10 వేల కోట్ల సాయం….ప్రాధ‌మిక అంచ‌నా

Date:26/10/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

వ‌ర‌దొచ్చింది. ఇళ్లల్లోకి నీళ్లు పొయ్యాయి. రెండు రోజులు రోడ్ల‌పై న‌డ‌వ‌కుండా ఇబ్బంది ప‌డ్డారు. కూలిన ఇళ్లు కూలిపోయాయి. కూలిన ఇళ్ల‌కి క‌ట్టించాలి అన్నారు. స‌రే. బానే ఉంది. వారం పాటు వ‌ర‌ద నీటితో ఇబ్బందులు ప‌డ్డ జ‌నాల‌కి.. ప‌దివేల ప‌రిహారం ఇస్తామ‌న్నారు. ప‌దివేలే కాదు. ఇంకా ఎంతైనా సాయం చేస్తామంటున్నారు స‌రే. అంతా బానే ఉంది. కానీ.. ఈ రైతుల గోస ఎవ‌రు వినాలి. ఎవ‌రూ విన‌రా. ఎవ‌రూ ప‌ట్టించుకోరా. బ‌య‌టి రాష్ట్రాలే న‌‌‌య‌మున్న‌య్. వెంట‌నే వాళ్ల‌కి చేత‌నైనంత‌.. తోచినంత ఇస్తున్నారు. హీరోలు లాంటోళ్లు కూడా అనౌన్స్ చేశారు. అన్నీ వ‌ర‌ద సాయాలే. క‌రెక్టే అంతా బానే ఉంది. కానీ.. రైతుల‌కి ఏమిస్తున్నారు. ఏమిస్తారు. ఇంకా నో క్లారిటీఅస‌లు పొలాలే మున‌గ‌లేదా. పోనీ వ‌ర‌ద ఎఫెక్ట్ ఎక‌రాల‌పై ప‌డ‌లేదా. పంట న‌ష్ట‌పోలేదా. రైతులు బాధ ప‌డ‌ట్లేదా. ఒక్కో రైతు న‌డుముల లోతు పొలంలో నుంచుని.. ఏడుస్తున్నారు. పంట మొత్తం మునిగిపోయి.. పాచి పోయి.. ఏం చేయాలో తెలీక దిక్కు తోచ‌ని స్థితిలో ఉన్నారు. చేతి దాకా వ‌చ్చిన పంట‌.. కోసి మార్కెట్ కి పంపడ‌మే అనుకునే టైంలో ఈ గాలివాన‌లు వ‌చ్చాయి. ప్ర‌భుత్వాలు డ్యామ్స్ ని స‌రిగా ఆప‌రేట్ చేయ‌క‌.. నీటిని అంచ‌నా వేయ‌క‌.. స‌రైన రిపేర్లు చేయ‌క‌.. టైంకి గేట్లు తెర‌వ‌క పోవ‌డం వ‌ల్ల‌.. ల‌క్ష‌ల ఎక‌రాల‌పై వ‌ర‌ద నీటి ఎఫెక్ట్ ప‌డింది.అంతా ఆగ‌మాగం అయింది. చేసిన క‌ష్టాన్ని ఎలాగూ రైతు లెక్కేసుకోడు. కానీ.. పెట్టుబ‌డులు కౌళ్లు.. అప్పులు వాటి ప‌రిస్థితి ఏంటి. ఇదంతా ఎవ‌రు భ‌రించాలి. స‌రైన డ్యామ్ లు క‌ట్టి.. క‌ట్టిన డ్యాముల్ని సరిగా ఆప‌రేట్ చేస్తే ఈ తిప్ప‌లు ఉండ‌వు క‌దా. అవ‌న్నీ వ‌దిలేద్దాం. అస‌లు ఇప్పుడు పుట్టెడు క‌ష్టాల్లో ఉన్న అన్న‌దాత‌ను ఆదుకునే నాదుడు ఎవ‌రు. తెలుగు గ‌వ‌ర్న‌మెంట్ ల‌ను చూస్తుంటే.. రైతుల్ని లైట్ తీసుకుని.. వాళ్ల చావు వాళ్లు చ‌స్త‌ర్ లే అన్న‌ట్లు క‌నిపిస్తోంది.

32 మంది నక్సల్స్ లొంగుబాటు. 

Tags: 10 thousand crore assistance …. Preliminary estimate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *