హైకోర్టులో ఈటల కుటుంబం పిటిషన్

Date:04/05/2021

హైదరాబాద్ ముచ్చట్లు:

భూకబ్జా ఆరోపణల వ్యవహారంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈరోజు హైకోర్టును ఆశ్రయించింది.ఈటల సతీమణి, కుమారుడు, జమునా హేచరీస్ కంపెనీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ భూముల్లో చట్ట విరుద్ధంగా సర్వే చేశారని పిటిషనర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.తమకు సంబందించిన భూముల్లో సర్వే చేసి బోర్డులను పెట్టారని జమునా హేచరీస్ కోర్టుకు వివరించింది. తమ భూముల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశించాలని బలవంతపు చర్యలు తీసుకోకుండా డీజీపీ,  విజిలెన్స్, మెదక్ కలెక్టర్ ను ఆదేశించాలని పిటిషనర్లు కోరారు.మెదక్ కలెక్టర్ ఇచ్చిన నివేదిక తప్పుల తడకగా ఉందని.. అచ్చంపేటలో తమ భూముల్లో అక్రమంగా సర్వే చేశారని పేర్కొన్నారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా విచారణ జరిపిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.తమ భూముల్లో జోక్యం చేసుకోకుండా అధికారులకు ఆదేశాలివ్వాలన్నారు.

పుంగనూరు డిపోకు 65 సర్వీసులు కేటాయింపు

Tags:Yitala family petition in the High Court

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *