బ్రాహ్మణులను అవమానపరచిన 10టీవిని నిషేధించాలి

10 TVs that have insulted Brahmins should be banned

10 TVs that have insulted Brahmins should be banned

Date:26/02/2018

పుంగనూరు ముచ్చట్లు:

బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కించపరచిన 10 టీవి ఛానల్‌ను రెండు తెలుగు రాష్ట్రలలోను నిషేధించాలని బ్రాహ్మణ సంఘ నాయకులు డిమాండు చేశారు. సంఘ ప్రతినిధులు శంకర్‌శర్మ, ప్రసాద్‌, రామక్రిష్ణ, ఫణి, సుజాత , న్యాయవాది హర్షవర్ధన్‌, బాబు ఆధ్వర్యంలో బ్రాహ్మణులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి, 10 టీవికి వ్యతిరేక నినాదాలు చేశారు. తహశీల్ధార్‌ కార్యాలయానికి వెళ్లి ధర్నా చేసి, తహశీల్ధార్‌ మాధవరాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శంకర్‌శర్మ మాట్లాడుతూ సమాజంలో అందరి శ్రేయస్సు కాంక్షించే బ్రాహ్మణులను విమర్శించడం , అవమానించడం, బాధించడం చేస్తే భగవంతుడు క్షమించడని హెచ్చరించారు. ఇలాంటి చర్యలను సహించమన్నారు. వెంటనే దీనిపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘనాయకులు క్రిష్ణమూర్తి, మహేష్‌, ఉమా, తదితరులు పాల్గొన్నారు.

 

Tags: 10 TVs that have insulted Brahmins should be banned

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *