వైద్యశిబిరానికి స్పందన

Date:02/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం పూజగానిపల్లెలో శుక్రవారం మెడికల్‌ ఆఫీసర్‌ సోనియా ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 75 మందికి వైద్య చికిత్సలు చేశారు. అలాగే గ్రామంలో మురుగునీటి కాలువలను , పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది సోమలి, హరి, మురళి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

4న నరసింహాస్వామి కళ్యాణ మండపాలు నిర్వహణ వేలం

Tags: Response to a medical camp

25 న ఉచిత దంత వైద్యశిబిరం

Date:24/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని తేరువీధిలో గల దివ్యజ్ఞాన మందిరంలో గురువారం ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు మందిర వ్యవస్థాపకులు డాక్టర్‌ రమణరావు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు డాక్టర్లు కె.ఉష, జి.గురు ఆధ్వర్యంలో దంత వైద్యశిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వైద్యశిబిరంలో కంటి రోగులు హాజరై, చికిత్సలు చేసుకోవాలని ఆయన కోరారు.

చాముండేశ్వరిదేవి జయంతి ఉత్సవాలు

Tags: Free dental camp on the 25th

మానవత్వంతో వైద్య సేవలు అందించండి : కలెక్టర్

Date:14/06/2019

పత్తికొండ ముచ్చట్లు:

మానవత్వంతో రోగులకు వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ వైద్యులను ఆదేశించారు.  శుక్రవారం పత్తికొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యుల హాజరు పట్టికను తీసుకుని వైద్యులు, సిబ్బంది హాజరు అయ్యారా లేదా అని పేరు పేరున పిలిచి హాజరు అయ్యినట్టు రూడి చేసుకున్నారు.  ఆసుపత్రిలోని అన్ని వార్డులు తిరుగుతూ తనిఖీ చేశారు.  రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.  మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని , అంబులెన్స్ అందుబాటులో లేదని పలువురు ఫిర్యాదు చేశారు.  రోగికి మెరుగైన చికిత్స అందించడానికి కర్నూలుకు పంపించేందుకు అంబులెన్స్ సిద్ధం చేయాలని వైద్యులను ఆదేశించారు.  మరుగుదొడ్లను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఏడుగురు వైద్యులున్నారు.  రోగులకు మెరుగైన వైద్యం అందించక పోతే ఎలా అని వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో సమస్యలు విన్నానని, వాటిని పరిష్కరిస్తామని చెప్పారు.

 

 

 

 

త్వరలో వైద్యులతో , అధికారులతో సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు.  మరో సారి ఆకస్మికంగా ఈ ఆసుపత్రిని తనిఖీ చేస్తామన్నారు.  అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ( సెంట్రల్)  లో పంచాయతీ ఎన్నికల నిమిత్తం ఏర్పాటు చేయబోయే పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించి పలు సూచనలు జారీ చేశారు.  ఈ కార్యక్రమంలో ఆర్డీవో రామమూర్తి, తహసీల్దార్, డివిజనల్ పంచాయతీ అధికారి, వైద్యులు, నర్సులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

కొత్తయిండ్లు హైస్కూల్‌లో అడ్మీషన్ల జోరు

Tags: Provide medical services with humanity: Collector

లయన్స్ క్లబ్ చే వైద్యశిబిరం

Date:09/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు లయన్స్ క్లబ్  ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కుప్పం పిఈఎస్‌ మెడికల్‌ క ళాశాలకు చెందిన వైద్యబృందంచే రోగులకు కంటి చికిత్సలు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు  లయన్స్ క్లబ్  మెంబర్‌ వెంకటాచలపతిరెడ్డి తెలిపారు. 60 మందికి చికిత్సలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు గిరిధర్‌, కేశవచారి, రఘుపతి తదితరులు పాల్గొన్నారు.

 

ఉద్యోగులకు ఐఆర్‌, సిపిఎస్‌ రద్దుపై హర్షం

 

Tags: The medical camp by the Lions Club

తెలుగుముచ్చట్లు రంజాన్‌ శుభాకాంక్షలు

Date:04/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

రంజాన్‌ పండుగను పురస్కరించుకుని ముస్లింలకు తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌ యాజమాన్యం , సిబ్బంది శుబాకాంక్షలు తెలిపారు. ముస్లింలు సుఖసంతోషాలతో రంజాన్‌ పండుగను కుటుంబ సభ్యులతో కలసి నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.

ఇట్లు…

తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌ , పుంగనూరు .

9న బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం కార్యవర్గం ఎన్నిక

Tags: Congratulations to Ramzan

పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే లయన్స్ క్లబ్ లక్ష్యం

– కొండవీటి నాగభూషణం

Date:12/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

పేద ప్రజలకు కార్పోరేట్‌ వైద్యం అందించి, వారి ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా లయన్స్ క్లబ్ పని చేస్తోందని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కొండవీటి నాగభూషణం అన్నారు. ఆదివారం స్థానిక అంబేద్కర్‌ భవన్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్యశిబిరాన్ని జిల్లా పీఆర్‌వో డాక్టర్‌ పి.శివ , చిత్తూరు వైఎస్సార్సీపి ఎంపీ అభ్యర్థి రెడ్డెప్పతో కలసి వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండవీటి నాగభూషణం మాట్లాడుతూ ప్రతి వారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి వైద్యశిబిరాలు క్రమం తప్పకుండ నిర్వహిస్తున్నామన్నారు. అలాగే మూడు నెలలకొక్కసారి అన్ని రకాల జబ్బులకు ఉచిత చికిత్సలు, ఆపరేషన్లు చేయించి, ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలో తిరుపతి మినహా ఎక్కడ గానీ కీడ్ని రోగ గ్రస్తులకు డయాలసిస్‌ సెంటర్లు లేకపోవడంతో దానిని దృష్టిలో ఉంచుకుని పుంగనూరులో సుమారు రూ.2 కోట్లతో రాంపల్లె వద్ద డయాలసిస్‌ సెంటర్‌ భవన నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. త్వరలోనే డయాలసిస్‌ సెంటర్‌ను ప్రారంభిస్తామన్నారు. ఈ విధంగా పేద ప్రజలకు కార్పోరేట్‌ వైద్యం అందించే లక్ష్యంతో లయన్స్ క్లబ్ఆహర్నిశలు కృషి చేస్తోందన్నారు. అలాగే పేద ప్రజల కోసం , వారి కులవృత్తుల ఆధారంగా మహిళలకు పనిముట్లు అందజేసి, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తున్నామన్నారు. పేద విద్యార్థులకు కంప్యూటర్లు, ల్యాబ్‌ట్యాప్‌లు పంపిణీ చేశామన్నారు. జిల్లాలో ఎక్కడ లేని విధంగా పుంగనూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులకు, ప్రజలకు డెంగ్యూ, మలేరియా జ్వరాలకు మందులు ఉచితంగా పంపిణీ చేసిన ఘనత పుంగనూరు లయన్స్ క్లబ్ దేనన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మెగా వైద్యశిబిరాన్ని కుప్పం పీఇఎస్‌ మెడికల్‌ కళాశాలకు చెందిన 10 మంది డాక్టర్లు, 15 మంది సిబ్బంది పాల్గొని ప్రజలకు వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు వరదారెడ్డి, మహేంద్రరావు, గోపాలక్రిష్ణ, వెంకటాచలపతిరెడ్డి, రఘుపతి, మునిరత్నంరెడ్డి, గిరిధర్‌, ఇంతియాజ్‌ పాల్గొన్నారు.

 

చిన్నశేష వాహనంపై గోవిందుని రాజసం

 

Tags: The goal of the Lions Club is to protect the health of the poor

ఈనెల 24న పుంగనూరు లయన్స్ క్లబ్‌ ఆధ్వర్యంలో వాస్కూలార్‌ చికిత్సలు

Date:23/01/2018

Tags : Vaskoolar Treatments under Punganur Lionsclub on 24th of this month