విడుద‌ల చేస్తుంది. ఇంగ్లీశ్‌, హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో జూలై 4న ఈ సినిమా భారీ రేంజ్‌లో విడుద‌ల‌వుతుంది. మార్వెల్ సంస్థ నుండి వ‌స్తున్న సినిమాల‌పై క్రేజ్ క్ర‌మంగా పెరుగుతుంది. ఈ సంద‌ర్భంగా… సోనీ పిక్చ‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండియా మేనేజింగ్ డైరెక్ట‌ర్ వివేక్ కృష్ నాని మాట్లాడుతూ “సూప‌ర్‌హీరో స్పైడ‌ర్ మ్యాన్ సినిమాల‌కు ఇండియాలో మంచి క్రేజ్ ఉంటుంది. ప్రారంభం నుండే `స్పైడ‌ర్ మ్యాన్:  ఫార్ ఫ్ర‌మ్ హోం`పై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. ఈ నేప‌థ్యంలో సినిమాను జూలై 4న విడుద‌ల చేస్తున్నాం. 30వ తారీఖునే ఈసినిమా బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. హిందీ, తెలుగు, ఇంగ్లీష్‌, త‌మిళంలో సినిమాను విడుద‌ల చేస్తున్నాం“ అన్నారు.

విద్యుత్ రంగంపై సమీక్ష

Tags: ‘Spider-Man: Far From Home’, pre-released in India

జులై 12న ‘దొరసాని’ విడుదల

Date:22/06/2019

 

హైదరాబాద్‌ముచ్చట్లు:

పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని రేకెత్తించిన ‘దొరసాని’ జులై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూమధుర ఎంటర్ టైన్మెంట్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తిచేసుకొని గ్రాండ్  రిలీజ్ కి సిద్దం అవుతుంది. ఈ చిత్రంతో దర్శకుడిగా కె.వి.ఆర్ మహేంద్ర పరిచయం అవుతున్నాడు. 80వ దశకంలో తెలంగాణా ప్రాంతంలో జరిగిన ఒక స్వచ్ఛమైన ప్రేమకథ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది చిత్ర యూనిట్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ‘నింగిలోన పాలపుంత నవ్వులొంపెనే’ పాట దొరసాని పై అంచనాలను పెంచాయి. మరోపాట ‘కలవరమై.. కలవరమై’ఈనెల 24న రిలీజ్ అవుతుంది.కల్మషం లేని ప్రేమకథగా తెరకెక్కిన ‘దొరసాని ’ప్రేమకథలలో ప్రత్యేకస్థానంలో నిలుస్తుందంటున్నారు దర్శక నిర్మాతలు. ఆనంద్ దేవరకొండ,  శివాత్మిక రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా  పరిచయం అవుతోన్న ఈ చిత్రంలో కన్నడ కిశోర్, వినయ్ వర్మ, ‘ఫిదా’ శరణ్య ఇతర ప్రధాన పాత్రల్లోనటిస్తున్నారు.

ఇంజనీరింగ్ నిపుణలతో సీఎం జగన్ భేటీ

Tags: Counter Release on July 12

సందీప్ కిషన్ కోసం నటులుగా మారిన దర్శకులు

Date:19/06/2019

హైదరాబాద్ ముచ్చట్లు:

సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. కార్తీక్ రాజు దర్శకుడు. ఏకే ఎంట్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర సమర్పణలో వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కుతోంది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ నిర్మాతలు. సందీప్ కిషన్ సరసన అన్యా సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. జూలై 12న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రంలో అతిథి పాత్రల్లో దర్శకులు విఐ ఆనంద్, కార్తీక్ నరేన్, కథానాయిక మాళవిక నాయర్ నటించారు. వీరు ముగ్గురు సందీప్ కిష‌న్‌కి మంచి మిత్రులు.
సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘టైగర్’ చిత్రానికి విఐ ఆనంద్ దర్శకుడు. ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ ‘డిస్కో రాజా’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే, సందీప్ కిషన్ నటించిన ఓ తమిళ చిత్రానికి కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన ఓ తమిళ సినిమా తెలుగులో ‘డి 16’ పేరుతో విడుదలై మంచి విజయం సాధించింది. వీరిద్దరూ సందీప్ కిషన్ అడగ్గానే ఆయన కోసం అతిథి పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ రీరికార్డింగ్ చేస్తున్నారు.

 

 

 

 

 

ఇటీవల ఈ సినిమాలో తొలి పాట, ప్రముఖ స్టయిలిస్ట్ నీరజ కోన రాసిన టైటిల్ సాంగ్ ‘నిను వీడని నీడను నేనే’ విడుదలైంది. ఈ పాటకు శ్రోతల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. అలాగే, ఈ సినిమాలో ఫన్, హై ఎనర్జిటిక్ సాంగ్ ‘ఎక్స్‌క్యూజ్ మీ రాక్షసి …’ను హీరో సిద్ధార్థ్ పాడారు. త్వరలో ఈ పాట విడుదల కానుంది. “సినిమా బాగా వచ్చింది. సందీప్ కిషన్ అద్భుతంగా చేశాడు. రీ రికార్డింగ్ చేస్తూ ఎగ్జయిటయ్యను” అని ఎస్.ఎస్. తమన్ ట్వీట్ చేశారు. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు, సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి జూలై 12న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, పూర్ణిమ భగ్యరాజ్, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్రకుమార్ – ఫణి కందుకూరి, సంగీతం: ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహణం: ప్రమోద్ వర్మ, ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: విదేష్, ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ  చెర్రీ, సీతారామ్, కిరుబాక‌ర‌న్‌, నిర్మాతలు: దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్, దర్శకుడు: కార్తీక్ రాజు.

రాజ్‌ తరుణ్‌ హీరోగా కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో

Tags:Directors who turned actors for Sandeep Kishan

రాజ్‌ తరుణ్‌ హీరోగా కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో 

Date:19/06/2019

హైదరాబాద్ ముచ్చట్లు:

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా హిట్‌ చిత్రాల నిర్మాత కె.కె. రాధామోహన్‌ శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై యువ దర్శకుడు కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘ప్రొడక్షన్‌

నెం.8′ పూజా కార్యక్రమాలు సంస్థ కార్యాలయంలో జూన్‌ 19 ఉదయం 8.30 గంటలకు జరిగాయి.
ఈ సందర్భంగా నిర్మాత కె.కె. రాధామోహన్‌ మాట్లాడుతూ – ”అధినేత’. ‘ఏమైంది ఈవేళ’. ‘బెంగాల్‌ టైగర్‌’, ‘పంతం’ వంటి మంచి హిట్‌ చిత్రాల తర్వాత మా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బేనర్‌లో చేస్తున్న మరో

మంచి కథా చిత్రం ఇది. రాజ్‌ తరుణ్‌, కొండా విజయ్‌కుమార్‌ కాంబినేషన్‌లో ఇది మా బేనర్‌కి మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది” అన్నారు.
దర్శకుడు కొండా విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ – ”మూడు సంవత్సరాల పాటు వర్క్‌ చేసి రెడీ చేసిన అద్భుతమైన ఈ కథను రాధామోహన్‌గారు విన్న వెంటనే స్టార్ట్‌ చేద్దాం అన్నారు. రాజ్‌ తరుణ్‌కి

ఇది చాలా మంచి సినిమా అవుతుంది. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ కంటే మంచి కథ ఇది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ రాధామోహన్‌గారి బేనర్‌లో చెయ్యడం చాలా ఆనందంగా ఉంది” అన్నారు.
రాజ్‌ తరుణ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌ నుండి నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో నటించే నటీనటుల ఎంపిక జరుగుతోంది.
ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఫొటోగ్రఫీ: ఆండ్రూస్‌, మాటలు: నంద్యాల రవి, ఆర్ట్‌: రాజ్‌కుమార్‌, కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, మేకప్‌: శివ, కాస్ట్యూమ్స్‌: నాగులు, స్టిల్స్‌: ఆనంద్‌, పబ్లిసిటీ:

ధని ఏలె, నిర్మాత: కె.కె. రాధామోహన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.

అంబెద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తా

Tags:Directed by Konda Vijaykumar as Raj Tarun

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘రాజా నరసింహా’ 

Date:17/06/2019

హైదరాబాద్‌ముచ్చట్లు:

మమ్ముటీ, జై, మహిమా నంబియర్‌ కీలక పాత్రధారులుగా మలయాళంలో తెరకెక్కిన ‘మధురరాజా’ చిత్రాన్ని ‘రాజా నరసింహా’ టైటిల్‌తో జై చెన్నకేశవ పిక్చర్స్‌ పతాకంపై సాధుశేఖర్‌ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘మన్యంపులి’తో ఘన విజయం అందుకున్న వైశాక్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదలై దాదాపు వంద కోట్లు వసూళ్లు రాబట్టింది. ‘యాత్ర’ వంటి సూపర్‌హిట్‌ సినిమా మమ్ముటీ హీరోగా తెలుగులో వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం అనువాద కార్యక్రమాల్లో ఉంది. జూలైలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ.. ‘‘మలయాళంలో భారీ విజయం సాధించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. చక్కని సందేశం కూడా ఉంది. మమ్ముటీ, జై పాత్రలు ఆకట్టుకుంటాయి. ప్రతినాయకుడిగా జగపతిబాబు పాత్ర మరోస్థాయిలో ఉంటుంది. సన్నీలియోన్‌ నటించిన ప్రత్యేక గీతం యువతను ఉర్రూతలూగిస్తుంది. గోపీ సుందర్‌ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ. త్వరలో అనువాద కార్యక్రమాలు పూర్తి చేసి జూలైలో సినిమాను విడుదల చేస్తాం’’అని అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: నూల అశోక్‌, నిర్మాణ సారధ్యం: వడ్డీ రామానుజం, పురం రాధాకృష్ణ.

గుణ 369` టీజ‌ర్‌కు అద్భుత స్పంద‌న‌..!

Tags: Action Entertainer ‘Raja Narasimha’