1 నుంచి 29 చింతమాకులపల్లెలో గడప గడపకు. 

చౌడేపల్లె ముచ్చట్లు:


మండలంలోని 29 ఏ చింతమాకులపల్లె గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ఈనెల 1,2 వతేదీల్లో రెండు రోజులపాటు గడప గపడకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి పిఏ మునితుకారం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 1న సోమవారం ఖాన్‌సాబ్‌మిట్ట, బయ్యపల్లె, 29 ఏ చింతమాకులపల్లెల్లో గ్రామాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మమేకమౌతున్నట్లు తెలిపారు. అలాగే 2 వతేది మంగళవారం కెంగనపల్లె, బి. కదిరేపల్లె, పిఎల్‌ కొత్తూరు గ్రామాల్లో పర్యటించనున్నట్లు చెప్పారు. ఈకార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకావాలని కోరారు.

 

Tags: 1 to 29 Don’t hang out in Chintamakulapalle.

Leave A Reply

Your email address will not be published.