బహిష్కరణ కాదన్నందుకు 10వేలు జరిమానా

నల్గొండ ముచ్చట్లు:

 

రాచరిక యుగంలో జనాలు ఏదైనా తప్పు చేస్తే తరచుగా వినిపించే శిక్ష.. గ్రామ బహిష్కరణ లేదా రాజ్య బహిష్కరణ. టెక్నాలజీ ఈ స్థాయిలో ఉన్న నేటి ఆత్యాధునిక యుగంలోనూ ఇలాంటి పదాలు వినాల్సి వస్తోంది. తాజాగా నల్గొండ జిల్లాలో పలువురిని గ్రామ బహిష్కరణ చేశారు. పెద్దల మాట విననందుకు పలువురిని ఏకంగా కులం నుంచి కూడా వెలివేశారు. పంచాయతీకి పిలిస్తే రాలేదని ఓ కుటుంబాన్ని కుల పెద్దలు కుల, గ్రామ బహిష్కరణ చేశారు.ఈ బహిష్కరణకు గురైన కుటుంబంతో ఎవరైనా మాట్లాడినా, సహాయపడినా.. వారికి రూ.10 వేలు జరిమానా విధిస్తామని పెద్దలు హుకుం జారీ చేశారు. ఈ మేరకు కుల బహిష్కరణపై కుల పెద్దలు ఒప్పంద పత్రాలు సైతం రాసుకోవడం గమనించదగ్గ విషయం. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం భైరవుని బండలో పులిగిల్ల అంజయ్య కుటుంబానికి.. అదే సామాజిక వర్గానికి చెందిన మరో కుటుంబంతో కొన్నేళ్లుగా భూ వివాదం ఉంది. ఈ భూ వివాదం కుల పెద్దల వరకు చేరగా.. చర్చల కోసం ఈ నెల 26న కుల పెద్దలు ఇరు కుటుంబాలకు పంచాయతీకి రమ్మని కబురు పంపారు.ఆ పిలుపును అంజయ్య కుటుంబం పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన కుల పెద్దలు.. తమ మాట వినకుండా కుల ధిక్కరణ చేశారంటూ అంజయ్య కుటుంబాన్ని కుల, గ్రామ బహిష్కరణ చేశారు. ఈ మేరకు ఒప్పంద పత్రం రాసుకొని ప్రచారం చేశారు. దీన్ని అవమానంగా భావించిన అంజయ్య పోలీసులను ఆశ్రయించి.. కారకులపై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags: 10 finger fine for not deportation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *