1.75 crore donation to SVA

ఎస్వీ అన్న‌ప్ర‌సాదానికి రూ.1.75 కోట్లు విరాళం

Date:13/12/2019

తిరుమ‌ల‌ ముచ్చట్లు:

టిటిడి శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్‌కు శుక్రవారం రూ. 1.75 కోట్ల రూపాయలను దాత‌లు  విరాళంగా అందించారు. తిరుమలలోని అన్న‌మయ్య భవనంలో టిటిడి అదనపు ఈవో ఎ.వి. ధర్మారెడ్డికి దాతలు విరాళాల డిడిలను అందజేశారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ టిటిడి అన్నప్రసాదం ట్రస్టు ద్వారా ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు అందించేందుకు సహకరిస్తున్న దాతల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. దాత‌లు అన్నప్రసాదం కార్యక్రమానికి తమ వంతు కృషి చేయాలనే గొప్ప ఉద్దేశ్యంతో విరాళాలు అందివ్వ‌డం  ద్వారా  ప్రతి రోజు దాదాపు లక్ష మందికి పైగా యాత్రికులకు టిటిడి ఉచిత అన్నప్రసాదం అందిస్తున్న‌ట్లు తెలిపారు. అమెరికాకు చెందిన ప్ర‌వాస భార‌తీయ‌ భక్తుడు శ్రీ ఎస్.వెంకట్ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ .1,05,06,500 (రూపాయల కోటి ఐదు లక్షల ఆరువేల ఐదు వందలు) విరాళంగా ఇవ్వగా, చండీఘ‌డ్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ సంస్థ నెక్టార్ లైఫ్ సైన్సెస్ సిఎండి శ్రీ సంజయ్ గోయల్ రూ .51 లక్షలు, ఎపి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు రూ .10 లక్షలు అందించారు. ఈ విరాళాలతో పాటు, అజ్ఞాత భ‌క్తుడు శ్రీ‌వారికి మూడు సంవ‌త్స‌రాలకు స‌రిప‌డే మెల్‌చాట్ వస్త్రాల కోసం సుమారు రూ .1.20 కోట్లు  విరాళంగా ఇవ్వనున్న‌ట్లు అదనపు ఈవో తెలిపారు.

 

గ్రామ‌స్థాయిలో మ‌రింత విస్తృతంగా ధ‌ర్మ‌ప్ర‌చారం

 

Tags:1.75 crore donation to SVA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *