10 lakh supari to kill husband

భర్తను చంపేందుకు 10 లక్షల సుపారి

Date:03/12/2020

గుంటూరు ముచ్చట్లు:

ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను నిర్ధాక్షిణ్యంగా కడతేర్చింది ఓ భార్య. ఏకంగా రూ.10లక్షలు సుపారీ ఇచ్చి మరీ భర్తను చంపించేసింది కట్టుకున్న భార్య. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో పెను సంచలనం సృష్టించింది. భార్య ఇచ్చిన సుపారీ తీసుకున్న కిరాయి గూండాలు సదరు భర్తపై అత్యంత విషపూరిత రసాయినాలు చల్లి దాడి చేసి హత్య చేశారు.గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు మండలం తాళ్లూరుకు చెందిన భాష్యం బ్రహ్మయ్య అనే వ్యక్తి తన కుటుంబంతో నివసిస్తున్నాడు. బ్రహ్మయ్యకు ఓ హోటల్‌ ఉంది. హోటల్ వ్యాపారంతో పాటు పాల తోపాటు పాల వ్యాపారం కూడా చేస్తున్నాడు. ఈక్రమంలో నవంబర్ 4న గ్రామ శివారులో బ్రహ్మయ్యను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించారు.

 

దీంతో షాక్ అయిన బ్రహ్మయ్య మీరెవరు? నన్నెందుకు ఆపారని ప్రశ్నించేందుకు యత్నించాడు. కానీ ఆ అవకాశం బ్రహ్మయ్యకు ఇవ్వకుండానే సదరు వ్యక్తులు అతని ముఖంపై విషపూరిత రసాయనాలు చల్లి దాడి చేశారువారెవరో..తనపై ఎందుకు దాడి చేస్తున్నారో తెలియని బ్రహ్మయ్య షాక్ కు గురయ్యాడు. కానీ వెంటనే తేరుకునేలోపే జరగాల్సిందంతా జరిగిపోయింది. కానీ వారి నుంచి అతి కష్టంతో తప్పించుకున్న బ్రహ్మయ్య సమీపంలో ఉండే బంధువుల ఇంటికి చేరుకుని జరిగిన విషయం చెప్పాడు. కంగారు పడిన బ్రహ్మయ్య బంధువులు అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే కన్నుమూశాడు.దీంతో బంధువులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయం చెప్పి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంట్లో భాగంగానే బ్రహ్మయ్య భార్య ఫోన్ తో పాటు భార్య సాయి కుమారి కాల్ డేటాను పరిశీలించారు. హత్య జరిగిన రోజు రాత్రి బ్రహ్మయ్య భార్య సాయికుమారి అదే గ్రామానికి చెందిన అశోక్‌రెడ్డికి కాల్ చేసినట్టు గుర్తించారు.

 

 

అదే సమయంలో కృష్ణా జిల్లా మచిలీపట్టణానికి కూడా ఫోన్ చేసినట్లు గుర్తించారు. కాల్‌డేటా ఆధారంగా సాయికుమారిని విచారించగా అశోక్‌రెడ్డితో ఉన్న వివాహేతర సంబంధం బయటపడింది. దీంతో మరింత లోతుగా విచారించిన పోలీసులు బ్రహ్మయ్య హత్యకు పన్నిన కుట్ర బయటపడింది.అశోక్ రెడ్డితో సాయి కుమారి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న క్రమంలో భర్త అడ్డుతొలగించాలని ఇద్దరూ ప్లాన్ వేశారు. దీంతో ప్రియుడు అశోక్‌రెడ్డితో కలిసి సాయికుమారి భర్త హత్యకు కుట్ర చేసింది. దీంట్లో భాగంగా ప్రియుడు అశోక్ రెడ్డి సలహాతో మచిలీపట్టణానికి చెందిన పవన్ కుమార్, షేక్ షరీఫ్‌లతో రూ. 10 లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కొంత మొత్తం అడ్వాన్స్‌ కూడా ఇచ్చారు.అడ్వాన్స్ తీసుకున్న సదరు వ్యక్తులు రక్త పాతం జరక్కుండా హత్య చేయాలని ప్లాన్ చేశారు. దీని కోసం సైనేడ్‌ను ఉపయోగించాలనుకున్నాడు. దాన్ని సంపాదించారు. అది పనిచేస్తుందో, లేదో తెలుసుకోవటానికి ఓ కుక్కకు దాన్ని తినిపించారు.

 

వెంటనే ఆ కుక్క చచ్చిపోయింది.దీంతో ఇక బ్రహ్మయ్య హత్యకు సిద్దమయ్యారు. అతడిని చంపేందుకు అతను ఏఏ సమయాన్ని ఎక్కడెక్కడ ఉంటాడు? ఏం చేస్తుంటాడని రెక్కీ నిర్వహించారు. ఆ తర్వాత గ్రామ శివారులో ఒంటరిగా కనిపించిన బ్రహ్మయ్యపై సైనేడ్ చల్లారు..తరువాత దాడికి యత్నించగా తప్పించుకుని బ్రహ్మయ్య పరారవ్వటంతో వాళ్లు కూడా అక్కడ నుంచి పరారయ్యారు. నైనేడ్ ప్రభావంతోనే అతడు మరణించినట్టు పోస్ట్ మార్టం రిపోర్డులో కూడా తేలింది. కేసు క్లియర్ కావటంతో సుపారీ తీసుకున్న ఇద్దరు యువకులతోపాటు సాయికుమారి, అతడి ప్రియుడు అశోక్‌రెడ్డిలను అరెస్ట్ చేశారు.ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చులు పెడుతున్నాయి. మోహావేశమో..డబ్బు కోసమో కారణం ఏదైనా వివాహ వ్యవస్థ విచ్ఛిన్నమవుతున్న అనేక ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వివాహేతర సంబంధాలు..వివాహ బంధాన్ని ప్రశ్నార్థం చేస్తున్నాయి. ఏకంగా భార్య ప్రాణాలు భర్తా..భర్త ప్రాణాలు భార్య తీసేందుకు కూడా వెనుకాడటంలేదు. ఇటువంటి దారుణ ఘటనలు సభ్య సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటువంటి ఎన్నో ఘటనలు వివాహ వ్యవస్థనే ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి.

 

విశాఖలో ప్రేమోన్మాది

Tags:10 lakh supari to kill husband

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *