పుంగనూరు మండలానికి 10 ట్రాక్టర్లు

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గమైన పుంగనూరు మండలానికి 10 గ్రూపుల రైతులకు వ్యవసాయ యంత్రాలు , పనిముట్లు చిత్తూరులో పంపిణీ చేశారు. మండలంలోని 10 సిహెచ్‌సి గ్రూపులకు చెందిన రైతులు విశ్వేశ్వరరెడ్డి, కృష్ణప్ప, చిన్నరామకృష్ణ, హేమాద్రి, శంకర్‌నాయక్‌, శ్రీరాములు, చెన్నకృష్ణ, సురేంద్ర, రామన్న , వెంకటరెడ్డి లు ట్రాక్టర్లు తీసుకున్నారు. ఒకొక్క గ్రూపుకు ఒకొక్క ట్రాక్టర్‌తో పాటు 30 రకాల వ్యవసాయ పనిముట్లు పంపిణి చేసినట్లు ఆమె తెలిపారు. ఒకొక్క గ్రూపుకు సుమారు రూ.20 లక్షలు విలువ చేసే యంత్రాలను అందించడం జరిగిందన్నారు.

 

Post Midle

Tags: 10 tractors for Punganur zone

Post Midle
Natyam ad