అమరావతి ముచ్చట్లు:
1.అతిగా బరువు తగ్గిపోవడం
క్యానర్స్ ఉన్న చాలా మంది ఒకానొక సమయంలో బాగా బరువు తగ్గిపోతుంటారు.ఐదు లేదా అంతకంటే ఎక్కువ కేజీలు బరువు తగ్గిపోవడాన్ని క్యాన్సర్ తొలి సంకేతంగా చూడొచ్చు.పాంక్రియాస్, కడుపు, ఊపిరితిత్తుల క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్ వచ్చినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది.
2.జ్వరం
క్యాన్సర్ వచ్చిన రోగుల్లో జ్వరమనేది సాధారణ లక్షణం. క్యాన్సర్ పుట్టిన దగ్గర్నుంచి ఇతర అవయాలకు, శరీర భాగాలకు వ్యాప్తి చెందేటప్పుడు జ్వరం వస్తూ ఉంటుంది.క్యాన్సర్ ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో జ్వరం బారిన పడతారు.ముఖ్యంగా క్యాన్సర్, దాని చికిత్సలు రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుంటాయి. ఈ ప్రభావంతో క్యాన్సర్ ఉన్న రోగులు జ్వరం బారిన పడుతూ ఉంటారు.లుకేమియా లేదా లింఫోమా వంటి వాటికి జ్వరం ప్రాథమిక లక్షణం.
3.అలసట
క్యాన్సర్ లక్షణాల్లో ఒకటి అలసట. ఇది విపరీతంగా ఉంటుంది. విశ్రాంతి తీసుకున్నా కూడా అలసట నుంచి బయటపడలేరు.క్యాన్సర్ పెరుగుతుందనే దానికి ఇది ప్రధాన సంకేతంగా ఉంటోంది.లుకేమియా లాంటి కొన్ని క్యాన్సర్లలో అలసటే తొలి లక్షణంగా ఉంటోంది.పెద్ద పేగు లేదా కడుపు క్యాన్సర్లు రక్తహీనతకు కారణమవుతాయి. ఆ సమయంలో కూడా అలసట అనేది సాధారణం.
4.ప్రేగు, మూత్రాశయ తీరులో మార్పులు
మలబద్ధకం, డయేరియా, ఎక్కువ కాలం పాటు మలంలో మార్పులు పెద్దపేగు క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు.మూత్రానికి వెళ్లేటప్పుడు నొప్పి రావడం, మూత్రంలో రక్తం పడటం, మూత్రాశయ తీరులో మార్పులు అంటే పదే పదే మూత్రానికి వెళ్లాలనిపించడం లేదా తక్కువగా వెళ్లడం వంటివి బ్లాడర్ లేదా ప్రొస్టేట్ క్యాన్సర్లకు సంబంధించి ఉండొచ్చు.
5.గాయాలు మానకపోవడం
పుట్టుమచ్చలు పెరిగి, వాటి నుంచి రక్తం కారడం చర్మ క్యాన్సర్ లక్షణాలని చాలా మందికి తెలుసు.కానీ, చిన్న చిన్న గాయాలైనా ఎక్కువ కాలం మానకపోవడం కూడా క్యాన్సర్‌కు సంకేతాలని మనం తెలుసుకోవాలి.
6.నాలుగు వారాల కంటే ఎక్కువ కాలం చిన్న గాయాలు మానకపోతే వాటిపై దృష్టిపెట్టాలి.నోటి క్యాన్సర్ వల్ల నోట్లో పుండు కూడా త్వరగా మానదు.మీ నోట్లో దీర్ఘకాలం పాటు ఏదైనా మార్పులు కనిపిస్తే, వెంటనే డాక్టర్‌ను లేదా డెంటిస్ట్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.పురుషాంగం లేదా యోనిపై పుండ్లు కూడా ఇన్‌ఫెక్షన్‌కు లేదా ప్రారంభ దశలోని క్యాన్సర్‌కు సంకేతాలు.
7.రక్తస్రావం
ఒకవేళ మలంలో రక్తం పడితే, అది పెద్ద పేగు క్యాన్సర్‌కు లేదా మల క్యాన్సర్‌కు సంకేతం కావొచ్చు.ఎండోమెట్రియంకి చెందిన గర్భాశాయ క్యాన్సర్ వల్ల విపరీతమైన రక్తస్రావం కూడా అవుతుంది.మూత్రంలో రక్తం కనిపించడం బ్లాడర్ లేదా కిడ్నీ క్యాన్సర్‌కు సంకేతం.చనుమొనల నుంచి రక్తం కారడం రొమ్ము క్యాన్సర్ లక్షణాల్లో ఒకటి.
7.శరీరంలో ఏదైనా భాగం గట్టిగా మారిపోవడం
చర్మంలో మార్పుల ద్వారా మనం చాలా క్యాన్సర్లను గుర్తించవచ్చుఈ క్యాన్సర్లు ముఖ్యంగా రొమ్ముల్లో, వృషణాలు, గ్రంథులు, కణజాలల్లో ఏర్పడుతుంటాయి.క్యాన్సర్‌ను ప్రారంభంలో లేదా చివరి దశలో గుర్తించే సంకేతాల్లో ఒకటి ఏదైనా శరీర భాగం గట్టిగా మారిపోవడం
8.మింగడం కష్టమవ్వడం
ఆహారాన్ని మింగడం లేదా నీటిని తాగడం వంటి వాటిల్లో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, అవి అన్నవాహిక క్యాన్సర్‌కు, కడుపు క్యాన్సర్‌కు లేదా గొంతు క్యాన్సర్‌కు సంకేతంగా చూడొచ్చు.
10.విపరీతమైన దగ్గు లేదా గొంతు బొంగురుపోవడం
విపరీతంగా దగ్గు రావడం కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంకేతం.మూడు వారాలకు మించి దీని వల్ల ఇబ్బంది పడుతుంటే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.స్వరపేటిక లేదా థైరాయిడ్ గ్రంథిలో క్యాన్సర్‌కు గొంతు బొంగురుపోవడం కూడా ఒక లక్షణంగా ఉంటుంది.అయితే, పైన పేర్కొన్న ఈ లక్షణాలు క్యాన్సర్ వ్యాధికి సంబంధించినవే కాకపోవచ్చు. ఇతర కారణాల వల్ల కూడా ఈ సమస్యలు వస్తుంటాయి. అయితే, ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.
Tags: 10 Symptoms of Cancer… Don’t ignore any of these.