100 కోట్లు దోచుకొని నేడు అఖిలపక్ష మంటూ డ్రామాలు

-మంత్రి అనిల్ అవినీతి నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నాం
-అఖిలపక్షం ముందే మీ అవినీతి నిరూపిస్తాం.. ఇది మా ఛాలెంజ్
-టిడిపి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి

 

నెల్లూరు ముచ్చట్లు:

 

పెన్నా నదిలో  ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేసి  రూ 100 కోట్ల అవినీతికి పాల్పడిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నేడు తన అవినీతి ఎక్కడ బయట పడుతుందోనని బెంబేలెత్తి అఖిలపక్ష సమావేశం అంటూ కొత్త డ్రామాకు తెరతీశారు టిడిపి నెల్లూరు నగర నియోజకవర్గ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ధ్వజమెత్తారు.. నెల్లూరు నగరంలోని ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో టిడిపి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం అనంతరం వినతి పత్రం అందజేశారు.. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి అనిల్ అవినీతిని నిరూపించుకునేందుకు ఎక్కడైనా తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు.. అఖిలపక్షం అయినా సరేనన్నారు.. పర్మిషన్ లు ఇచ్చి ఇరవై నాలుగు రోజులు మాత్రమే అయిందని గత తొమ్మిది నెలలుగా ఇసుక అక్రమ దందా సాగుతోందన్నారు… 30 మీటర్ల  పెన్నా రీచ్ లో తవ్వకాలు చేశారని 1,50,000 క్యూబిక్ మీటర్ల ఇసుక బయటకు వెళ్లిందని కోటంరెడ్డి ఆరోపించారు.. తోలింది ఇసుక కాదు మట్టి అని మంత్రి శిబిరం కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.. మంత్రి అనిల్ కు దమ్ము ధైర్యం ఉంటే మాటలు చెప్పడం కాదని.. అఖిలపక్షం లోనే ఇసుకపై తేల్చుకుంటామని కోటం రెడ్డి ప్రకటించారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags; 100 crore robbery and all party dramas today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *