సెన్సార్ స‌భ్యుల ప్ర‌శంస‌లందుకున్న `ఇదే మా క‌థ`.

Date:03/05/2021

సినిమా ముచట్లు

యువ హీరో సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్ ప్రధాన పాత్రలలో గురు పవన్ దర్శకత్వం వహించిన రోడ్ జర్నీ చిత్రం ‘ఇదే మా కథస‌.  ‘రైడర్స్ స్టోరీ’ అనేది ట్యాగ్‌లైన్‌. ఎన్‌. సుబ్ర‌హ్మ‌ణ్యం ఆశీస్సుల‌తో  శ్రీమతి మనోరమ గురప్ప సమర్ప‌ణ‌లో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై జి.మహేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇప్ప‌టికే రిలీజ్ చేసిన టీజ‌ర్‌, `అడ్వంచ‌ర్ అవైట్స్` అనే క్యాప్ష‌న్‌తో కూడిన‌ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. స‌రికొత్త క‌థ-క‌థ‌నంతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం ఇటీవ‌లే సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది. సినిమా చూసి సెన్సార్ స‌భ్యులు చిత్ర యూనిట్‌ని ప్ర‌శంసించి  ‘యూ’ సర్టిఫికెట్ ఇచ్చారు.  అమేజింగ్ విజువ‌ల్స్‌, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో రూపొందిన ఈ చిత్రంలో నాలుగు ప్ర‌ధాన పాత్ర‌లు, ఆ పాత్ర‌ల్లో సుమంత్ అశ్విన్‌, శ్రీ‌కాంత్‌, భూమిక‌, తాన్యా హోప్ న‌ట‌న హైలైట్ అవుతుంద‌ని అలాగే సి.రామ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ, సునీల్ క‌శ్య‌ప్ మ్యూజిక్ సినిమాకు మంచి అసెట్ అవుతాయ‌ని
చిత్ర బృందం తెలిపింది.
తారాగ‌ణం: సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక‌, తాన్యా హోప్, సుబ్బ‌రాజు, సప్తగిరి, పృథ్వీ, సమీర్, రామ్ ప్ర‌సాద్‌, తివిక్రమ్ సాయి, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మ‌ధుమ‌ణి, సంధ్య జన‌క్.

పుంగనూరు డిపోకు 65 సర్వీసులు కేటాయింపు

Tags:This is our story, which has been praised by censors.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *