సోమలలో నిబంధనలు పాటించక పోతే కఠిన చర్యలు-రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి

Date:04/05/2021

సోమల ముచ్చట్లు:

ఏపీలో కరోనా కేసుల విజృంభణ దృష్ట్యా నేటి నుంచి రాకపోకల నియంత్రణ పాక్షిక కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని పెద్దిరెడ్డి అన్నారు. సోమలలో మంగళ వారం నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేటి నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే షాపులు తెరిచేందుకు అనుమతి ఉందన్నారు. దీంతో పాటు ప్రజా రవాణాపైనా ఆంక్షలు విధించారని, నిర్ణీత సమయాలను మించి రాకపోకలను కొనసాగించ రాదని అన్నారు. రవాణా నియంత్రించడం ద్వారా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
మద్యాహ్నం 12 గంటల తర్వాత అత్యవసర సేవల వాహనాలను మాత్రమే రోడ్లపైకి అనుమతి ఉందన్నారు. ఉదయం షాపులు తెరిచే సమయంలోనే ప్రజా రవాణాకు కూడా అనుమతి కలదని చెప్పారు. ఆ సమయంలోనూ 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని తెలిపారు. గుంపులు గుంపులుగా షాపింగ్‌లు చేయడం, ప్రయాణాలు చేయడాన్ని నిషేధం అన్నారు. నేటి నుంచి మొదలయ్యే ఈ ఆంక్షలు రెండు వారాల పాటు కొనసాగుతాయని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది కనుక సోమల మండలం నందు 5 వ తేదీ నుండి 19 వరకు పాక్షి క కర్ఫ్యూ అమలు చేయ బడును. 144 సెక్షను అమలుకాబడునని తెలయ జేశారు. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పకుండా వేసుకొనవలెనని సూచించారు. నిబంధనలు పాటించకపోతే అధికారుల కఠిన చర్యలకు గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమం లో ఎంపీడీవో, తహసీల్దార్, వైద్యాధికారులు పాల్గొన్నారు.

పుంగనూరు డిపోకు 65 సర్వీసులు కేటాయింపు

Tags: Acción estricta si no se siguen las reglas en Somala-Secretary of State Peddireddy
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *