Srivari free darshan tokens issued in Tirupati!

తిరుమలలో సుంద‌ర‌కాండ పారాయ‌ణానికి 100 రోజులు

-విశ్వవ్యాప్తంగా భ‌క్తుల నుండి విశేష స్పంద‌న‌

Date:18/09/2020

తిరుమ‌ల ముచ్చట్లు:

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌లను కోవిడ్ బారి నుండి కాపాడి మెరుగైన ఆరోగ్యాన్ని ప్ర‌సాదించాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై టిటిడి నిర్వహిస్తున్న సుంద‌ర‌కాండ పారాయణం శుక్ర‌వారం నాటికి వంద రోజులు పూర్తి చేసుకుంది.  విశ్వ‌వ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తుల నుండి ఈ కార్య‌క్ర‌మానికి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. టిటిడి ప్రచురించిన సుందరకాండ పారాయణం పుస్తకంలో మొత్తం  68 సర్గలు 2821 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో  సుంద‌ర‌కాండ పారాయ‌ణం 100వ రోజు 15వ స‌ర్గ పూర్తి చేసుకుంది.  ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు ప‌ర్యా‌యాలు టిటిడి అఖండ పారాయ‌ణం నిర్వ‌హించింది. ఇందులో ప్ర‌థ‌మ స‌ర్గ నుండి 14వ స‌ర్గ వ‌ర‌కు ఉన్న 716 శ్లోకాల‌ను ప్ర‌ముఖ వేద పండితులు అఖండ పారాయ‌ణం చేశారు. ఇందులోని శ్లోకాల‌ను భ‌క్తుల‌తో ప‌లికించి అర్థ‌ తాత్ప‌ర్యాల‌తో పాటు ఆ శ్లోక ఉచ్చా‌‌ర‌ణ వ‌ల‌న క‌లిగే ఫ‌లితం, నేటి ఆధునిక స‌మాజంలోని మాన‌వాళికి ఏవిధ‌‌మైన సందేశం ఇస్తుందో వివ‌రిస్తూ నిరంత‌రాయంగా పారాయ‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు.    మొదటగా “యోగ‌వాశిస్టం – శ్రీ ధ‌న్వంత‌రి మ‌హామంత్రం” పారాయ‌ణాన్ని ఏప్రిల్ 10 నుండి జూన్ 10వ తేదీ వ‌ర‌కు 62 రోజుల పాటు నిర్వహించారు. ఆ తరువాత జూన్ 11వ తేదీ నుండి సుంద‌ర‌కాండ పారాయ‌ణం ప్రారంభమైన విష‌యం విదిత‌మే.  ఎస్వీబీసీలో ఉద‌యం 7.00 నుండి 8.00 గంట‌ల వ‌ర‌కు ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తున్న ఈ కార్య‌క్ర‌మాన్ని తెలుగు రాష్ట్రాల‌తోపాటు దేశ విదేశాల్లోని భ‌క్తులు పెద్ద‌సంఖ్య‌లో అనుస‌రించి త‌మ ఇళ్లలో పారాయ‌ణం చేస్తున్నారు.

టైంస్కేల్ ఇవ్వండి : టిటిడి ఉద్యోగుల సంఘం నాయకుడు రత్నప్రభాకర్

Tags: 100 days for Sundarakanda recitation in Thirumala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *