మరట్వాడ నుంచి ఉత్తర కర్ణాటక వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి

Date:01/08/2020

అమరావతి  ముచ్చట్లు:

మరో వైపు దక్షిణ కోస్తాంధ్రను ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.వీటి ప్రభావంతో శుక్రవారం ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి.చిత్తూరు, కర్నూలు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరుగా, మరికొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు జల్లులు పడ్డాయి.ఆగస్టు 1,2,3,4 తేదీల్లో దక్షిణకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, 3,4 తేదీల్లో ఉత్తరాంధ్ర, యానాంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.ఆగస్టు 4న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని విశాఖ అధికారులు తెలిపారు.

సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన

Tags:1.5 km surface trough from Marathwada to North Karnataka

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *