Natyam ad

పుంగనూరులో గడప గడపలో సమస్యకు రూ.10 లక్షలు నిధులు

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని ఉబేదుల్లాకాంపౌండులో గల రోడ్డు అధ్వాన్నంగా ఉందని బాగు చేయాలని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు కోరారు. గురువారం రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు చైర్మన్‌ అలీమ్‌బాషా రూ.10 లక్షలు నిధులు విడుదల చేశారని కౌన్సిలర్‌ అమ్ము తెలిపారు. సిమెంటు రోడ్డు పనులను ఒకే రోజులో ప్రారంభించి, పూర్తి చేశారు. అమ్ము మాట్లాడుతూ గడప గడపకు పర్యటనలో వచ్చే సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత కల్పించామన్నారు. చిన్న సమస్యను కూడ పరిష్కరిస్తూ ఆదర్శమైన పరిపాలన సాగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు రాజేష్‌, జావీద్‌, అమ్ముకుట్టి తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: 10 lakh funds for the problem of Gadapa Gadapa in Punganur

Post Midle