Natyam ad

కూలీల ఆటోను ఢీకొన్న కారు 10 మందికి గాయాలు 

– ఇద్దరి పరిస్థితి విషమం

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

కూలీ పనులకు ఆటోలో వెళ్లి తిరిగి గ్రామానికి వస్తుండగా అతివేగంగా వస్తున్న కారు వెనుకవైపు  ఆటోను ఢీకొనడంతో ఆటో బోల్తా పడి 10 మంది గాయపడిన సంఘటన మండలంలోని పత్తెమ్మగారిపల్లె వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. మండలంలోని సింగిరిగుంట గ్రామానికి చెందిన కూలీలు గాయిత్రి(32), పుట్టమ్మ(45) , జ్యోతి(35), పెద్దరెడ్డెమ్మ(45), పద్మావతి(45), పార్వతమ్మ(60), వైశాలి(18), నాగవేణి(22), మునెమ్మ(65), సుజాత(45) కూలీ పనులకు వెళ్లి జీవనం చేస్తుంటారు. ఇలా ఉండగా ఉదయం ఆటోలో కూలీ పనులకు వెళ్లి రామసముద్రం మండలం వనగానిపల్లెకు వెళ్లి తిరిగి వస్తుండగా మార్గ మధ్యంలోని పత్తెమ్మగారిపల్లె వద్ద వెనుకవైపు నుంచి కారు ఢీకొని వేగంగా వెళ్ళిపోయింది. ఈ సంఘటనతో ఆటో బోల్తాపడటంతో కూలీలు గాయపడ్డారు. దీనిని గమనించిన ఆప్రాంత వాసులు 108 లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో మునెమ్మ, సుజాత పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, సచివాలయాల కన్వీనర్‌ రాజశేఖర్‌రెడ్డి ఆసుపత్రికి  చేరుకుని , గాయపడిన వారికి మెరుగైన సేవలు అందించారు. ఈ మేరకు  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: 10 people were injured when the car collided with the workers’ auto

Post Midle